కె.బి. కోలివాడ్
| కె.బి. కోలివాడ్ | |||
| పదవీ కాలం 2016 – 2018 మే 19 | |||
| ముందు | కాగోడు తిమ్మప్ప | ||
|---|---|---|---|
| తరువాత | కే.ఆర్.రమేష్ కుమార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1944 నవంబరు 1 గూడగూర్, రాణేబెన్నూరు , మైసూర్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | ప్రభావతి | ||
| సంతానం | ప్రకాష్ కోలివాడ్[1] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కృష్ణప్ప భీమప్ప కోలివాడ్ (జననం 1 నవంబర్ 1944) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా, కర్ణాటక శాసనసభ 21వ స్పీకర్‌గా పని చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కె.బి. కోలివాడ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972 శాసనసభ ఎన్నికలలో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ (ఐ) అభ్యర్థి బి.సి. పాటిల్ పై 11,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1985 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేపీ అభ్యర్థి పాటిల్ బసనగౌడ గురనగౌడపై 357 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కె.బి. కోలివాడ్ 1989 శాసనసభ ఎన్నికలలో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి కర్జిగి వీరప్ప సన్నతమ్మప్పపై 2,878 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1994 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి కర్జగి వీరప్ప సన్నతమ్మప్ప చేతిలో 24,538 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
కె.బి. కోలివాడ్ 1999 శాసనసభ ఎన్నికలలో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి తిలవల్లి శివన్న గురప్పపై 5,498 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2002లో ఎస్.ఎం. కృష్ణ మంత్రివర్గంలో తాగునీటి సరఫరా సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2004, 2008 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తిలవల్లి శివన్న గురప్ప చేతిలో ఓడిపోయాడు.
కె.బి. కోలివాడ్ 2013 శాసనసభ ఎన్నికలలో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్. శంకర్ పై 6,788 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2016 నుండి 2019 మే 19 వరకు కర్ణాటక శాసనసభ 21వ స్పీకర్‌గా పని చేశాడు. ఆయన 2018 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ అభ్యర్థి ఆర్. శంకర్ చేతిలో 4338 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
కె.బి. కోలివాడ్ 2019లో రాణిబెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అరుణ్ కుమార్ గుట్టూర్ చేతిలో 23,222 ఓట్లతేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "K.B. Koliwad's son says he differs with his father on CM's resignation" (in Indian English). The Hindu. 27 September 2024. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
- ↑ "Congress MLA KB Koliwad unanimously elected as Karnataka Assembly Speaker" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 5 July 2016. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Ranibennur Constituency Election Results 2019". The Times of India. 13 May 2023. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.