కృష్ణ పూనియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ పూనియా
2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకంతో కృష్ణ పూనియా
వ్యక్తిగత సమాచారం
జననం (1977-05-05) 1977 మే 5 (వయసు 46)
ఆగ్రోహ, హర్యానా, భారతదేశం
ఎత్తు1.8 m (5 ft 11 in)[1]
బరువు79 kg (174 lb) (2013–ప్రస్తుతం)
క్రీడ
దేశం భారతదేశం
క్రీడఅథ్లెటిక్స్
పోటీ(లు)డిస్కస్ త్రో
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ(s)64.76 m (వైలుకు, హవాయి 2012)

కృష్ణ పూనియా (జననం 1977 మే 5) భారతీయ డిస్కస్ త్రోయర్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ఆమె 2008, 2012 ఒలింపిక్ క్రీడలలో పాల్గొంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆమె బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె అంతర్జాతీయ స్వర్ణ పతక విజేత. భారతప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులతో ఆమెను సత్కరించింది.[2]

ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి రాజస్థాన్ లోని సాదుల్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయింది.[3][4][5] ఆమె ఫిబ్రవరి 2022లో రాజస్థాన్ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా నియమితులయింది.[6]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె 1977 మే 5న హర్యానాలోని హిసార్ జిల్లా అగ్రోహా గ్రామంలో జాట్ కుటుంబంలో జన్మించింది.[7][8][9] ఆమె 9 సంవత్సరాల వయస్సులో తల్లి చనిపోవడంతో తండ్రి, నాన్నమ్మల వద్ద పెరిగింది.[10] ఆమె 15 సంవత్సరాల వయస్సు నుండే వారి వ్యవసాయ పనులలో నిమగ్నమయింది.[11]

ఆమె జైపూర్‌లోని కనోరియా పీజీ మహిళా మహావిద్యాలయం నుంచి సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది.

కెరీర్[మార్చు]

2010 కామన్వెల్త్ గేమ్స్[మార్చు]

న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ఆమె నిలిచింది. డిస్కస్ ఈవెంట్‌లో 61.5 మీటర్లు సాధించి చరిత్ర సృష్టించింది. 1958 కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 440 గజాల రేసులో స్వర్ణం గెలిచిన మిల్కా సింగ్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఆమె.[12][13]

2012 లండన్ ఒలింపిక్స్[మార్చు]

2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల డిస్కస్ త్రోలో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఆమె 63.62 మీటర్ల అత్యుత్తమ ప్రయత్నం ఆమె ఐదవ, చివరి ప్రయత్నంలో వచ్చింది. ఆమె మొదటి ప్రయత్నంలో 62.42 మీటర్లు, మూడవ త్రోలో 61.61, ఆరవ, చివరి త్రోలో 61.31 మీ. కాగా రెండవ, నాల్గవ ప్రయత్నంలో ఆమెకు రెండు నో-త్రోలు వచ్చాయి. మిల్కా సింగ్, పి టి ఉషా, శ్రీరామ్ సింగ్, గుర్బచన్ సింగ్ రంధవా, అంజు బాబీ జార్జ్ తర్వాత ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో ఫైనల్ రౌండ్‌కు చేరిన ఆరో భారతీయురాలుగా ఆమె గుర్తింపు పొందింది.[14]

రాజకీయ జీవితం[మార్చు]

2013లో, ఆమె తన భర్త సొంత జిల్లా అయిన చురులో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమక్షంలో కాంగ్రెస్ నాయకత్వం ఆమెను సంప్రదించిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరింది.[5]

2013 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో, ఆమె సదుల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది, అక్కడ ఆమె బిజెపి, బిఎస్పి తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో, ఆమె మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ టిక్కెట్‌పై అదే స్థానంలో 70020 ఓట్లు సాధించి 18084 ఓట్ల మెజార్టీతో గెలిచింది.[4]

2019 లోక్‌సభ ఎన్నికల్లో, ఆమెనును జైపూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నామినేట్ చేసింది. బీజేపీ అభ్యర్థి ఒలింపియన్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌పై ఆమె పోటీ చేసింది. ఆమె 393171 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[15][16]

భారతదేశంలో ముఖ్యంగా ఆమె పెరిగిన హర్యానాలో భ్రూణ హత్యలు అరికట్టడానికి రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సహాయం చేస్తోంది. జైపూర్, దేశవ్యాప్తంగా పిల్లల కోసం క్రీడల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆమె నిమగ్నమై ఉంది.[11]

వ్యక్తిగతం[మార్చు]

2000లో, ఆమె మాజీ అథ్లెట్ వీరేందర్ సింగ్ పూనియాను వివాహం చేసుకుంది.[10] వారి వివాహం తర్వాత ఆమెకు క్రీడా శిక్షణ ఇచ్చాడు. వారికి 2001లో ఒక కుమారుడు కలిగాడు.[4] ఈ దంపతులు భారతీయ రైల్వేలో పనిచేశారు కానీ 2013లో ఆమె రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరింది.[17]

పురస్కారాలు[మార్చు]

  • 2011లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పౌర పురస్కారంతో సత్కరించింది.[2]
  • 2010లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.[18]

మూలాలు[మార్చు]

  1. "KRISHNA POONIA". g2014results.thecgf.com. Commonwealth Games Federation. Archived from the original on 17 August 2016. Retrieved 29 July 2016.
  2. 2.0 2.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  3. "Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా | congress leaders krishna punia and seethakka media meeting at gandhibhavan". web.archive.org. 2023-06-09. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 Krishna wins poll battle in Rajasthan in second attempt The Tribune. Retrieved 13 December 2018
  5. 5.0 5.1 Electoral Triumph Same As Winning Gold: Congress Candidate Krishna Punia, NDTV, 26 November 2018.
  6. "राज्य क्रीड़ा परिषद के अध्यक्ष का पदभार संभालेंगी कृष्णा पूनिया, कहा-बजट में खेलों के लिए काफी कुछ मिलेगा". Zee News.
  7. "KRISHNA POONIA". iaaf.org. International Association of Athletics Federations. Archived from the original on 30 March 2016. Retrieved 29 June 2016.
  8. "Gold Rush..Fast Paced Development" (PDF). Haryana Review (in ఇంగ్లీష్). Government of Haryana. 24 (11): 44. November 2010. Archived from the original (PDF) on 13 April 2016. Retrieved 29 June 2016.
  9. Koshie, Nihal (12 October 2010). "All Jats Night: Discus trio make history". Indian Express. Archived from the original on 21 March 2016. Retrieved 29 June 2016.
  10. 10.0 10.1 Knight, Matthew; Yasukawa, Olivia (4 February 2015). "Krishna Poonia: Discus diva champions Indian girl power". CNN. Retrieved 22 December 2018.
  11. 11.0 11.1 Matthew Knight and Olivia Yasukawa. "Krishna Poonia: Star of India, champion of new society". CNN. Retrieved 27 July 2019.
  12. Saibal Bose (12 October 2012). "India wins first Games track & field gold since Milkha Singh in 1958". The Economic Times. Retrieved 19 July 2021.
  13. "Krishna Poonia creates history, wins gold in athletics". The Indian Express. 11 October 2010. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
  14. "Krishna Poonia Qualifies for Discus Final". The Hindu.
  15. "Krishna Poonia: Jaipur Rural News & Election Rally by Krishna Poonia in Lok Sabha Elections". News18. Retrieved 27 July 2019.
  16. "Election 2019: "Khiladi vs Khiladi": Olympian Krishna Poonia On Rajyavardhan Rathore". NDTV.com. Retrieved 27 July 2019.
  17. "Ace discus thrower Krishna Poonia resigns from Railways, expected to join Congress". NDTV.com. Retrieved 27 July 2019.
  18. "Arjuna Awardees- Athletics – Athletics Federation of India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 27 July 2019.