కృష్ణపట్నం ఓడరేవు

వికీపీడియా నుండి
(కృష్ణపట్నం పోర్ట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Coordinates: 14°15′N 80°08′E / 14.250°N 80.133°E / 14.250; 80.133

కృష్ణపట్నం ఓడరేవు
250px
ప్రదేశం
దేశంభారతదేశం భారతదేశం
ప్రదేశంకృష్ణపట్నం
వివరములు
ప్రారంభం2008
నిర్వహిస్తున్నవారుKPCL- కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్
స్వంతదారులునవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్
అందుబాటులో ఉన్న బెర్తులు12
గణాంకాలు
వార్షిక సరకు రవాణా40.72 million tonnes(2014-15)
వార్షిక ఆదాయంINR1800 crores (2014-15)
అంతర్జాలం
http://www.krishnapatnam.com/

కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 18 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం వద్ద ఉంది.[1][2] ఇది సుమారు 500 ఏళ్ల క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపు పొంది ఉన్నది. ఈ ఓడరేవును 2008 జూలై 17వ తేదీన యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి తదితర ప్రముఖులు లాంఛనంగా ప్రారంభించారు.

నిర్మాణ నేపథ్యం[మార్చు]

బ్రిటీషు పాలనా కాలంలో చెన్నపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాలతో పాటు అభివృద్ధికి నోచుకోని ఈ కృష్ణపట్నం సహజ ఓడరేవు నేడు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఓడరేవు నిర్మాణానికి ఇతర అవసరాలకు మొత్తం 6009 ఎకరాల భూమిని సేకరించి 2006 లో నిర్మాణ పనులను చేపట్టారు. సహజసిద్ధ ఓడరేవు అయిన ఈ కృష్టపట్నం ఓడరేవు పనులను ప్రభుత్వం నవయుగ కంపెనీకి అప్పగించింది. నిర్మాణ పనులు చేపట్టిన 18 నెలల లోపే నాలుగు బెర్త్ నిర్మాణ పనులను పూర్తి చేశారు.

ఈ ఓడరేవు నందు నిర్మించ గల మొత్తం 42 బెర్త్ లను పూర్తి చేస్తామని నవయుగ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

మూలాలు[మార్చు]

  1. "Chennai port loses out to new facility". The Hindu. June 11, 2012. Retrieved 22 November 2012.
  2. "FOCUS: NELLORE DISTRICT". Frontline. 30 (03). 9–22 February 2013. Retrieved 17 February 2013.

ఇతర లింకులు[మార్చు]