కృష్ణస్వామి శ్రీనివాస్ సంజీవి
ప్రొ. కృష్ణస్వామి శ్రీనివాస్ సంజీవి | |
|---|---|
| జననం | కృష్ణస్వామి శ్రీనివాస్ సంజీవి 1903 డిసెంబరు 27 పుదుక్కొట్టై, బ్రిటిషు భారతదేశం |
| మరణం | 1994 అక్టోబరు 1 (వయసు: 90) వాలంటరీ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్, చెన్నై |
| పౌరసత్వం | భారతీయుడు |
| చదువు | 1927 లో MBBS, 1930 లో MD General Medicine. (ఇది చేసిన తొలి నలుగురు భారతీయుల్లో ఒకరు!), 1947 లో లండన్‌లో ఛాతీ వ్యాధుల అధ్యయనం |
| పాఠశాల/కళాశాలలు | మద్రాస్ మెడికల్ కాలేజీ |
| వృత్తి | వైద్యుడు, ప్రాథమిక ఆరోగ్యసంరక్షణకు భారతదేసంలో పితామహుడు |
| యజమాని(s) | చెట్‌పట్ టీబీ పరిశోధన కేంద్రం డైరెక్టరు. తాంబరం టీబీ శానటోరియం డైరెక్టరు. మద్రాసు మెడికల్ కాలేజీలో, స్టాన్లీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసరు. మద్రాసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఫిజిషియన్. |
| పేరుపడ్డది | సాంఘిక సేవ |
| Title | The Father of Primary Healthcare in India |
| భాగస్వామి | అలమేలు |
| తల్లిదండ్రులు | తండ్రి - కృష్ణస్వామి, తల్లి - ధర్మసంవర్ధిని |
| పురస్కారాలు | 1971 లో పద్మశ్రీ, 1976 లో పద్మభూషణ, డ.బి.సి.రాయ్ పురస్కారం |
కృష్ణస్వామి శ్రీనివాస్ సంజీవి (1903–1994) భారతీయ వైద్యుడు, గాంధేయవాది, సామాజిక కార్యకర్త. అతను స్వచ్ఛంద ఆరోగ్య సేవల (VHS) కేంద్రాన్ని స్థాపించాడు.[1] ఇది చెన్నైలోని ఒక వైద్య కేంద్రం. సమాజంలోని దిగువ, మధ్యతరగతి ప్రజలకు సేవ చేస్తుంది.[2][3] 1971లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం అయిన పద్మశ్రీతో సత్కరించింది.[4] ఐదు సంవత్సరాల తరువాత, 1976 లో, మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.[5]
జీవిత చరిత్ర
[మార్చు]కెఎస్ సంజీవి 1903 లో తమిళనాడులోని పుదుక్కోట్టైలో ధర్మాంబాళ్, పిఎస్ కృష్ణస్వామి అయ్యర్ దంపతులకు జన్మించాడు.[6] కృష్ణస్వామి అయ్యరు, ప్రఖ్యాత భారతీయ వైద్యురాలు, భారతదేశంలోని మొదటి మహిళా శాసనసభ్యురాలు ముత్తులక్ష్మి రెడ్డికి స్వయం నియమిత సంరక్షకుడు.[7][8] సంజీవి, వారి నలుగురు పిల్లలలో చిన్నవాడు. పెద్ద కుమార్తె వేద, ఆయన అన్నలు, ప్రముఖ జర్నలిస్టు, ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ[9] చీఫ్ ఎడిటరూ అయిన కృష్ణస్వామి స్వామినాథన్,[10] నేషనల్ కెమికల్ లాబొరేటరీ మాజీ డైరెక్టర్ కృష్ణస్వామి వెంకటరామన్.[11] ఈ ఇద్దరూ పద్మ భూషణ్ పురస్కారాలు అందుకున్నారు.[6][8] నటుడు మాధవ్ శర్మ ఆయన మేనల్లుడు.
ఆయన పిఎస్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించి, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరి 1927లో వైద్యం (ఎంబిబిఎస్)లో పట్టభద్రుడయ్యాడు [1] 1932లో అదే సంస్థ నుండి జనరల్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎండీ) పొంది, ప్రభుత్వ సేవలో చేరాడు.[1]
సంజీవి మదనపల్లె, మధురై, మద్రాస్ నగరం వంటి పూర్వ మద్రాస్ రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో పనిచేసాడు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో క్షయవ్యాధి డైరెక్టర్ పదవి, స్టాన్లీ మెడికల్ కాలేజీ, మద్రాస్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ ప్రొఫెసర్, చెన్నైలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో మొదటి వైద్యుడిగా కూడా పనిచేశారు. వైద్య సేవల డైరెక్టర్ పదవికి నియామకం జరిగే సమయంలో ఆయనను విస్మరించబడంతో, ఆయన స్వచ్ఛందంగా ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ చేశాడు.[1] [6] సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను అందుబాటు లోకి తెచ్చేందుకు, 1958లో స్వచ్ఛంద ఆరోగ్య సేవలు (VHS)ను లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థగా స్థాపించాడు.[12] న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మెడిసిన్ ప్రొఫెసర్ పదవి ఆఫర్‌ను తిరస్కరించి, ప్రైవేట్ ప్రాక్టీస్‌ను ఆశ్రయించకూడదని ఎంచుకుని, ఆయన VHS పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు.[1]
తన విద్యార్థుల నుండి, కస్తూరి శ్రీనివాసన్, టిఆర్ వెంకటరామ శాస్త్రి, ఎం. భక్తవత్సలం, ఎంఏ చిదంబరం వంటి ప్రముఖ వ్యక్తుల నుండి సహాయం సేకరించి, సంజీవి 1961 లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఆసుపత్రి భవనంపై పనితో స్వచ్ఛంద ఆరోగ్య సేవలను అభివృద్ధి చేశాడు. రెండు సంవత్సరాలలో, ఆసుపత్రి మొదటి ఇన్‌పేషెంట్‌ను చేర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ సంస్థ సంవత్సరాలుగా అభివృద్ధి చెంది 405 పడకల రిఫరల్ ఆసుపత్రిగా మారింది.[2] ఇప్పటికీ 70 శాతం మంది రోగులు ఆహారం, మందులతో సహా ఉచిత వైద్య సేవను పొందే పద్ధతిని కొనసాగిస్తోంది.[1][3]
భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ఉద్యమ అభివృద్ధికి సంజీవి దోహదపడ్డాడు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో తన సేవలో, అతను అనేక మినీ హెల్త్ సెంటర్‌లను స్థాపించాడు. ఈ నమూనాను అతను VHSతో కొనసాగించాడు. ఈ సంస్థ గ్రామాలు, చిన్న పట్టణాల్లో 14 మినీ హెల్త్ సెంటర్‌లను నిర్వహిస్తోంది. ఇది సుమారు 1,00,000 మందికి సేవలు అందిస్తుంది. రోగనిరోధకత, ప్రసూతి సంరక్షణ, కుటుంబ సంక్షేమం, పారిశుధ్యం, పరిశుభ్రత, పాఠశాల ఆరోగ్య పరీక్ష, జనన, మరణ రికార్డుల నిర్వహణ తదితరాల పట్ల శ్రద్ధ వహిస్తుంది. [1] ఇది అల్పాదాయ, మధ్యతరగతి ఆదాయ కుటుంబాలకు బీమా పథకం లాంటి వైద్య సహాయ ప్రణాళికను కూడా నిర్వహిస్తుంది.[1] తన జీవితంలోని చివరి భాగంలో, సంజీవి ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1965 లో, అతను మరణించిన ఒక సంవత్సరం తర్వాత, తమిళనాడు రాష్ట్రంలో AIDS నివారణ, నియంత్రణ (APAC) ప్రాజెక్ట్ అమలు కోసం నోడల్ ఏజెన్సీగా VHSని ఎంచుకోవడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) అతని కార్యకలాపాలను గుర్తించింది.[3]
1971లో భారత ప్రభుత్వం సంజీవికి పద్మశ్రీ పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది.[4] ఆయన మళ్ళీ 1976లో మూడవ అత్యున్నత గౌరవమైన పద్మభూషణ్‌కు ఎంపికయ్యాడు.[5] వాలంటరీ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆయన పేరిట 1995 నుండి ఏటా KS సంజీవి ఎండోమెంట్ లెక్చర్‌తో సత్కరిస్తున్నాయి, అరుణ రాయ్, విశ్వ మోహన్ కటోచ్,[13] రవి నారాయణ్ [14] గతంలో ఈ ఉపన్యాసం ఇచ్చిన ప్రముఖ వ్యక్తులలో కొందరు. VHSలోని ఆడిటోరియం కూడా ఆయన పేరు మీద ఉంది. [15]
కె.ఎస్. సంజీవి 1994 అక్టోబరులో 91 సంవత్సరాల వయసులో మరణించాడు.[12]
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 7 8 Murali, N.S. (28 March 2005). "Visionary doctor's legacy". The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 September 2018.
- 1 2 "Rotary News". Rotary International. 1 August 2014. the original నుండి 24 May 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- 1 2 3 "VHS". VHS. 2015. the original నుండి 24 మే 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- 1 2 "Padma Shri" (PDF). Padma Shri. 2015. the original (PDF) నుండి 15 October 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2014.
- 1 2 "Padma Bhushan". Government of India. 2015. the original నుండి 4 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- 1 2 3 "Boloji". Boloji. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- ↑ S. Viswanathan (May 2008). "The Pioneers: Dr. Muthulakshmi Reddy".
- 1 2 "My musings". My musings. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- ↑ "The Collected Works of Mahatma Gandhi". English Wikisource. 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- ↑ "Indian Folklore". Indian Folklore. 2015. the original నుండి 18 May 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- ↑ "NCL". National Chemical Laboratory. 2015. the original నుండి 7 జూన్ 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- 1 2 "TOI". Times of India. 7 May 2009. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.
- ↑ "Katoch". VHS. 2015. the original నుండి 24 మే 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2015.
- ↑ "Ravi Narayan". The Hindu. 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2015.
- ↑ "Marundeshwara" (PDF). Marundeshwara. 2015. the original (PDF) నుండి 24 May 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2015.