Jump to content

కృష్ణ వ్రింద విహారి

వికీపీడియా నుండి
కృష్ణ వ్రింద విహారి
దర్శకత్వంఅనీష్‌ ఆర్‌. కృష్ణ
నిర్మాతఉషా మూల్పూరి
తారాగణంనాగ శౌర్య
షెర్లీ సెటియా
రాధిక
వెన్నెల కిశోర్
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్‌
సంగీతంమహతి స్వరసాగర్‌
నిర్మాణ
సంస్థ
ఐరా క్రియేషన్స్‌
విడుదల తేదీs
2022 సెప్టెంబర్ 23 (థియేటర్)
2022 సెప్టెంబర్ 30 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

కృష్ణ వ్రింద విహారి 2022లో విడుదల కానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమాకు అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వం వహించాడు. నాగ శౌర్య, షెర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జనవరి 22న విడుదల చేసి,[1]  టీజర్‌ను మార్చి 27న విడుదల చేశారు.[2] కృష్ణ వ్రింద విహారి 2022 సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలై, 2022 సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[3]

కృష్ణాచారి(నాగశౌర్య)ది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. కృష్ణ తల్లి అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) ఆచార, సంప్రాదాయాల విషయంలో చాలా క‌చ్చితంగా వుంటుంది. కృష్ణకి హైదరాబాద్ లో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తన టీమ్ లీడర్ వ్రింద (షర్లీ)ని చూసి ప్రేమలో పడిపోతాడు. కృష్ణ తన ప్రేమ గురించి వ్రిందకి తెలపగా కృష్ణ ప్రేమని అంగీకరిస్తుంది. కానీ వ్రింద ఒక సమస్యతో బాధపడుతూ కృష్ణ ప్రేమకు తిరస్కరిస్తుంది. వ్రింద చెప్పిన సమస్య ఏమిటి? ఆమె ప్రేమ కోసం కృష్ణ ఏం చేశాడు ? చివరికి వాళ్ళిద్దరూ కలుస్తారా? విడిపోతారా? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఐరా క్రియేషన్స్‌
  • నిర్మాత: ఉషా మూల్పూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనీష్‌ ఆర్‌ కృష్ణ
  • సంగీతం: మహతి స్వరసాగర్‌
  • సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (23 January 2022). "కృష్ణ వ్రింద విహారి". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  2. Eenadu (27 March 2022). "టీజర్‌తో.. 'కృష్ణ వ్రింద విహారి'". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  3. "ఓటీటీలోకి 'కృష్ణ వ్రింద విహారి'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". 18 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  4. "రివ్యూ:కృష్ణ వ్రింద విహారి". 23 September 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  5. 10TV (22 January 2022). "'కృష్ణ వ్రింద విహారి' గా నాగ శౌర్య." (in telugu). Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)