కృష్ణమూర్తి సంతానం
కృష్ణమూర్తి సంతానం | |
|---|---|
| జననం | తమిళనాడు, భారతదేశం |
| మరణం | 2021 ఏప్రిల్ 26 |
| వృత్తి | అణు శాస్త్రవేత్త |
| పేరుపడ్డది | పోఖ్రాన్-II |
| పురస్కారాలు |
|
కృష్ణమూర్తి సంతానం భారతీయ అణు శాస్త్రవేత్త, పోఖ్రాన్-II పరీక్షల సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డీవో) ఫీల్డ్ డైరెక్టర్.[1] అనిల్ కాకోద్కర్,[2] ఏ.పి.జె. అబ్దుల్ కలాం[3] వంటి శాస్త్రవేత్తల వాదనలు ఉన్నప్పటికీ, 1998 నాటి పోఖ్రాన్ పరీక్షలు పూర్తిగా విజయవంతం కాలేదని 2009లో వెల్లడించి ఆయన వార్తల్లో నిలిచారు.[4] ఈ ప్రకటనలు, తదుపరి పరీక్షల కోసం పెరిగిన ప్రజా ఒత్తిడి కారణంగా భారత ప్రభుత్వం CTBT పరీక్ష నిషేధ ఒప్పందంపై సంతకం చేయలేదు. సంతానం చేసిన ప్రకటనను భారత అణుశక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ పి. కె. అయ్యంగార్ సమర్థించారు.[5]
సంతానం యునైటెడ్ నేషన్స్: మల్టీలేటరలిజం అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ,[6] ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా: అడ్వాన్సింగ్ ది కామన్ ఇంట్రెస్ట్ ,[7] ఏషియన్ సెక్యూరిటీ అండ్ చైనా 2000-2010 [8] అనే మూడు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పలు వ్యాసాలు రాశారు.[9][10][11] భారత ప్రభుత్వం 1999లో ఆయనకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.[12]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The Myth Bomber". outlookindia.com. October 5, 2009. Retrieved 2018-06-07.
- ↑ "Ex-DRDO scientist calls Kakodkar 'a liar' - Indian Express". archive.indianexpress.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). December 14, 2009. Retrieved 2018-06-07.
- ↑ "Why Santhanam said Pokharan II was not a success". Rediff. August 28, 2009. Retrieved 2018-06-07.
- ↑ "Pokhran II not fully successful: Scientist - Times of India". The Times of India. August 27, 2009. Retrieved 2018-06-07.
- ↑ "AEC ex-chief backs Santhanam on Pokhran-II". The Hindu (in Indian English). 2009-09-25. Retrieved 2018-06-07.
- ↑ United Nations : multilateralism and international security. Delhi: Shipa. 2005. ISBN 978-8175412248. OCLC 60819230.
- ↑ India and Central Asia : advancing the common interest. New Delhi: Institute for Defence Studies and Analyses. 2004. ISBN 978-8188342273. OCLC 56367686.
- ↑ Asian security and China, 2000-2010. New Delhi: Institute for Defence Studies and Analyses. 2004. ISBN 978-8175411678. OCLC 55119893.
- ↑ Capone, Louis A.; Prasad, Sheo S.; Huntress, Wesley T.; Whitten, Robert C.; Dubach, John; Santhanam, Krishnamurthy (1981). "Formation of organic molecules on Titan". Nature (in ఇంగ్లీష్). 293 (5827): 45–46. Bibcode:1981Natur.293...45C. doi:10.1038/293045a0. S2CID 95614294.
- ↑ Capone, Louis A.; Dubach, John; Whitten, Robert C.; Prasad, Sheo S.; Santhanam, Krishnamurthy (1980-10-01). "Cosmic ray synthesis of organic molecules in Titan's atmosphere". Icarus (in ఇంగ్లీష్). 44 (1): 72–84. Bibcode:1980Icar...44...72C. doi:10.1016/0019-1035(80)90056-1.
- ↑ "Rapid calculation of radiative heating rates and photodissociation rates in inhomogeneous multiple scattering atmospheres". www.scopus.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-06-07.
- ↑ "Padma Awards". Padma Awards. Government of India. 2018-05-17. Archived from the original on 15 October 2018. Retrieved 2018-05-17.
బయటి లింకులు
[మార్చు]- "Question on the success of pokharan by scientist K. Santhanam". YouTube. 2011-03-07. Retrieved 2018-06-07.