కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
Mangroves in Krishna Wildlife Sanctuary, Andhra Pradesh, India
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Krishna in Andhra Pradesh (India).svg" does not exist.
Locationఆంధ్రప్రదేశ్
Nearest cityమచిలీపట్నం
Area194.81 కి.మీ2 (48,140 ఎకరం)
Governing bodyఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ

కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపాన ఉన్న ఒక వన్యప్రాణుల అభయారణ్యం.[2] ఇది మడ అడవులకు ప్రసిద్ధి. ఈ అడవులు దక్షిణ భారతదేశంలోవేగంగా అంతరించిపోతుండటంతో వీటిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.[3]

భౌగోళికం

[మార్చు]

ఇది 15° 2' N నుంచి 15° 55' N ఉత్తర అక్షాంశాల మధ్యన, 80° 42'- 81° 01' తూర్పు రేఖాంశాల మధ్యన కృష్ణా జిల్లాలో వ్యాపించి ఉన్నది. సొర్లగుండ, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ, కొత్తపాళెం, మోలగుంట, అడవులడివి, లంకివానిదిబ్బ అటవీ కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి.

జంతు, వృక్ష జాతులు

[మార్చు]

కృష్ణా నది ఈ కేంద్రం లోని మడ అడవుల గుండా ప్రయాణిస్తుంది. ఈ అడవుల్లో అరుదుగా కనిపించే చేపలు పట్టే అడవి పిల్లులు (ఫిషింగ్ క్యాట్స్) అధిక సంఖ్యలో ఉన్నాయి.[4] తుమ్మ, మర్రి, రావి, మామిడి మొదలైన చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. గార్డెన్ లిజార్డ్, వాల్ లిజార్డ్, తాబేళ్ళు, అనేక రకాలైన పాములు కనిపిస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. "ATLAS OF MANGROVE WETLANDS OF INDIA" (PDF). Retrieved 2012-07-30.[permanent dead link]
  2. "APFD Website". Forest.ap.nic.in. Archived from the original on 2012-05-22. Retrieved 2012-07-30.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-10-23.
  4. "ఫిషింగ్ క్యాట్స్ వెబ్ సైటు". Archived from the original on 2015-10-21. Retrieved 2016-10-23.