కె.వి.ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. వెంకటేశన్ ఆనంద్
జననం(1966-10-30)1966 అక్టోబరు 30 [1]
పార్క్ టౌన్, చెన్నై, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం
మరణం2021 ఏప్రిల్ 30(2021-04-30) (వయసు 54)
చెన్నై, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం
మరణ కారణంగుండె పోటు
జాతీయత భారతదేశం
విద్యాసంస్థడిజి వైష్ణవ్ కాలేజీ, అరుంబాక్కం, చెన్నై
వృత్తిసినిమాటోగ్రాఫర్,దర్శకుడు, రచయిత , ఫొటోగ్రాఫ‌ర్
క్రియాశీల సంవత్సరాలు1994–2021
పురస్కారాలు‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫ‌ర్ గా నేష‌న‌ల్ అవార్డ్ (1994)

కె.వి. ఆనంద్‌ తమిళనాడుకు చెందిన జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, నటుడు. ఆయన జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించి, పలు సినిమాలకు ఫొటో గ్రాఫర్‌గా కూడా పనిచేశాడు. ఆనంద్ 1994లో సినిమాటోగ్రాఫర్‌గా చేసిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఆయన 2005లో 'కన కందేన్‌' సినిమాతో దర్శకుడిగా మారాడు.[2][3]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఆనంద్‌ 1966, అక్టోబరు 30న చెన్నైలో కరిమానాల్ మునుస్వామి వెంకటేశన్, అనసూయ దంపతులకు జన్మించాడు. ఆయన బాల్యమంతా పులికాట్ లో గడిచింది. ఆయన డిజి వైష్ణవ్ కాలేజీ నుండి డిగ్రీ, 1986లో చెన్నై లయోలా కాలేజ్ లో విజువల్ కమ్యూనికేషన్స్ పూర్తిచేశాడు.

ఫొటో జర్నలిస్టుగా[మార్చు]

కేవీ ఆనంద్‌ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించి, కల్కి, ఇండియా టుడే లాంటి పలు పత్రికల్లో పనిచేశాడు.

సినిమాటోగ్రాఫర్‌[మార్చు]

కేవీ ఆనంద్‌ తమిళ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1994లో తొలిసారిగా మలయాళ సినిమా 'తెన్మావిన్‌ కోంబత్‌'కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి, తొలి సినిమాతోనే జాతీయ పురస్కారం అందుకున్నాడు. ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, శివాజీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు.[4]

సంవత్సరం చిత్రం భాష
1994 తెన్ మావిన్ కొంబాత్ మలయాళం
మిన్నరం మలయాళం
1995 పుణ్యభూమి నాదేశం తెలుగు
1996 కాదల్ దేశం తమిళం
1997 చంద్రలేఖ మలయాళం
1997 నేరుక్కు నేర్ తమిళం
1998 డోలి సాజా కె రఖ్న హిందీ
1999 మూదల్వన్ తమిళం
2000 జోష్ హిందీ
2001 నాయక్: ది రియల్ హీరో హిందీ
2002 విరుంబిగిరెన్ తమిళం
ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ హిందీ
2003 బాయ్స్ తమిళం
2004 చెల్లమే తమిళం
2004 ఖాకీ హిందీ
2007 శివాజీ తమిళం
2007 హీరోవా? జీరోవా? తమిళం

దర్శకుడిగా[మార్చు]

కేవీ ఆనంద్‌ 2005లో 'కన కందేన్‌' సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్‌, కో, మాట్రాన్‌, అనేగన్‌, కవన్‌, కప్పాన్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంవత్సరం చిత్రం
2005 క‌ణా కండేన్ శ్రీకాంత్, గోపిక, పృఃథ్వీరాజ్ సుకుమారన్
2009 అయాన్ సూర్య, తమన్నా, ప్రభు
2011 కో జీవ, అజ్మల్, కార్తీక నాయర్
2012 క‌ణా కండేన్ సూర్య, కాజల్ అగర్వాల్
2015 అనేగన్ \ అనేకుడు - తెలుగు ధనుష్, అమైరా దస్తూర్, కార్తీక్
2017 కవ‌న్‌ విజయ్​ సేతుపతి, టి. రాజేందర్, విక్రాంత్, మడోన్నా సెబాస్టియన్
2019 కాప్పాన్‌ సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా, సామ్నా కాసిం

నటుడిగా[మార్చు]

మరణం[మార్చు]

ఆనంద్, కోవిడ్-19 వ్యాధికి చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2021, ఏప్రిల్ 20న గుండెపోటుతో మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Anand K. V. - Profile". TamilNadu Film Directors Association. 2012. Archived from the original on 30 October 2012. Retrieved 30 April 2021.
  2. TV9 Telugu (30 April 2021). "K.V. Anand: సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ కే.వీ. ఆనంద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. - Director and cinematographer K.V. Anand passes away in chennai". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (30 April 2021). "KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్‌ కన్నుమూత". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  4. "K.V. Anand - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 30 April 2021.
  5. The Indian Express (30 April 2021). "Tamil director-cinematographer KV Anand dies at 54". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.