కృష్ణ దాస్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1990 అక్టోబరు 12 బార్పేట, అస్సాం |
| బ్యాటింగు | కుడిచేతి వాటం |
| బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| పాత్ర | బౌలర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2005–2018 | Assam |
| 2018–2019 | Goa |
| 2020–present | Assam |
మూలం: ESPNcricinfo, 10 January 2021 | |
కృష్ణ దాస్ (జననం 1990, అక్టోబరు 12) దేశీయ క్రికెట్‌లో అస్సాం తరపున ఆడే భారత క్రికెటర్.[1] అతను కుడిచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్. 2009లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు.
దాస్ 2005-06 రంజీ ట్రోఫీలో అస్సాం తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2016, జనవరి 2న 2015–16 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] మార్చి 2016లో ముంబైతో జరిగిన 2015–16 ఇరానీ కప్ మ్యాచ్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో అతనికి చోటు లభించింది.[3] 2016, ఆగస్టులో, అతను 2016–17 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[4]
2018–19 రంజీ ట్రోఫీకి ముందు, అతను అస్సాం నుండి గోవాకు బదిలీ అయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Krishna Das". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 October 2015.
- ↑ "Syed Mushtaq Ali Trophy, Group C: Assam v Baroda at Vadodara, Jan 2, 2016". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2016.
- ↑ "RESULT: Rest of Ind won by 4 wickets". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2021.
- ↑ "Raina, Yuvraj to captain Duleep Trophy teams". ESPNcricinfo. 11 August 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2021.
- ↑ "List of domestic transfers ahead of the 2018-19 Ranji Trophy season". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2018.
బాహ్య లింకులు
[మార్చు]- కృష్ణ దాస్ at ESPNcricinfo
- Krishna Das at CricketArchive (subscription required)