Jump to content

కృష్ణ రామ్ నాయ్

వికీపీడియా నుండి
కృష్ణ రామ్ నాయ్
రాజస్థాన్ శాసనసభ సభ్యుడు
In office
2013–2018
అంతకు ముందు వారుమంగళ్ రామ్
తరువాత వారుగిరిధర్ లాల్ మోహియా
నియోజకవర్గందున్‌గార్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం
In office
1990–1998
అంతకు ముందు వారురేవంత్ రామ్ మోహియా
తరువాత వారుమంగళ్ రామ్
వ్యక్తిగత వివరాలు
జననం(1935-01-01)1935 జనవరి 1
దున్‌గార్‌ఘర్ ,బికనీర్ జిల్లా రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిముక్నా దేవి
సంతానం6
వృత్తిసామాజిక సేవకుడు వ్యవసాయ వేత్త రాజకీయ నాయకుడు

కృష్ణ రామ్ నాయ్ ( 1935 జనవరి 1- 2025 ఏప్రిల్ 7) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] కృష్ణ రామ్ నాయ్ దుంగార్గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన వృద్ధాప్యంతో బాధపడుతూ 2025 ఏప్రిల్ 7న శ్రీడుంగర్గఢ్లోని తన ఇంట్లో మరణించారు.[2].

ప్రారంభ జీవితం

[మార్చు]

కృష్ణ రామ్ నాయ్ శ్రీడుంగర్గఢ్ పట్టణంలో బస్తీరామ్ నాయి చందా దేవి దంపతులకు జన్మించారు.కృష్ణ రామ్ నాయ్ తండ్రి బస్తీరామ్ నాయి మంగలిగా పనిచేసేవాడు. కృష్ణ రామ్ నాయ్ ముక్నా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు మదన్, జీవరాజ్, నలుగురు కూతుళ్లు సీత, శారదా, భన్వారీ, లిక్స్మా ఉన్నారు. కృష్ణ రామ్ నాయ్ కుమారుడు జీవరాజ్ నాయి 2018 ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించారు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

కృష్ణ రామ్ నాయ్ 1956లో శ్రీడుంగర్గఢ్ మునిసిపల్ కౌన్సిలర్ గా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు, తరువాత కృష్ణ రామ్ నాయ్ మున్సిపల్ వైస్ చైర్మన్,గా పనిచేశాడు. తరువాత మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాడు.[2] 1980 భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు ఆ పార్టీలో చేరాడు , అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెకావత్ తో కృష్ణ రామ్ నాయ్ సన్నిహితంగా ఉండేవాడు. కృష్ణ రామ్ నాయ్ చురు బికనీర్ జిల్లాల బిజెపి అధ్యక్షుడిగా పని చేశాడు.[2]

1980 డిసెంబర్ లో జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో , దుంగారగఢ్ నియోజకవర్గం నుండి తొలిసారి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి కృష్ణ రామ్ నాయ్ ఓడిపోయారు.[4] 1985లో బిజెపి టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. 1990 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి రామ్ ఆర్య ను ఓడించారు.[5] 1993 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో తన ప్రత్యర్థి దౌలత్ రామ్ శరణ్ ను ఓడించి కృష్ణ రామ్ నాయ్ రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6] ఆ తర్వాత 1998,2003 లో జరిగిన ఎన్నికల్లో కృష్ణ రామ్ నాయ్ ఓడిపోయారు. 2008లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013 ఎన్నికల్లో కృష్ణ రామ్ నాయ్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7] ఆయనను 2018లో బీజేపీ సస్పెండ్ చేసింది.[8]

మరణం

[మార్చు]

కృష్ణ రామ్ నాయ్ వృద్ధాప్యం తో బాధపడుతూ 2025 ఏప్రిల్ 7న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Rajasthan : 94 वर्ष की उम्र में बीजेपी के दिग्गज नेता किशनाराम का निधन, शेखावत राज में बने थे संकट मोचक, जानें कैसा उनका पूरा सियासी सफर". thebikanernews.in (in హిందీ). 2025-04-08. Retrieved 2025-04-08.
  2. 1 2 3 "Kishna Ram Nai Passes Away: Veteran BJP Leader And Three-Time MLA - Niharika Times" (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-04-08. Retrieved 2025-04-08.[permanent dead link]
  3. "BJP MLA Kishna Ram Nai's son dies in road accident". Business Standard. 13 August 2018. Retrieved 8 April 2025.
  4. "Veteran BJP Leader Kishanaram Nai Passes Away at 94". Patrika News (in ఇంగ్లీష్). 2025-04-08. Retrieved 2025-04-08.
  5. "बीजेपी के दिग्गज नेता किशनाराम का निधन, शेखावत राज में बने थे संकट मोचक, जानें कैसा रहा इनका सियासी सफर | Veteran BJP leader and Former MLA Of Sridungargarh Krishna Ram Nai Passed Away". Patrika News (in హిందీ). 2025-04-08. Retrieved 2025-04-08.
  6. "Dungargarh Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2025-04-08.
  7. "Dungargarh Constituency Election Results 2023: Dungargarh Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2025-04-08.
  8. "Rajasthan assembly polls 2018: Denied tickets, rebels look to derail plans of BJP, Congress". www.hindustantimes.com. Retrieved 2023-03-08.