కె.ఎస్.ఆర్.దాస్
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
కొండా సుబ్బరామ దాస్ | |
---|---|
![]() ప్రముఖ భారత దర్శకుడు స్వర్గీయ కె. ఎస్. ఆర్. దాస్ | |
జననం | 1936, జనవరి 5 నెల్లూరు, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారత్) | 1936 జనవరి 5
మరణం | 2012 జూన్ 8 చెన్నై, తమిళనాడు, భారత్ | (వయసు 76)
వృత్తి | దర్శకుడు, సినీ ఎడిటర్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1966–2000 |
కె.ఎస్.ఆర్.దాస్ (జనవరి 5, 1936 - జూన్ 8, 2012)[1]) తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.
విషయ సూచిక
నేపధ్యము[మార్చు]
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనవరి 5, 1936లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్ వివాహం 1964లో నాగమణీదేవితో జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు.[2] 1966లో ఆయన లోగుట్టు పెరుమాళ్ళకెరుక తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. రజనీకాంత్, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, దాసరి నారాయణరావు, అట్లూరి పూర్ణచంద్ర రావు... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది.
పురస్కారములు[మార్చు]
ఇతనికి కర్ణాటక ప్రభుత్వం తరపున ప్రతిష్ఠాత్మక పుట్టణ్ణ కనగాల్ పురస్కారం లభించింది.
మరణము[మార్చు]
గుండెపోటుతో బాధపడుతూ 2012, జూన్ 8 వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.[3]
సినీ జాబితా (దర్శకుడిగా మరియు సహాయ దర్శకుడిగా)[మార్చు]
తెలుగు సినిమాలు[మార్చు]
కన్నడ సినిమాలు[మార్చు]
క్ర.సం. | విడుదల సం. | సినిమాపేరు |
---|---|---|
1 | 1975 | కళ్ళ కుళ్ళ |
2 | 1976 | బంగారద గుడి |
3 | 1977 | లక్ష్మీనివాస |
4 | 1977 | సహోదరర సవాల్ |
5 | 1978 | కిలాడి కిట్టు |
6 | 1981 | స్నేహితర సవాల్ |
7 | 1981 | జీవక్కె జీవ |
8 | 1982 | కార్మిక కళ్ళనల్ల |
9 | 1983 | తిరుగు బాణ |
10 | 1983 | చిన్నదంత మగ |
11 | 1984 | ఖైదీ |
12 | 1985 | కర్తవ్య |
13 | 1985 | నన్న ప్రతిజ్ఞె |
14 | 1987 | సత్యం శివం సుందరం |
15 | 1989 | ఒందాగి బాళు |
16 | 1989 | రుద్ర |
17 | 1992 | శివ నాగ |
18 | 1992 | నన్న శతృ |
19 | 1995 | స్టేట్ రౌడీ |
20 | 2000 | బిల్లా రంగా |
తమిళ సినిమాలు[మార్చు]
క్ర.సం. | విడుదల సం. | సినిమా పేరు |
---|---|---|
1 | 1972 | పెన్నింగ్ సవాల్ |
2 | 1983 | నాన్ నినైథల్ |
3 | 2000 | నాగతమ్మన్ |
మలయాళ సినిమాలు[మార్చు]
క్ర.సం | విడుదల సం. | సినిమా పేరు |
---|---|---|
1 | 1976 | కళ్ళనం కుళ్ళనం |
హిందీ సినిమాలు[మార్చు]
క్ర.సం. | విడుదల సం. | సినిమాపేరు |
---|---|---|
1 | రాణీ మేరా నామ్ | (1972) |
2 | పిస్తోల్‌వాలీ | (1972) |
3 | అప్నా ఫర్జ్ | (1973) |
4 | బహద్దూర్ ఖిలాడియోఁ | (1973) |
5 | హిఫాజత్ | (1973) |
6 | రాణీ ఔర్ జానీ | (1973) (కథ, దర్శకత్వం) |
7 | చోర్ కా భాయ్ చోర్ | (1978) |
8 | దిలేర్ | (1979) |
9 | బ్లాక్ కోబ్రా | (1981) |
10 | తాకత్‌వాలా | (1984) |
11 | ముల్జిమ్ | (1988) |
మూలాలు[మార్చు]
- ↑ http://www.telugucinema.com/c/publish/stars/interview_ksrdas.php
- ↑ సాక్షి, ఫ్యామిలీ (5 January 2015). "ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!". డా. పురాణపండ వైజయంతి. మూలం నుండి 20 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 20 February 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ http://www.supergoodmovies.com/45598/tollywood/veteran-director-ksr-das-died-news-details