Jump to content

కూడేరు రాజగోపాల్

వికీపీడియా నుండి

కూడేరు రాజగోపాల్ భారతీయ విద్యావేత్త. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలరుగా పనిచేశాడు.[1]

తొలి జీవితం

[మార్చు]

ఆయన 1953 ఫిబ్రవరి 2 న ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురంలో జన్మించాడు. ఆయన 1976 లో మెకానికల్ ఇంజనీరింగులో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, 1978 లో అనంతపురం లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో హీట్ పవర్లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చేశాడు. 1991 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగులో పి. హెచ్. డి పొందారు.

కెరీర్

[మార్చు]

రాజగోపాల్ 1978 లో తుముకూరు లోని సిద్దగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్చరరుగా వృత్తి జీవితం మొదలుపెట్టి, రెండేళ్లపాటు పనిచేసాడు. ఆ తరువాత ఒక సంవత్సరం పాటు హైదరాబాదు లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పనిచేసాడు. 1981 లో అనంతపురం లోని జెఎన్టియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగులో చేరాడు. ఆయన అక్కడ వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు. వివిధ వృత్తిపరమైన సంస్థల నుండి సుమారు 15 పురస్కారాలు అందుకున్నాడు.

ఆయన హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వైస్-ఛాన్సలర్గా పనిచేశాడు.[2][3] ఉస్మానియా విశ్వవిద్యాలయం-హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం-హైద్రాబాద్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం-తిరుపతి, యోగి వేమన విశ్వవిద్యాలయం-కడప, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపూర్ వంటి అనేక ఇతర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు.[4][5] ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) దక్షిణ కేంద్ర ప్రాంతీయ కమిటీ ఛైర్మన్గా కూడా పనిచేశాడు.[4]

పరిశోధన

[మార్చు]

ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 335 విద్వాంసుల పేపర్లను ప్రచురించాడు. సుమారు 35 మంది పరిశోధనా విద్యార్థులకు డాక్టరేట్ డిగ్రీని పొందడంలోను, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కోసం పనిచేస్తున్న 70 మంది విద్యార్థులకూ మార్గనిర్దేశం చేశాడు.

వృత్తిపరమైన సంస్థల్లో సభ్యత్వం

[మార్చు]
  • ది కంప్యుటేషన్ ఇన్స్టిట్యూట్-ఇండియన్ సెక్షన్ (CIIS) (S. No. 275, LMC-664) లో సభ్యుడు[6]

అందుకున్న పురస్కారాలు

[మార్చు]
  • 2004 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డును ప్రదానం చేసింది.
  • కోల్‌కతా లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ నుండి స్వామి వివేకానంద అవార్డు
  • ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) టెక్సాస్ స్టేట్ చాప్టర్, యుఎస్ఎ నుండి 2007 ఏప్రిల్‌లో ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ పురస్కారం
  • 2017 ఫిబ్రవరిలో ISTE గౌరవ ఫెలోషిప్ [7]

మూలాలు

[మార్చు]
  1. "Vice Chancellor". skuniversity.ac.in. Retrieved 16 November 2017.
  2. "JNTU endorses CADEM CAMLab". Cadem.com. Retrieved 16 November 2017.
  3. "Impressions". igiat.com. Archived from the original on 26 అక్టోబర్ 2017. Retrieved 16 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. 4.0 4.1 "Rajagopal in-charge V-C of SKU". Thehindu.com. 3 July 2015. Retrieved 16 November 2017.
  5. "JNTU-Anantapur". Jntua.ac.in. Archived from the original on 6 నవంబర్ 2017. Retrieved 16 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  6. "Members Directory 2017". Combustioninstitute-indiansetion. Archived from the original (XLS) on 26 అక్టోబర్ 2017. Retrieved 16 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  7. "46th ISTE NATIONAL ANNUAL CONVENTION & NATIONAL CONFERENCE" (PDF). Isteonline.in. Retrieved 16 November 2017.