కూటికుప్పల సూర్యారావు
పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | MBBS,MNAMS,MD,PhD,FHM,FRCP |
విద్యాసంస్థ | ఆంధ్ర మెడికల్ కళాశాల, విశాఖపట్నం |
వృత్తి | వైద్యుడు శాస్త్రవేత్త |
జీవిత భాగస్వామి | శ్రీమతి గృహలక్ష్మి |
పిల్లలు | కూటికుప్పల శృజన, కూటికుప్పల శ్రీచరణ్, కూటికుప్పల శ్రావణ |
తల్లిదండ్రులు | కూటికుప్పల శ్రీరాములు, శ్రీమతి సన్యాసమ్మ |
వెబ్‌సైటు | http://drkutikuppalasuryarao.org/ |
కూటికుప్పల సూర్యారావు హె.ఐ.వి వైద్యంలో ప్రముఖ వైద్యులు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు మండలానికి చెందిన కింతలి గ్రామానికి చెందినవారు.[1] ఆయన కథా రచయిత.[2]
విద్య
[మార్చు]ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్, కొలంబో విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసన్ వద్ద ఎం.డి. ఫామిలీ మెడిసన్ చేసారు. ఆయన హెచ్.ఐ.విలో డాక్టరల్ ఫెలోషిప్ ను వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల నుండి చేసారు. తరువాత న్యూఢిల్లీ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి MNAMS పూర్తి చేసారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హెచ్.ఐ.వీ/ఎయిడ్స్ వైద్యంలో పి.హెచ్.డి చేసారు. ఆయనకు లండన్ లోని రాయల్ కాలేజి ఆఫ్ ఫిజీషియన్స్ నుండి ఫెలోషిప్ లభించింది. ఆయన తన వైద్యజీవితంలో చాలా భాగం హెచ్.ఐ.వీ/ఎయిడ్స్ పరిశోధన కోసం కృషిచేస్తున్నారు.
పురస్కారాలు , గుర్తింపులు
[మార్చు]- ఆయన చాలా ఎక్కువగా హెచ్.ఐ.వీ/ఎయిడ్స్ గూర్చి అవగాహన కల్పించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.[3]
- ఆయన వైద్యసేవలకు గానూ భారత ప్రభుత్వం భారత నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.[4][5]
- 1989లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పురస్కారాన్ని పొందారు.[6]
- మహాత్మా గాంధీ ప్రవాసీ సమ్మాన్న్ పురస్కారం. ఈ అరుదైన పురస్కారాన్ని 2015 సెప్టెంబరు 21 న బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో బరోనెస్ వర్మ (యు.కె. లోని అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి) ద్వారా అందుకున్నారు.[7]
ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జన శిక్షణ సమ్మేళన్ కు వైస్-చైర్మన్,, ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు నేషనల్ కమిటీ సభ్యుడు. ఆయన అనేక పరిసొధనా పత్రాలను వెలువరించారు. అవి వివిధ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. అవి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.[8]
మూలాలు
[మార్చు]- ↑ Bhattacharjee, Sumit (18 August 2012). "Doctor with a Mission". The Hindu. Chennai. Retrieved 20 February 2015.
- ↑ http://kathanilayam.com/writer/521[permanent dead link] కథానిలయంలో ఆయన రాసిన కథలు,పుస్తకాల వివరాలు
- ↑ Patnaik, Santosh (2 December 2009). "AIDS Ribbon Enters Guinness Book". The Hindu. Chennai. Retrieved 20 February 2015.
- ↑ Press Information Bureau (25 January 2008). "Padma Awards Announced" (Press release). Government of India. Retrieved 20 February 2015.
- ↑ "Padma Awards". Hindustan Times. New Delhi. Indo-Asian News Service. 25 January 2008. Archived from the original on 20 ఫిబ్రవరి 2015. Retrieved 20 February 2015.
- ↑ "Befitting Honour for Susheela: Mridangist Yella, Social Worker Surya Rao, Artist Chetty Get Padma Shri". The Hindu. Chennai. 26 January 2008. Retrieved 20 February 2015.
- ↑ "A rare honour for Telugu doctor Kutikuppala Surya Rao". The Hindu. Hyderabad. 11 September 2015. Retrieved 30 September 2015.
- ↑ "Focus on Curing HIV patients: Physician Kutikuppala Surya Rao". The Times of India. Mumbai. Retrieved 20 February 2015.