కృష్ణ తులాభారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ తులాభారం
(1935 తెలుగు సినిమా)
తారాగణం కపిలవాయి రామనాధశాస్త్రి,
కాంచనమాల,
లక్ష్మీరాజ్యం,
రేలంగి వెంకట్రామయ్య,
ఋష్యేంద్రమణి
నిర్మాణ సంస్థ మదన్ థియేటర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కృష్ణ తులాభారం 1935, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి నటించారు. ఋషేంద్రమణి ఇందులో తొలిసారిగా సత్యభామగా నటించగా రేలంగికి ఇది తొలిచిత్రం. ఈ సినిమాను కలకత్తాలో చిత్రీకరించారు.[1] కాంచనమాల, లక్ష్మీరాజ్యంలకు కుడా ఇది తొలిచిత్రం.

నటవర్గం[మార్చు]

సి.పుల్లయ్య

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ చిత్రంలో భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి అనే మూడు పాటలు రాశాడు. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం (1955), శ్రీకృష్ణ తులాభారం (1966) నిర్మించినపుడు కూడా వాడుకున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. డైలీహంట్ (ఈనాడు), సినిమా (26 May 2020). "జనానికి ఇవేమీ అక్కర్లేదు". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 9 August 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  3. నవ తెలంగాణ, సోపతి (20 June 2015). "తెలుగు సినిమా వాచస్పతి చందాల కేశవదాసు". NavaTelangana. సిహెచ్‌. రమేష్‌బాబు. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.

ఇతర లంకెలు[మార్చు]