కెవిన్ రైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1953, డిసెంబర్ 27న జన్మించిన కెవిన్ జాన్ రైట్ (Kevin John Wright) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1979లో 10 టెస్టులు, 5 వన్డేలలోఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు ప్రధానంగా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వహించాడు.

టెస్ట్ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 16.84 సగటుతో 219 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 55 నాటౌట్. వికెట్-కీపర్ ‌గా 31 క్యాచ్‌లు, 4 స్టంపింగ్‌లతో 35 బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేయడంలో తన పాత్ర నిర్వహించాడు. వన్డే లలో 5 మ్యాచ్‌లు ఆడి 8 క్యాచ్‌లు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో 29 పరుగులు చేశాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 23 పరుగులు. 1979 ప్రపంచ కప్ పోటీలలో వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం సంపాదించాడు.