Jump to content

కె.ఉల్లాస్ కారంత్

వికీపీడియా నుండి
కె.ఉల్లాస్ కారంత్
జననం1948 (age 77–78)
పుత్తూరు, కర్ణాటక
విద్యవైల్డ్‌లైఫ్ ఎకాలజీలో ఎంఎస్‌సి, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారిడా; అప్లైడ్ జూఆలజీలో పిహెచ్‌డి మంగుళూరు యూనివర్సిటీ
పూర్వ విద్యార్థిNITK, సూరత్‌కల్
వృత్తివైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్]], కన్సర్వేషన్ బయాలజీ, కార్నివోరా, బయాలజీ
క్రియాశీల సంవత్సరాలు1988–present
ఉద్యోగి(s)National Centre for Biological Sciences, Centre for Wildlife Studies, Wildlife Conservation Society
Known forపులుల సంరక్షణ
ప్రముఖమైన కృషి135 పైచిలుకు పేపర్లు, ఇంగ్లీషు, కన్నడంలలో 7 పుస్తకాలు
జీవిత సహచరిప్రతిభా కారంత్
పిల్లలుకీర్తి కారంత్
Parentతండ్రి: శివరామ కారంత్[1]
పురస్కారాలుJ. Paul Getty Award for Conservation Leadership, Padma Shree
వెబ్‌సైట్Dr K. Ullas Karanth, CWS

కోట ఉల్లాస్ కారంత్ (జననం 1948) కర్ణాటకలో నివసిస్తున్న ఒక పరిరక్షణ జంతుశాస్త్రవేత్త, పులుల నిపుణుడు. ఆయన వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ వారి ఇండియా ప్రోగ్రామ్‌కు డైరెక్టరు.[2] భారతదేశంలోని పెద్ద అడవి క్షీరదాల జనాభా సాంద్రత అధ్యయనాల కోసం కెమెరా ట్రాప్‌లను ఉపయోగించడంలో మార్గదర్శకుడిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన న్యూయార్క్‌లోని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS)లో సీనియర్ కన్జర్వేషన్ సైంటిస్టు. WCS టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్‌కు టెక్నికల్ డైరెక్టరు.[3][4]

బెంగాల్ పులులను కాపాడేందుకు WCS-I చేసిన ప్రయత్నాలకు కారంత్ నేతృత్వం వహించాడు. వాటి జనాభా, ఆవాస అవసరాలను బాగా అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించాడు. ప్రధానంగా నాగర్‌హోల్ నేషనల్ పార్క్‌లో పనిచేస్తూ, కారంత్ చేసిన కృషి వలన పులి వంటి కీస్టోన్ ప్రెడేటర్ జాతుల మనుగడ కోసం, ఎర జనాభాను పరిరక్షించడం ఎంత ముఖ్యమో తెలిసింది.

2007 లో కారంత్, ప్రపంచ వన్యప్రాణి నిధి యొక్క వార్షిక పరిరక్షణ నాయకత్వానికి గాను, జె. పాల్ గెట్టి అవార్డును అందుకున్నాడు. ఆ బహుమతి అందుకున్న రెండవ వ్యక్తి అతను.[5] 2019 లో న్యూయార్క్‌లోని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ నుండి వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సైన్స్‌లో జార్జ్ షాలర్ లైఫ్‌టైమ్ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి అతడు.[6]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కారంత్ ప్రముఖ కన్నడ రచయిత శివరామ్ కారంత్ కుమారుడు. కారంత్ తన కౌమారదశలో ఆసియాలో పులులను కాపాడటానికి ప్రయత్నిస్తున్న ప్రకృతి శాస్త్రవేత్తల గురించి చదివాడు. ఈ ప్రయత్నంలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను సూరత్కల్‌లోని KREC (ఇప్పుడు NITK అని పిలుస్తారు) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో B.Tech. చేసాడు. అక్కడ అతను 1966 నుండి 1971 వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అతను చాలా సంవత్సరాలు కర్ణాటకలో వ్యవసాయం చేసాడు.[7]

తన స్వరాష్ట్రమైన కర్ణాటకలో మానవ కార్యకలాపాల నుండి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వృక్షజాలం, జంతుజాలంపై అతను చేసిన అమెచ్యూర్ జీవశాస్త్ర పరిశీలనలు, జీవవైవిధ్య హాట్‌స్పాట్ అయిన పశ్చిమ కనుమల పరిరక్షణ నమూనాలను పరిశోధించడానికి అతన్ని ప్రేరేపించాయి. 1983లో స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశం అతని అమెరికా ప్రయాణానికి మార్గం సుగమం చేసింది. అక్కడ అతను 1987లో నేషనల్ జూ వారి వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో చదువుకున్నాడు. అతను 1988 లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నుండి వైల్డ్‌లైఫ్ ఎకాలజీలో మాస్టర్స్ డిగ్రీని, 1993లో మంగళూరు విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ జువాలజీలో డాక్టరేట్‌నూ పొందాడు.[4][8]

పులుల జనాభాపై అధ్యయనాలు

[మార్చు]

కర్ణాటకలోని నాగరహోళే వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనంలో అడవుల ఆరోగ్యం జీవవైవిధ్యాన్ని పర్యవేక్షించడం అతని ఏకైక, సుదీర్ఘమైన ప్రాజెక్టు. ముఖ్యంగా పులులు, వాటి ఆహారం యొక్క స్థితిపై అతను చేసిన అధ్యయనంలో వెలువడ్డ కొన్ని ఫలితాలు అనేక శాస్త్రీయ పత్రాలు, పుస్తకాలలో ప్రచురించబడ్డాయి.

అడవులలో పులుల జనాభా సాంద్రతలను శాస్త్రీయంగా అంచనా వేయడానికి పునాదిగా, క్యాప్చర్-రీక్యాప్చర్ నమూనా లోని కెమెరా ట్రాపింగ్ పద్ధతులను అనుసరించడంలో కారంత్ మార్గదర్శకుడు.[2] కెమెరా ట్రాపింగ్ నమూనా డేటాకు బలమైన గణాంక నమూనాను వర్తింపజేయడం ద్వారా, ఈ ప్రాంతం లోని పులుల జనాభాను దగ్గరగా అంచనా వెయ్యవచ్చు. ఇది గతంలో భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, ప్రాజెక్ట్ టైగర్ ఐదు సంవత్సరాల పులుల జనాభా గణనలో ఉపయోగించిన పగ్‌మార్క్ పద్ధతికి భిన్నంగా ఉంటుంది. ఇది ఓ ప్రాంతంలో పులుల సంపూర్ణ గణన చేస్తుందని చెప్పుకోదు కానీ జనాభా స్థాయిలను సూచిస్తుంది. కాబట్టి దాని విధానంలో కూడా ఇది భిన్నంగా ఉంటుంది.[9]

పులుల సంరక్షణకు సంబంధించిన ఈ విధానం ఎర, వేటాడే జంతువులు రెండింటి దృక్కోణం నుండీ అడవులను సంరక్షించడంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విధానాలతో, భారతదేశంలోను, ఇతర ప్రాంతాలలోనూ పులులను సంరక్షించడం సాధ్యమని కారంత్ అంటాడు.

ఇతర పనులు

[మార్చు]

కారంత్ పులులు, ఇతర పెద్ద క్షీరదాల జీవావరణ శాస్త్రంపై సంచలనాత్మక పరిశోధనలు చేశాడు. భారతదేశంలో పులుల రేడియో-టెలిమెట్రీకి ఆయన మార్గదర్శకుడు. ఆయన సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్‌ను స్థాపించి, 135 పైచిలుకు అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ శాస్త్రీయ పత్రాలు, వ్యాసాలనూ ప్రచురించాడు. ఇంగ్లీషు, కన్నడ భాషలలో ఏడు పుస్తకాలను రచించాడు.

కారంత్ భారత ప్రభుత్వ అటవీ సలహా కమిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), కర్ణాటక ప్రభుత్వ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, టైగర్ స్టీరింగ్ కమిటీలలో పనిచేస్తున్నాడు. ఆయన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి గతంలో ఉపాధ్యక్షుడు. భారతదేశంలో పరిరక్షణను సమర్థించే అనేక సమూహాలకు శాస్త్రీయ సలహాదారు. ఆయన వైల్డ్‌లైఫ్ ఫస్ట్‌కు శాస్త్రీయ సలహాదారు. ఇది చురుకైన వన్యప్రాణి ప్రేమికుల సమూహం. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌లో, WCS నిధులతో వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్‌లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. 2008లో కారంత్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కారంత్ లండన్‌లోని జూలాజికల్ సొసైటీకి సైంటిఫిక్ ఫెలో. ఓరిక్స్, జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఎకాలజీ జర్నల్స్ సంపాదక బోర్డులో సభ్యుడు. అతను పిల్లులు, ఏనుగులు, అడవి పశువులు, చిన్న మాంసాహారులపై IUCN జాతుల మనుగడ కమిషన్ ప్రత్యేక సమూహాలలో కూడా పనిచేస్తున్నాడు. కారంత్‌కు బెంగళూరులోని NCBS, మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని వైల్డ్‌లైఫ్ బయాలజీ విభాగంలో అనుబంధ అధ్యాపక హోదా ఉంది. అతను కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయంలో డాక్టరల్ అభ్యర్థులను పర్యవేక్షిస్తాడు.[4] [8]

రచయిత ఆర్.కె. నారాయణ్ తన పుస్తకం 'ఎ టైగర్ ఫర్ మాల్గుడి' పై పని చేస్తున్నపుడు, పులిపై కారంత్‌కు ఉన్న పరిజ్ఞానం కారణంగా, అతన్ని సంప్రదించాడు. ఈ పుస్తకం మానవరూప పులి సాహసాల గురించి ఉంటుంది.[10]

పరిరక్షణలో విధానపరమైన సమస్యలు, మానవ-వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించడంపై కూడా కారంత్ పనిచేస్తాడు. అతను థాయిలాండ్, మలేషియా, కంబోడియా, లావోస్, మయన్మార్, ఇండోనేషియా, రష్యా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలలో పరిశోధన/సంరక్షణ ప్రాజెక్టులకు సంప్రదింపులు అందించడానికి విస్తృతంగా ప్రయాణించాడు. అతని రచనలు నేచర్, ది న్యూయార్క్ టైమ్స్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, బిబిసి, సిఎన్ఎన్, డిస్కవరీ ఛానల్ వంటి అంతర్జాతీయ మీడియాలో ప్రదర్శించబడ్డాయి.[4]

పురస్కారాలు

[మార్చు]
పద్మశ్రీ అవార్డు

2006లో, కారంత్ సియెర్రా క్లబ్ ఇంటర్నేషనల్ ఎర్త్‌కేర్ అవార్డును అందుకున్నాడు. 2007లో, కారంత్ కన్జర్వేషన్ లీడర్‌షిప్‌కు గాను, 2,00,000 జె. పాల్ గెట్టి అవార్డును గెలుచుకున్నాడు. [11] అలాగే 2007లో, అతను సాంక్చువరీ ఆసియా జీవితకాల సాధన అవార్డును గెలుచుకున్నాడు.

2010 లో, కారంత్ కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ అవార్డును అందుకున్నాడు. 2012 జనవరిలో వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చేసిన విశేష కృషికి గాను కారంత్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[4][8] 2019 లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ నుండి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సైన్స్ లో జార్జ్ షాలర్ లైఫ్ టైం అవార్డును అందుకున్నాడు.[12]

ప్రచురణలు

[మార్చు]

కారంత్ 80 కి పైగా పీర్ -రివ్యూడ్ పత్రాలను ప్రచురించారు, వీటిలో ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, USA, ఎకాలజీ, జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఎకాలజీ, ఎకోలాజికల్ అప్లికేషన్స్, జర్నల్ ఆఫ్ యానిమల్ ఎకాలజీ, PLoS జెనెటిక్స్, జర్నల్ ఆఫ్ జువాలజీ, జర్నల్ ఆఫ్ ట్రాపికల్ ఎకాలజీ, కన్జర్వేషన్ బయాలజీ, బయోలాజికల్ కన్జర్వేషన్, ఓరిక్స్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, కేంబ్రిడ్జ్ ప్రెస్, కొలంబియా యూనివర్శిటీ ప్రెస్, ఎల్సెవియర్, స్ప్రింగర్, ఐలాండ్ ప్రెస్ ప్రచురించిన శాస్త్రీయ పుస్తకాలు ఉన్నాయి. అతను ది వే ఆఫ్ ది టైగర్ (2001), ఎ వ్యూ ఫ్రమ్ ది మచాన్ (2006) పుస్తకాలను రచించాడు. మానిటరింగ్ టైగర్స్ అండ్ దెయిర్ ప్రే (2002), కెమెరా ట్రాప్స్ ఇన్ యానిమల్ ఎకాలజీ (2010) లకు సహ-సంపాదకత్వం చేశాడు. అతను ఆంగ్లంలో 50 కి పైగా ప్రసిద్ధ వ్యాసాలు, కన్నడంలో 3 పుస్తకాలు రాశాడు. ఓరిక్స్, జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఎకాలజీ సంపాదకీయ బోర్డులలో కారంత్ పనిచేస్తున్నాడు.

పుస్తకాలు

  • ది వే ఆఫ్ ది టైగర్ (హార్డ్ కవర్, ఓరియంట్ లాంగ్‌మన్ వారి పేపర్‌బ్యాక్)
  • వ్యూ ఫ్రమ్‌ ది మచాన్ - హౌ సైన్స్ కెన్ సేవ్ ది ఫ్రజైల్ ప్రెడేటర్‌ (ఓరియంట్ లాంగ్‌మన్) [13]

మూలాలు

[మార్చు]
  1. ↑ . Leela Karanth Sangeeta Barooah Pisharoty (2002-09-12). "Tailing man's most admired enemy..." The Hindu. Delhi. Archived from the original on 2003-07-01. Retrieved 2012-01-26.
  2. 1 2 Koshy, Jacob (2017-07-19). "K. Ullas Karanth: 'We are slow to adopt science for conservation'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-14.Koshy, Jacob (19 July 2017).
  3. ↑ Verma, Varuna (24 February 2008). "'I was interested in saving the tiger. So I created enemies'". The Telegraph. The Telegraph -- Calcutta. Retrieved 25 February 2011.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  4. 1 2 3 4 5 CWS. "Founder Trustee and Director : Dr K. Ullas Karanth". 1669, 31st Cross, 16th Main, Banashankari 2nd Stage, Bangalore – 560070: Centre for Wildlife Studies. Retrieved 2012-01-26.{{cite web}}: CS1 maint: deprecated archival service (link) CS1 maint: location (link)
  5. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  6. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  7. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  8. 1 2 3 WCS (2012-01-26). "WCS's Dr. Ullas Karanth Wins India's Padma Shri Award". Hime, News and Features. New York: Wildlife Conservation Society. Retrieved 2012-01-26.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  9. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  10. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  11. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  12. ↑ "World Wildlife Fund's Prestigious Getty Award Given to India's Leading Expert on Tiger Conservation". World Wildlife Fund. worldwildlife.org. 16 October 2007. Archived from the original on 16 September 2009.
  13. ↑ CWS. "Publications: Books and Products by CWS, Scientific Publications, Technical Reports and Dissertations". 1669, 31st Cross, 16th Main, Banashankari 2nd Stage, Bangalore – 560070: Centre for Wildlife Studies. Retrieved 2012-01-26.{{cite web}}: CS1 maint: location (link)[permanent dead link]