కూ (సామాజిక మాధ్యమం)
![]() | |
Type of business | ప్రైవేట్ కంపెనీ |
---|---|
Type of site |
|
Available in | బహుభాషా |
Founded | 14 నవంబరు 2019 |
Headquarters | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
Country of origin | భారతదేశం |
Area served | ప్రపంచవ్యాప్తంగా |
Owner | బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
Founder(s) |
|
Key people | అప్రమేయ రాధాకృష్ణ (CEO) |
Industry |
|
Employees | 200 (As of Sep 2021)[2] |
Commercial | Yes |
Registration | Optional |
Users | ![]() (December 2021) |
Launched | 2020 |
Current status | Active |
Native client(s) on | iOS, ఆండ్రాయిడ్ (ఆపరేటింగ్ సిస్టమ్), ఇంటర్నెట్ |
కూ (ఆంగ్లం: Koo) అనేది బెంగళూరుకు చెందిన ఒక భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం, ఇది సోషల్ నెట్‌వర్కింగ్ సేవ.[3][4][5] 2021 మే నాటికి దీని విలువ $100 మిలియన్లకు పైగా ఉంది.[6] ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను అప్రమేయ రాధాకృష్ణ (Aprameya Radhakrishna), మయాంక్ బిదవత్కా (Mayank Bidawatka) కలిసి స్థాపించారు.కూ మాతృ సంస్థ - బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
అప్రమేయ రాధాకృష్ణ ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ట్యాక్సీఫోర్‌షూర్‌ను మొదటగా స్థాపించాడు, ఆ తర్వాత ఓలా క్యాబ్స్‌కు ఇది విక్రయించబడింది. 2020లో ప్రారంభమైన కూను ప్లే స్టోర్ నుంచి ఇప్పటి వరకు 10 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా ఈ యాప్ ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో విజయం సాధించింది.[7] 2022 ఆగస్టు మాసంలోకూ ‘టాపిక్స్’ ఫీచర్ ని హిందీ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ, పంజాబీ, ఇంగ్లిష్ ఇలా పది భాషల్లో విడుదల చేసిన ఏకైక సోషల్ మీడియా యాప్‌గా రికార్డు సృష్టించింది.[8]
ఇంటర్ఫేస్ , ఫీచర్స్
[మార్చు]లోగో
[మార్చు]కూ లోగో పసుపు రంగులోని పక్షి. దీని రూపకల్పన 2021 మే 14న క్రమబద్ధీకరించబడింది.[9]
వినియోగదారు అనుభవం
[మార్చు]- కూ ఇంటర్‌ఫేస్ ట్విట్టర్ మాదిరిగానే ఉంటుంది. వినియోగదారులు తమ పోస్ట్‌లను హ్యాష్‌ట్యాగ్‌లతో వర్గీకరించడానికి, ఇతర వినియోగదారుల ప్రస్తావనలు, ప్రత్యుత్తరాలలో ట్యాగ్ చేయడానికి అనుమతిస్తుంది. పసుపు, తెలుపు ఇంటర్‌ఫేస్‌నుకూ ఉపయోగిస్తుంది.[10][11]
- 2021 మే 4నకూ "టాక్ టు టైప్" అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ యాప్ వాయిస్ అసిస్టెంట్‌తో పోస్ట్‌ను సృష్టించడానికి వీలుంటుంది.[12]
- కూ ధ్రువీకరించబడిన ఖాతాలను పసుపు రంగు టిక్‌తో చూపిస్తుంది.[13][14]
- 2021 ఆగస్టు నుండికూ యాప్ డార్క్ థీమ్‌ను సపోర్ట్ చేస్తోంది.[15]
భాషలు
[మార్చు]కూ మొదట కన్నడలో ప్రారంభించబడింది.[16] తరువాత హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, అస్సామీ,[17] మరాఠీ, బంగ్లా, గుజరాతీ[18] భాషల్లో కూడాకూ లభిస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ Malhotra, Vanshika (7 August 2020). "Koo app: India's Twitter alternative will help you express views in your local language". India TV News (in ఇంగ్లీష్).
- ↑ "Koo to raise headcount to 500 in next 1 year". The Hindu BusinessLine. 12 September 2021. Retrieved 2022-02-15.
{{cite web}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ "Will double headcount; lot of headroom for growing user base: Koo". The Hindu (in Indian English). PTI. 2021-05-09. ISSN 0971-751X. Retrieved 2021-05-27.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Indian entrepreneurs back Koo app as Chinese investor exits". The Economic Times. 2021-02-12. Retrieved 2021-02-12.
- ↑ Pratap, Ketan (10 February 2021). "Desi microblogging platform Koo will have to cover a lot of ground to be Twitter alternative". Retrieved 5 March 2021.
- ↑ Mishra, Digbijay (26 May 2021). "Koo's valuation rises five times in three months in new funding round". The Economic Times. Retrieved 23 June 2021.
- ↑ "Chingari, YourQuote and Koo are the winners of the Aatmanirbhar App Innovation Challenge". Indulge Express (in ఇంగ్లీష్). IANS. 31 August 2020.
- ↑ "Koo launches Topics feature: చరిత్ర సృష్టించిన 'కూ' - Andhrajyothy". web.archive.org. 2022-08-23. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Ajmal, Anam (13 May 2021). "Koo App: Homegrown social media app Koo launches new logo". The Times of India. TNN.
- ↑ Singh, Saurabh (7 August 2020). "Made in India Twitter alternative Koo wins government's app innovation challenge in social category". Financial Express. The Indian Express.
- ↑ "Twitter's clash with government gives boost to Koo app". Hindustan Times. Bloomberg. 17 February 2021.
- ↑ "Koo Launches New 'Talk To Type' Feature For Indian Languages". Moneycontrol. 4 May 2021. Retrieved 2021-05-16.
- ↑ Talakokkula, Karthik (2021-02-11). "How to get Verified Account on Koo (Verified Account)". Android Nature (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-25.
- ↑ "Like blue tick, Now Koo App will give Yellow Tick to verified users!". Gadgets Techly360. 28 July 2021.
- ↑ "What Koo offers; A user's review - Nairametrics" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-21. Retrieved 2022-01-13.
- ↑ "Koo is now the largestmicro blog in Kannada". The Hindu. 24 September 2020. Retrieved 12 May 2021.
- ↑ Rawat, Aman, ed. (2021-06-16). "Nomoskaar Assam! Koo launches app in Assamese as Twitter comes under fire". Zee News. Retrieved 2021-06-17.
- ↑ "Official website". Archived from the original on 2021-02-12. Retrieved 2022-08-23.