కృష్ణ (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ
(2008 తెలుగు సినిమా)
TeluguFilm Krishna 2008.JPG
దర్శకత్వం వి.వి. వినాయక్
నిర్మాణం బి. కాశీవిశ్వనాధం
రచన వి.వి. వినాయక్
ఆకుల శివ
తారాగణం రవితేజ
త్రిష
గిరిబాబు
సాయాజీ షిండే
ముకుల్ దేవ్
బ్రహ్మానందం
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం ఛోటా కె. నాయుడు
కూర్పు గౌతంరాజు
విడుదల తేదీ జనవరి 12, 2008
దేశం Indiaభారతదేశం
భాష తెలుగు
పెట్టుబడి 4 కోట్లు.
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కృష్ణ, 2008 జనవరిలో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఆ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలలో ఇది బాగా విజయవంతమైనదిగా పేరు పొందింది. రవితేజ సినిమా రంగంలో ముఖ్యనాయకునిగా నిలద్రొక్కుకోవడానికి ఈ సినిమా దోహదం చేసింది. అంతకుముందు రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో అనేక సినిమాలు రాగా ఇది హైదరాబాదు, విజయవాడ గ్యాంగుల నేపథ్యంలో చిత్రీకరింపబడింది.

కథ[మార్చు]

"కృష్ణ" సినిమా ఆడుతున్న హాలువద్ద కోలాహలం

కృష్ణ (రవితేజ) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు తన మిత్రునికోసం తన ఉద్యోగం వదులుకొని నిరుద్యోగిగా ఉంటాడు. సంధ్య (త్రిష) అనే అమ్మాయి హైదరాబాదునుండి తన బాబాయి బాబీ (బ్రహ్మానందం) ఇంటికి వస్తుంది. ఆమెను ఇష్టపడిన కృష్ణ తన అన్న (చంద్రమోహన్), వదిన (సుధ)లతో సహా వారింట్లో అద్దెకు దిగుతాడు. కృష్ణ, సంధ్యల మధ్య కీచులాటలతో మొదలైన వ్యవహారం చివరికి ప్రేమకు దారి తీస్తుంది.

తరువాత సంధ్య హైదరాబాదులో తన అన్న (సాయాజీ షిండే) ఇంటికి తిరిగి వస్తుంది. పాత విషయాల కారణంగా కౄరుడైన జగ్గా (ముకుల్ దేవ్) సంధ్యను పెళ్ళి చేసుకోవాలని వెంటాడుతుంటాడు. అందుకు అతని బాబాయ్ (జయప్రకాష్) సాయం చేస్తుంటాడు. ఈ విలన్ల బారినుండి సంధ్యను రక్షించడం, విలన్ల ఆట కట్టించడం, చివరకు కృష్ణ, సంధ్యలు పెళ్ళి చేసుకోవడం ఈ సినిమా కథాంశాలు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కలెక్షన్లు[మార్చు]

  • మొదటి వారంలో ఈ సినిమా 11.6 కోట్లు వసూలు చేసింది.[1] రెండువారాల కలెక్షన్ల మొత్తం 17.8 కోట్లు.[2]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]