కూర రఘోత్తంరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూర రఘోత్తంరెడ్డి
శాసనమండలి సభ్యుడు
In office
30 మార్చి 2019 - ప్రస్తుతం
వ్యక్తిగత వివరాలు
జననం09 ఫిబ్రవరి 1964
గోనేపల్లి, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీపీఆర్‌టీయూ
జీవిత భాగస్వామికూర గంగా
సంతానం1 కుమారుడు, 1 కూతురు
తల్లిదండ్రులుకూర భూపతి రెడ్డి, లక్ష్మి నర్సమ్మ
నివాసంహైదరాబాదు, తెలంగాణ

కూర రఘోత్తంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ఆదిలాబాద్నిజామాబాద్‌మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కూర రఘోత్తంరెడ్డి 1964, ఫిబ్రవరి 9న తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం, గోనేపల్లి గ్రామంలో కూర భూపతి రెడ్డి, లక్ష్మి నర్సమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎంఎస్సీ, బీఈడీ వరకు చదివాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కూర రఘోత్తంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా, ఉపాధ్యాయుడిగా వివిధ సంఘాల్లో పనిచేశాడు. ఆయన గజిట్టెడ్ హెడ్ మాస్టర్ హోదాలో రిటైర్డ్ అయ్యాడు. రఘోత్తంరెడ్డి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పీఆర్‌టీయూ బలపరిచిన అభ్యర్థిగా కరీంనగర్ఆదిలాబాద్నిజామాబాద్‌మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థి మోహన్‌రెడ్డిపై 1707 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిచాడు.[2] ఆయన 2019 ఏప్రిల్ 15న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3] ఆయన ఈ పదవిలో 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగనున్నాడు.

ఎమ్మెల్సీగా[మార్చు]

  1. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం విఫలం అయ్యాడు.[4]
  2. మొదటి లైన్‌ఉమెన్‌గా ఎంపికైన బబ్బూరి శిరీష యువతకు ఆదర్శం.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (27 March 2019). "టీచర్‌ ఎమ్మెల్సీలుగా రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  2. 10TV (27 March 2019). "MLC Elections : అధికార పార్టీలకు ఎదురుదెబ్బ". 10TV (in telugu). Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Telugu, TV9 (15 April 2019). "ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు - TV9 Telugu Newly Elected MLAs Swearing in Ceremony Telangana". TV9 Telugu. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (2 September 2019). "హామీల అమలులో సీఎం విఫలం". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
  5. Eenadu (13 January 2021). "శిరీష.. యువతకు ఆదర్శం". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.