కృష్ణ లీలలు (1959 సినిమా)
Jump to navigation
Jump to search
కృష్ణ లీలలు (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంపన చంద్రశేఖరరావు |
---|---|
తారాగణం | ఎస్.వీ.రంగారావు, లక్ష్మీ రాజ్యం, గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.సూరిబాబు |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నిర్మాణ సంస్థ | రాజ్యం పిక్చర్స్ |
భాష | తెలుగు |
కృష్ణ లీలలు 1959 ఆగస్టు 14 న విడుదలైన తెలుగు సినిమా. రాజ్యం పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ రాజ్యం నిర్మించిన ఈ సినిమాకు జంపన చంద్రశేఖరరావు దర్శకత్వం వహించాడు. ఎస్.వి. రంగారావు, రేలంగి వెంకటరామయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- ఎస్.వి. రంగారావు,
- రేలంగి వెంకటరామయ్య,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- శ్రీరంజని జూనియర్,
- సంధ్య,
- సూర్యకాంతం,
- సీత,
- రీటా,
- సురభి కమలాబాయి,
- పలువాయి భానుమతి,
- మోహన,
- బేబీ ఉమ
- మాస్టర్ సత్యం,
- సుధాకర్,
- ప్రసాద్
- రామకోటి,
- అల్లు రామలింగయ్య,
- ఎ.వి. సుబ్బారావు,
- ఎ.ఎల్.నారాయణ,
- రావులపల్లి,
- కమల లక్ష్మణ్,
- సాయి-సుబ్బలక్ష్మి,
- ఇ.వి. సరోజ,
- కుచల కుమారి,
- చదలవాడ కుటుంబరావు,
- లక్ష్మి రాజ్యం,
- కాంచన,
- పి.సూరిబాబు,
- సురభి బాలసరస్వాతి
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టూడియో: రాజ్యం పిక్చర్స్
- నిర్మాత: లక్ష్మి రాజ్యం;
- ఛాయాగ్రాహకుడు: ఎం.ఎ.రెహమాన్, W.R. సుబ్బారావు;
- ఎడిటర్: S.P.S. వీరప్ప;
- స్వరకర్త: సుసర్ల దక్షిణామూర్తి;
- గీత రచయిత: అరుద్రా, కోసరాజు రాఘవయ్య చౌదరి, వెంపటి సదాశివ బ్రహ్మం,
పాటలు
[మార్చు]- అందంముందు అమృతమన్నది ఏపాటిది మధువు ఇదిగో - పి. సుశీల - రచన: ఆరుద్ర
- అమ్మా మన్ను తినంగ నే శిశువునో ( పద్యం ) - పి. సుశీల
- అన్న క్షమింపుమన్న తగదు అల్ళుడగాడు (పద్యం) - జమునారాణి - భాగవతము నుండి
- ఇంతచల్లని రేయి ఇంత చక్కని హాయి అంతయు తిలకించి - జిక్కి - రచన: ఆరుద్ర
- ఎంతదానివయ్యావే నువ్వు కోడలా - సరస్వతి, స్వర్ణలత, పిఠాపురం - రచన: సదాశివబ్రహ్మం
- ఎట్టి తపంబు చేయ్యబడె ఎట్టి చరిత్రము (పద్యం) - పి.సూరిబాబు - భాగవతము నుండి
- ఓ రసికజన హృదయలోల రారాజ కంసభూపాల - పి.లీల,పి.సుశీల - రచన: కొసరాజు
- కలయో వైష్ణవమాయయో యితరసంకల్ప ( పద్యం) - పి.లీల - భాగవతము నుండి
- కన్నులు కల్వరేకులు మొగంబు ప్రపూర్ణశశాంక (పద్యం) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- కొలది నోములు నోచినానేమో వెలది ఆ యశోదకన్నను - కె.జమునారాణి - రచన: ఆరుద్ర
- గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మ - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు
- గోమాతా శుభచరిత నిర్మల గుణభరితా - పి.లీల - రచన: కొసరాజు
- గోపాల క్రిష్ణమ్మ దక్కేడురా ఘోరకాళీయుడే - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: ఆరుద్ర
- జయజయ నారాయణా జయ దీనజనావనా - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
- తాళలేనురా తగినదానరా నిన్నెకోరినార నన్నే- ఎం. ఎల్. వసంతకుమారి - రచన: కొసరాజు
- తరమే బ్రహ్మకునైన నీదగు మహత్యంబెల్ల (పద్యం) - ఘంటసాల - భాగవతము నుండి
- ధిక్కారమును చేయడీ వేదముల ధిక్కారము - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
- నల్లనివాడు.. మోహన మురళీ - పి.సుశీల, ఎస్.జానకి బృందం - రచన: ఆరుద్ర
- నవమోహనంగా రావేరా మా యవ్వనమంతా - పి.సుశీల,పి.లీల - రచన: కొసరాజు
- నిరత సత్య ఫ్రౌడిధరణి నేలిన హరిశ్చంద్రుడు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- పెరుగు చిలుకుటలేక పెరుగుచుండెడి వెన్న (పద్యం) - పి.సుశీల
- బావా ఓ వసుదేవ చెల్లెలు బహిప్రాణం (పద్యం) - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
- బ్రహ్మరుద్రాదులంతటివారినైననిల్చి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- మంచిగ రామకృష్ణులను మాత్రము ( పద్యం) - పి సూరిబాబు - రచన: సదాశివబ్రహ్మం
- మన మారటం జెందె భీతి కలిగెన్ మాద్యంబు పైగప్పే ( పద్యం) - మాధవపెద్ది
- లాలి తనయా లాలీ లాలి తనయా మా కన్నయ్య - పి.సుశీల - రచన: ఆరుద్ర
- హీనపూతన చంపినానని పొంగకు ( సంవాద పద్యాలు ) - మాధవపెద్ది, పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Krishna Leelalu (1959)". Indiancine.ma. Retrieved 2021-05-21.