కృష్ణ శతకము
| కృష్ణ శతకం | |
|---|---|
| కవి పేరు | శ్రీ నృసింహ కవి |
| వాస్తవనామం | krishna sathakam |
| వ్రాయబడిన సంవత్సరం | 18వ శతాబ్దం |
| దేశం | భారత దేశము |
| భాష | తెలుగు |
| మకుటం | కృష్ణా! |
| విషయము(లు) | కృష్ణ లీలలు, దశావతారములు |
| పద్యం/గద్యం | పద్యములు |
| ఛందస్సు | కందపద్యాలు |
| మొత్తం పద్యముల సంఖ్య | 102 |
| అంతర్జాలం లో | వికీసోర్సు లో కృష్ణ శతకం |
| అంకితం | కృష్ణుడు |
| కీర్తించిన దైవం | కృష్ణుడు |
| శతకం లక్షణం | భక్తి శతకం |
కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం. ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు. ఇది శ్రీకృష్ణునికి అంకితమివ్వబదినది.[1]
కవి పరిచయం
[మార్చు]కృష్ణ శతక కర్త నృసింహ కవి. ఆయన దాదాపు సా.శ. 1760 ప్రాంతమువాడు.[2]
భారద్వాజసగోత్రుడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహాహ్వయుడన్
శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణా
అతను రాసిన "తిరిమణి మనుజుడు పరమ పవిత్రుండు" అను పద్యమును బట్టి అతను వైష్ణవ మతానికి చెందిన వాడు కావచ్చు.
శతక విశేషాలు
[మార్చు]ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. ఈ శతకము లోని మొదటి పద్యం :
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీత లోల నగదర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1||
మూలాలు
[మార్చు]- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "కృష్ణ శతకము : స్తోత్రాలు కీర్తనలు : అలమార : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-29.
- ↑ "కృష్ణ శతకము -నృసింహకవి - అచ్చంగా తెలుగు". www.acchamgatelugu.com. Archived from the original on 2019-12-02. Retrieved 2020-04-29.
బాహ్య లంకెలు
[మార్చు]- "ఆంధ్రభారతి - శతకములు - కృష్ణ శతకము". telugubharati.com. Retrieved 2020-04-29.[permanent dead link]
