కె.గీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా॥ కె.గీత
జననంకె.గీత
(1970-12-11)1970 డిసెంబరు 11
Indiaజగ్గంపేట , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంకాలిఫోర్నియా , అమెరికా
వృత్తిసాఫ్ట్ వేర్ ఇంజనీర్, రచయిత్రి
భార్య / భర్తవి.సత్యన్నారాయణ
పిల్లలుకోమల్, వరూధిని, సిరి వెన్నెల
తండ్రికె.రామ్మోహనరావు
తల్లికె.వరలక్ష్మి

డా||కె.గీత ఆంధ్రపదేశ్‌కు చెందిన స్త్రీవాద కవయిత్రి. ‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక సంస్థాపకులు, సంపాదకులు. కవిత్వంతో ప్రారంభించి, కథలు, వ్యాసాలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, సీరియల్స్ రాసారు. భర్త ఉద్యోగరీత్యా అమెరికాలో నివాసముంటున్నారు. ఈమె కవిత్వం సున్నిత భావుకతా నిలయం.

బాల్యం-విద్యాభ్యాసం

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లో కె.రామ్మోహనరావు, కె.వరలక్ష్మి దంపతులకు ప్రథమ కుమార్తెగా జన్మించారు. "కె.గీత" గా ప్రసిద్ధి చెందిన ఈమె అసలు పేరు గీతామాధవి. తల్లి కె.వరలక్ష్మి రచయిత్రి. తల్లిదండ్రుల నివాసరీత్యా ఈమె బాల్యమంతా తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట లో సాగింది. ఇంటర్మీడియేట్ వరకూ జగ్గంపేట హైస్కూలులో చదివేరు. బియ్యే, ఎమ్మే(ఇంగ్లీషు), ఎమ్మే(తెలుగు). పీ.ఎచ్.డీ ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం లో పూర్తి చేసేరు. ఈమె "తెలుగు భాషాశాస్త్రం" లో పరిశోధన చేసి పట్టా పుచ్చుకున్నారు. అమెరికాలో ఇంజనీరింగ్ మానేజ్ మెంటులో ఎమ్మెస్ చేసారు.

ఉద్యోగం

1998-2008 వరకు పది సంవత్సరాల పాటు మెదక్ జిల్లాలో గవర్నమెంట్ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలుగా పనిచేస్తున్నారు.

కుటుంబం

భర్త వి.సత్యన్నారాయణ కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ముగ్గురు పిల్లలు. అబ్బాయి కోమల్ శానోజే యూనివర్సిటీ లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్నాడు. అమ్మాయిలు వరూధిని, సిరి వెన్నెల.

పురస్కారాలు

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2006
  • అజంతా అవార్డు (ద్రవభాష ) -2002
  • సమతా రచయితల సంఘం ఆవార్డు-2002
  • రంజనీ కుందుర్తి- 1998 
  • దేవులపల్లి అవార్డు - 1995 మొ.నవి

కవితా సంపుటులు

  • ద్రవ భాష(2001)
  • శీత సుమాలు(2006)
  • శతాబ్ది వెన్నెల (2013)
  • సెలయేటి దివిటీ (2017)

ఇతర రచనలు

ప్రచురితమైన కవితలు, కథలు, వ్యాసాలు అనేకం.

  • 'గీతా కాలం' 2007 లో కాలమ్ -ఆంధ్ర భూమి
  • "అనగనగా అమెరికా" 2013-14 లలో కాలమ్ -ఆంధ్ర ప్రభ
  • "నా కళ్లతో అమెరికా" నెల నెలా ట్రావెలాగ్స్- విహంగ పత్రిక
  • "సిలికాన్ లోయ సాక్షిగా" కథలు- వాకిలి పత్రిక
  • "వెనుతిరగని వెన్నెల”(ధారావాహిక నవల)- కౌముది పత్రిక

సంస్థలు- సభ్యత్వాలు

  • సిలికానాంధ్ర "మనబడి" అధ్యాపకులు, కరికులం అసోసియేట్ (2009-2011)
  • "వీక్షణం" సాహితీ సంస్థ  సంస్థాపక నిర్వాహకులు. (2012-ఇప్పటి వరకు)
  • "తెలుగు వికాసం" భాషా, సంగీత సంస్థ  సంస్థాపక అధ్యక్షులు, నిర్వాహకులు (2012 -ఇప్పటి వరకు)
  • "బాటా" తెలుగు బడి "పాఠశాల" కరికులం డైరక్టర్.(2013-ఇప్పటి వరకు)
  • "తెలుగు రచయిత" రచయితల వెబ్సైటు సంస్థాపక నిర్వాహకులు. (2016)
  • గాటా - GATA (Gobal Association of Telugu Authors) సంస్థాపక నిర్వాహకులు. (2016)
  • "నెచ్చెలి" సంస్థాపకులు & సంపాదకులు. (2019)


మూలాలు[edit]

  1. https://www.thehansindia.com/featured/sunday-hans/creative-chip-off-the-silicon-valley-514681
  2. https://www.thehansindia.com/news/cities/bengaluru/webinar-on-telugu-literature-held-at-bangalore-university-667774
  3. http://www.saarangabooks.com/telugu/tag/%E0%B0%95%E0%B1%86-%E0%B0%97%E0%B1%80%E0%B0%A4/ Archived 2021-02-25 at the Wayback Machine
  4. https://eemaata.com/em/authors?aa=%E0%B0%95%E0%B1%86.%20%E0%B0%97%E0%B1%80%E0%B0%A4
  5. https://teluguanuvaadaalu.com/tag/%E0%B0%95%E0%B1%86-%E0%B0%97%E0%B1%80%E0%B0%A4/
  6. https://www.telugutimes.net/home/article/65/27589/dr-k-geetha-special-story-corona-crisis-in-usa[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=కె.గీత&oldid=3690936" నుండి వెలికితీశారు