కె.చంద్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.చంద్రు
మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి
In office
31 జులై 2006 – 09 మార్చి 2013
వ్యక్తిగత వివరాలు
జననంమార్చి 1951
శ్రీరంగం
తిరుచిరప్పల్లి జిల్లా
తమిళనాడు రాష్ట్రం
భారతదేశం [1]
జీవిత భాగస్వామిభారతి
సంతానంకీర్తి

కె.చంద్రు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2013 మార్చి 09న పదవీ విరమణ చేశాడు.[2] జస్టిస్ కె.చంద్రు ఆయన రిటైర్మెంట్ తరువాత తన అనుభవాలతో తమిళంలో ‘వేజ్ వార్ విత్ లా’ అనే పుస్తకాన్ని రచించాడు.[3] జస్టిస్ చంద్రు నిజజీవిత కథ ఆధారంగా 2021లో 'జై భీమ్‌' ను నిర్మించారు.[4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కె.చంద్రు 1951 మార్చిలో తమిళనాడు రాష్ట్రం, తిరుచిరప్పల్లి జిల్లా, శ్రీరంగంలో జన్మించాడు. ఆయన ఎల్.ఎల్.బి పూర్తి చేసి న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించాడు.

వృత్తి జీవితం[మార్చు]

చంద్రు న్యాయవాదిగా వివిధ కేసుల్లో కేసులను వాదించాడు. ఆయన జూలై 31, 2006న మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 2009 నవంబరు 9న శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో దాదాపు వేల కేసులకు పరిష్కరించాడు. ఆయన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా 2013 మార్చి 09న పదవీ విరమణ చేశాడు.[5]

న్యాయమూర్తిగా కీలక తీర్పులు[మార్చు]

  • ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం
  • కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు

జై భీమ్‌ సినిమా[మార్చు]

తమిళనాడులోని విరుధచలంలో 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా జై భీమ్‌ అనే సినిమాను 2021లో నిర్మించారు. గిరిజన తెగకు చెందిన ఓ కుటుంబంలో అన్యాయంగా జైలుపాలైన తన భర్త రాజకన్నును కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ పార్వతి మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి పోరాటం చేసింది. ఈ కేసును కె.చంద్రు వాదించి వారికీ న్యాయం అందేలా చేశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Samp Speak (11 March 2013). "Justice Chandru retires - catches local train; walks back to home". Archived from the original on 5 December 2020. Retrieved 4 November 2021.
  2. The Hindu (9 March 2013). "Author of several landmark judgments calls it a day" (in Indian English). Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  3. Edex Live (3 May 2021). "Listen to my Case: Justice K Chandru's new book looks back at 20 landmark judgements made when women approached the courts" (in ఇంగ్లీష్). Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  4. Sakshi (5 November 2021). "ఎవరీ జస్టిస్‌ చంద్రు? జై భీమ్‌ మూవీతో ఆయనకేం సంబంధం?". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Eenadu (21 November 2021). "ఆ కారణం చూపి.. కాలేజీ నుంచి తీసేశారు!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 21 నవంబరు 2021 suggested (help)
  6. Desikan (3 November 2021). "Meet Justice K Chandru, the inspiration behind Suriya's 'Jai Bhim'" (in Indian English). Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కె.చంద్రు&oldid=3412762" నుండి వెలికితీశారు