కెన్నెత్ కౌండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కెన్నెత్ కౌండ (28 ఏప్రిల్ 1924 – 17 జూన్ 2021),[1] జాంబియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[2]

జాంబియాలో తన నివాసంలో భారత రాష్ట్రపతితో సమావేశమైన కెన్నెత్ కౌండ

జీవిత విశేషాలు[మార్చు]

కెన్నెత్ కౌండ 1921లో జన్మించాడు.[3][4] ఇతడిని అందరూ కేకేగా పిలుచుకుంటారు.1964 నుంచి 1991 వరకు జాంబియా మొదటి అధ్యక్షుడుగా పనిచేశాడు.[5] కెన్నెత్ కౌండా జాంబియా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 1971 లో ఆర్థిక సంక్షోభంతో జాంబియా ఆర్థికంగా చాలా నష్టపోయింది. ప్రజలనుంచి కౌండ ఎదుర్కొన్నాడు. జాంబియా అంటత నిరసనలు చెలరేగాయి. ప్రజలు జాంబియా వ్యాప్తంగా ప్రజలు కెన్నెత్ కౌండ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కెన్నెత్ కౌండ నిరసనలను అణిచి వేశాడు. కెన్నెత్ కౌండ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తర్వాత1991లో జాంబియా పౌరసత్వం నుండి తొలగించబడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత జాంబియా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

కెన్నెత్ కౌండ 1964లో వివాహం చేసుకున్నాడు. అతనికి 8 మంది సంతానం.[6] ఒక ఇంటర్వ్యూలో కౌండా నేను మాంసం గుడ్లు తీసుకోనని అని కేవలం కూరగాయలు మాత్రమే తింటానని వ్యాఖ్యానించాడు. అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాడు.[7] 1954లో టీ మానేశాడు.[7] కెన్నెత్ కౌండా 2021 జూన్ 14న అనారోగ్యం పాలవడంతో జాంబియా రాజధాని అయినా లుసాకా లోని మిలటరీ ఆసుపత్రిలో చేరాడు.[8] జూన్ 15న కెన్నెత్ కౌండా ఆరోగ్యం విష మించింది. కౌండాను బతికించడానికి వైద్యులు చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నారని జాంబియా ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూన్ 16 కెన్నెత్ కౌండ కు న్యూమోనియా వ్యాధి సోకినట్లు జాంబియా ప్రభుత్వం ప్రకటించింది.[9] 2021 జూన్ 17న కౌండ మరణించినట్లు నిర్ధారించబడింది.

కెన్నెత్ కౌండా మరణానికి జాంబియా అధ్యక్షుడు రుషియా బండ ఇలా వ్యాఖ్యానించాడు. కౌండమరణం జంబియా ప్రజలకు తీరని లోటు. 25 ఏళ్ల ఆయన పాలన లో జాంబియా ఒక గొప్ప దేశంగా ఎదిగిందని ఆయన ఫేస్బుక్లో ప్రకటించాడు. ఆయన మరణానికి సంతాపంగా జాంబియా ప్రభుత్వం 14 రోజులు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. వేరే దేశాలు కూడా సంతాపు దినాలు ప్రకటించాయి. దక్షిణాఫ్రికా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. నమీబియా ఈజిప్ట్ కెన్యా సుడాన్ సంతాప దినాలను ప్రకటించాయి. 2021 జులై రెండున్న రాష్ట్రపతి స్మశాన వాటిక లోఅంత్యక్రియలు జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. Arnold, Guy (17 June 2021). "Kenneth Kaunda obituary". The Guardian. Retrieved 17 June 2021.
  2. The Listener Archived 18 జూన్ 2021 at the Wayback Machine, Volume 110, BBC, 1983, page 13
  3. Kasuka, Bridgette (7 February 2012). Independence Leaders of Africa. Bankole Kamara Taylor. ISBN 978-1-4700-4175-5. Retrieved 15 October 2019 – via Google Books.
  4. "Former Zambian president Kenneth Kaunda dies | eNCA". enca.com (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2021. Retrieved 17 June 2021.
  5. "10 Things You Didn't Know About Reuben Chitandika Kamanga | Youth Village Zambia" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2021. Retrieved 18 May 2021.
  6. "Mama Betty Kaweche Kaunda – First Lady from 1964 to 1991". Government of Zambia. Archived from the original on 24 June 2021. Retrieved 18 June 2021.
  7. 7.0 7.1 "Kaunda attributed his long life to being a vegetarian" Archived 2023-02-04 at the Wayback Machine. kulinji.com. Retrieved 4 February 2023.
  8. "Former Zambian president Kenneth Kaunda, 97, taken to hospital". Reuters. 14 June 2021. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.
  9. "Zambia's founding president Kaunda, 97, treated for pneumonia". Reuters. 15 June 2021. Archived from the original on 15 June 2021. Retrieved 15 June 2021.