Jump to content

కెన్నెత్ పావెల్

వికీపీడియా నుండి
కెన్నెత్ పావెల్
జననం(1940-04-20)1940 ఏప్రిల్ 20
కోలార్, మైసూరు రాజ్యం, బ్రిటిష్ ఇండియా
మరణం2022 డిసెంబరు 11(2022-12-11) (వయసు: 82)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
ఇతర పేర్లుది జెంటిల్మాన్ స్ప్రింటర్
వృత్తిట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడు
ఎత్తు5 ft 7 in (170 cm)
పురస్కారాలు

కెన్నెత్ లారెన్స్ పావెల్ (20 ఏప్రిల్ 1940-11 డిసెంబర్ 2022), కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడు.[1] ఇతడు 1964 ఒలింపిక్స్, 1970 ఆసియా క్రీడలలో పోటీపడ్డాడు. ఇతనికి 1965లో భారత ప్రభుత్వం అర్జున అవార్డును, 2018లో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేశాయి.[2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

పావెల్ 1940 ఏప్రిల్ 20న ప్రస్తుత భారత రాష్ట్రమైన కర్ణాటకలోని కోలార్ లో జన్మించాడు.[4] ఇతడు తన మొదటి ప్రధాన ఈవెంట్, కలకత్తాలో జరిగిన 1957 నేషనల్ స్కూల్ గేమ్స్‌లో మూడవ స్థానంలో నిలిచాడు.[4]

వృత్తి

[మార్చు]

పావెల్ 19 సంవత్సరాల వయస్సులో బెంగళూరు వెళ్లి, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటిఐ) లిమిటెడ్లో చేరాడు. అక్కడ ఇతనికి రేంజర్స్ అథ్లెటిక్స్ క్లబ్ కోచ్ కృష్ణ శిక్షణ ఇచ్చాడు.[4] నిజానికి ఇతడు క్రికెటర్‌గా రాణించాలని ఆశించాడు. ఐటిఐలో ఫాస్ట్ బౌలర్ గా ఉన్నాడు. కోచ్ బెంజమిన్ ఫ్రాంక్ ఇతని వేగంగా పరుగెత్తే సామర్థ్యాన్ని చూసిన తర్వాత ఇతడిని అథ్లెటిక్స్‌ను ఎంచుకోవాలని సిఫారసు చేశాడు.[5]

1960లలో భారతదేశంలోని అగ్రశ్రేణి అథ్లెట్లలో పావెల్ ఒకడు. మిల్కా సింగ్ తో ఇతనికి ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.[6] 1964 టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత 4x100 మీటర్ల రిలే జట్టులో ఇతడు సభ్యుడు. అదే ఒలింపిక్స్‌లో, ఇతడు 100 మీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1970 ఆసియా క్రీడలలో కాంస్యం సాధించిన జట్టులో కూడా ఇతడు సభ్యుడు.[4] తన కెరీర్లో, పావెల్ భారతదేశం అంతటా జరిగిన ఈవెంట్ల నుండి 19 స్ప్రింటింగ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.[4] పావెల్ 1970లో జాతీయ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు.

1981లో సింగపూర్లో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల ఈవెంట్లో 40-44 వయస్సు-సమూహానికి రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.[6] ఇతడు మెల్బోర్న్ జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో 45-49 వయస్సు-సమూహ ఈవెంట్లో ఫైనలిస్ట్‌గా కూడా నిలిచాడు.[7]

ఇతడిని ది జెంటిల్మాన్ స్ప్రింటర్ అని కూడా పిలిచేవారు. .[6] ఐటిఐలో పనిచేసిన తరువాత, ఇతడ్డు రైల్వేలో ఉద్యోగం చేసాడు. ఆ తరువాత టాటా స్టీల్ లో పనిచేశాడు, అక్కడ నుండి ఇతడు 1997లో పదవీ విరమణ చేశాడు.[8] పదవీ విరమణ చేసిన తరువాత పావెల్ కర్ణాటకలో అథ్లెటిక్స్‌తో అనుబంధం కొనసాగించాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు 1970లో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో ఓ.ఎల్. థామస్, ఎ.పి. రామస్వామి, రమేష్ తవ్డేలతో కలిసి 4×100 మీ రిలే పరుగు పందెంలో లక్ష్యాన్ని 40.9 సెకెన్లలో ఛేధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది జాతీయ రికార్డు.[9]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1970ఆసియా క్రీడలుబ్యాంకాక్, థాయిలాండ్3వ4 X 100 మీ.రిలే40.9
జాతీయ రికార్డ్

అవార్డులు

[మార్చు]

పావెల్ 1965లో భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును అందుకున్నాడు.[4] ఈ అవార్డును గెలుచుకున్న కర్ణాటక నుండి మొదటి క్రీడాకారుడు ఇతడే.[10] ఇతడు 2018లో కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ అవార్డు అందుకున్నాడు.[11]

వ్యక్తిగత జీవితం, మరణం

[మార్చు]

ఇతడు డాఫ్నే పావెల్‌ను వివాహం చేసుకున్నాడు, ఆమె తొలినాళ్లలో అథ్లెట్ కూడా.[6][12][8] ఈ జంట బెంగళూరులోని కుక్ టౌన్ పరిసరాల్లో నివసించారు. [12][13]

పావెల్ 11 డిసెంబర్ , 2022న 82 సంవత్సరాల వయసులో బెంగళూరులో మరణించాడు.[6][4]

మూలాలు

[మార్చు]
  1. bhambra, abhijit (19 June 2021). "Milkha Singh was a simple man with a simple living, says Kenneth Powell, The Gentleman Sprinter". NEWS9LIVE (in ఇంగ్లీష్). the original నుండి 20 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2022.
  2. "Karnataka / Bangalore News : Athletes who almost made it". The Hindu. 13 August 2008. the original నుండి 20 September 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 September 2013.
  3. "India at the Games". Sportstaronnet.com. 2 August 2008. ఒరిజినల్ నుండి 16 April 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 September 2013.
  4. 1 2 3 4 5 6 7 PTI (11 December 2022). "Olympian and 1970 Asian Games medallist Kenneth Powell passes away". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 10 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2022.
  5. bhambra, abhijit (19 June 2021). "Milkha Singh was a simple man with a simple living, says Kenneth Powell, The Gentleman Sprinter". NEWS9LIVE (in ఇంగ్లీష్). the original నుండి 20 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2022.
  6. 1 2 3 4 5 "'Gentleman sprinter' Kenneth Powell passes away". 11 December 2022. ఒరిజినల్ నుండి 11 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2022.
  7. bhambra, abhijit (19 June 2021). "Milkha Singh was a simple man with a simple living, says Kenneth Powell, The Gentleman Sprinter". NEWS9LIVE (in ఇంగ్లీష్). the original నుండి 20 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2022.
  8. 1 2 Lazarus, Juliana (1 August 2010). "Anglos: A part and yet apart". Bangalore Mirror (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2022.
  9. వెబ్ మాస్టర్. "Kenneth Powell". Athletics Podium. Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 January 2026.
  10. bhambra, abhijit (19 June 2021). "Milkha Singh was a simple man with a simple living, says Kenneth Powell, The Gentleman Sprinter". NEWS9LIVE (in ఇంగ్లీష్). the original నుండి 20 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2022.
  11. "Karnataka / Bangalore News : Athletes who almost made it". The Hindu. 13 August 2008. the original నుండి 20 September 2008 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 September 2013.
  12. 1 2 Baskaran, Hari (11 April 2018). These Bloomin' Anglos: Glimpses into the Anglo-Indian heart (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-1-64249-767-0. the original నుండి 10 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2023.Baskaran, Hari (11 April 2018). These Bloomin' Anglos: Glimpses into the Anglo-Indian heart. Notion Press. ISBN 978-1-64249-767-0. Archived from the original on 10 January 2023. Retrieved 10 January 2023.
  13. bhambra, abhijit (19 June 2021). "Milkha Singh was a simple man with a simple living, says Kenneth Powell, The Gentleman Sprinter". NEWS9LIVE (in ఇంగ్లీష్). the original నుండి 20 August 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2022.