Jump to content

కృష్ణదేవరాయ

వికీపీడియా నుండి
కృష్ణదేవరాయ
జీవిత భాగస్వామిరత్నశ్రీ రాయ
పిల్లలుతిరుమల వెంకట దేవరాయ, శివ రాయకుమారి, కృష్ణ రాయకుమారి

కృష్ణదేవరాయ అరవీడు రాజవంశానికి చెందినవాడు. ఇతను శ్రీకృష్ణ దేవరాయల 19వ తరం వారసుడు[1]. ఇతను అరవీడు రాజవంశం నుండి వచ్చిన ఆనెగొంది సంస్థానానికి అధిపతి, ఇతను హోస్పేట తాలూకాలోని ఆనెగొంది వద్ద శిథిలావస్థలో ఉన్న 250 సంవత్సరాల పురాతన భవనాన్ని పునరుద్ధరించాడు[2][3].

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతను పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పాఠశాల విద్యను, 1992 సంవత్సరంలో దావణగెరెలోని బాపూజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఆ తరువాత దాదాపు ఏడు సంవత్సరాలు అమెరికాలో పనిచేసి అతని తండ్రి మరణం తర్వాత 2008 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఇతని తల్లిదండ్రులు దివంగత రాజా అచ్యుత దేవరాయ, రాజమాత చంద్రకాంత దేవి. ఇతని తల్లి మధ్యప్రదేశ్‌లోని నరసింగ్‌గఢ్ రాజ కుటుంబానికి చెందినది. ఇతను రాణి రత్నశ్రీ రాయను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు, కుమారుడు తిరుమల వెంకట దేవరాయ, కుమార్తెలు శివ రాయకుమారి, కృష్ణ రాయకుమారి ఉన్నారు[4].

వృత్తి

[మార్చు]

ఇతను మైనింగ్ వ్యాపారం, వ్యవసాయాన్ని చూసుకుంటున్నాడు. ఇతను విజయనగర ఉజ్జీవన ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి నిర్వహిస్తున్నాడు. విజయనగర సామ్రాజ్య సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఈ ట్రస్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది[5].

మూలాలు

[మార్చు]
  1. "Restore Heritage Structures Says Royal Descendant of Vijayanagar". Star of Mysore. 2022-09-25. Retrieved 2025-03-01.
  2. Sridhar, Aparna M. "Brindavana Restored In A Touching Show Of Hindu Solidarity". Swarajyamag. Retrieved 2025-03-01.
  3. "రాయల వారి వారసుడొచ్చాడు.. | Sri Krishnadevaraya heir came to karnataka | Sakshi". www.sakshi.com. Retrieved 2025-03-01.
  4. "Where art thou, Krishna Devaraya?". psychicsizzler. 2010-02-13. Retrieved 2025-03-01.
  5. archive, From our online (2012-05-16). "Krishnadevaraya's 500th anniversary fete begins". The New Indian Express. Retrieved 2025-03-01.