కె.ఆర్. గణేష్
| కె.ఆర్. గణేష్ | |||
| పదవీ కాలం 1967 – 1977 | |||
| ముందు | నిరంజన్ లాల్ | ||
|---|---|---|---|
| తరువాత | మనోరంజన్ భక్త | ||
| నియోజకవర్గం | అండమాన్ నికోబార్ దీవులు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1922 జూన్ 21 పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు | ||
| మరణం | 2004 జనవరి 2 (వయసు: 81) గుర్గావ్ , హర్యానా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | కాంత మౌర్య | ||
| నివాసం | పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కె.ఆర్. గణేష్ (1922 జూన్ 21 - 2004) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గాల నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర పెట్రోలియం & రసాయనాల మంత్రిత్వ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]కె.ఆర్. గణేష్ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పికెఎస్ ప్రసాద్‌పై 10,040 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1970 జూన్ 26 నుండి 1971 మార్చి 18 వరకు ఇందిరా గాంధీ రెండవ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1971 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పికెఎస్ ప్రసాద్‌పై 17,333 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1974 అక్టోబర్ 10 నుండి 1975 డిసెంబర్ 1 వరకు పెట్రోలియం & రసాయనాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
కె.ఆర్. గణేష్ 1977 లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మనోరంజన్ భక్త చేతిలో 10,232 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ G. G. Mirchandani (2003). 320 Million Judges. Abhinav Publications. pp. 90–100. ISBN 81-7017-061-3.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2020-04-10.
- ↑ In Memoriam: K.R. Ganesh: LaRouches Lose a Friend
- ↑ "References Made To The Passing Away Of Shri Bhan Singh Bhaura, Member, ... on 29 January, 2004". indiankanoon.org. Retrieved 2020-04-10.