కె.కె. వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.కె. వేణుగోపాల్
K. K. Venugopal
భారత అటార్నీ జనరల్
Assumed office
జూన్ 30, 2017
Appointed byప్రణబ్ ముఖర్జీ (భారత రాష్ట్రపతి)
అంతకు ముందు వారుముకుల్ రోహర్గి
తరువాత వారుఆర్‌. వెంకటరమణి
వ్యక్తిగత వివరాలు
జననం
కొట్టయన్ కటాంకోట్ వేణుగోపాల్

1931
కన్హంగాడ్, కాసరగోడ్, కేరళ, మలబార్
జాతీయతభారతీయురాలు
సంతానం3
కళాశాలరాజా లఖమ్‌గౌడ లా కాలేజ్,
సెయింట్. అలోసియస్ కాలేజ్, మంగుళూరు, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్
వృత్తిలాయర్
పురస్కారాలుపద్మవిభూషణ్ (2015)
పద్మ భూషణ్(2002)

కె.కె. వేణుగోపాల్ (జననం : 1931) ఈయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఈయన భారత అటార్నీ జనరల్‌గా పనిచేశాడు.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1931లో ఆనాటి బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రస్తుత కేరళలోని దక్షిణ కెనరా జిల్లాలోని కన్హంగాడ్ లో జన్మించాడు. ఈయన తండ్రి, ఎం. కె. నంబియార్ న్యాయవాది. ఈయన చెన్నైలో ఉన్న తంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో భౌతికశాస్త్రంలో తన డిగ్రీ విద్యను పూర్తిచేసాడు. కర్ణాటకలోని బెల్గాం లో రాజా లఖంగౌడ లా కాలేజీ నుంచి లా విద్యను అభ్యసించాడు. ఈయన పురాతన పుస్తకాలను సేకరిస్తాడు.

కెరీర్

[మార్చు]

ఈయన గత 50 సంవత్సరాలలో అనేక ముఖ్యమైన కేసులను వాదించాడు. అందులో భూటాన్ రాజ్యాంగ ముసాయిదా కోసం భూటాన్ రాయల్ ప్రభుత్వం ఈయనను రాజ్యాంగ సలహాదారుగా నియమించింది. బాబ్రీ మసీదు కేసు కూల్చివేత కేసులో బీజెపి నాయకుడు ఎల్.కె అద్వానీ తరఫున వాదించాడు. ఈ కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలతో సహా పలు బీజెపి నాయకులు ఉన్నారు.[2]

పురస్కారాలు

[మార్చు]

ఈయనకు 2015 లో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. 2002 లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన 1996 నుండి 1997 వరకు యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ అవోకాట్స్ (యుఐఎ - ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్) అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జూన్ 30, 2017 న భారత అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు.

మూలాలు

[మార్చు]
  1. "Constitutional experts criticise CEC's decision". Archived from the original on 2009-02-06. Retrieved 2019-11-14.
  2. "Meet 86-yr-old KK Venugopal, who replaces Mukul Rohatgi as Attorney General". 30 June 2017.