Jump to content

కె.వి.కామత్

వికీపీడియా నుండి
కుందాపూర్ వామన్ కామత్
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ తొలి చైర్మన్
In office
2015 మే 11  2020 మే 27
అంతకు ముందు వారుఅప్పుడే ఏర్పడింది
తరువాత వారుమార్కోస్ ప్రడో ట్రోయ్‌జో[1]
వ్యక్తిగత వివరాలు
జననం (1947-12-02) 1947 డిసెంబరు 2 (వయసు: 78)
మంగుళూరు, మద్రాసు రాష్ట్రం, ఇండీయన్ డొమినియన్
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
సంతానంఅజయ్ కామత్ (కుమారుడు)
ఆజ్ఞా కామత్ పాయ్ (కుమార్తె)
కళాశాలNITK
IIM అహ్మదాబాదు
వృత్తిన్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్
మాజీ స్వతంత్ర డైరెక్టరు,ఇన్ఫోసిస్
మాజీ చైర్మన్, ఐసిఐసిఐ బ్యాంకు
పురస్కారాలుపద్మభూషణ

కుందాపూర్ వామన్ కామత్ భారతీయ బ్యాంకరు, ఎగ్జిక్యూటివ్. అతను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో స్వతంత్ర డైరెక్టరు, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకుకు మాజీ చీఫ్. అతను గతంలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, ICICI బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశాడు. కామత్ 1996 మే 1 నుండి 2009 ఏప్రిల్ 30న కార్యనిర్వాహక బాధ్యతల నుండి పదవీ విరమణ చేసే వరకు ICICI బ్యాంకుకు వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరు, CEO గా పనిచేశాడు.[2]

కామత్ 2011 ఆగస్టు 21 న NR నారాయణ మూర్తి నుండి ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన 2015 జూన్ వరకు ఛైర్మన్‌గా కొనసాగాడు.[3] ఈ పదవిలో పనిచేయడానికి ముందు, ఆయన 2011 మే 2 నుండి కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నాడు.

కామత్ 2010 నుండి హూస్టన్‌కు చెందిన చమురు సేవల సంస్థ ష్లంబెర్గర్, భారతీయ ఔషధ తయారీదారు లుపిన్ బోర్డులలో స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా పనిచేసాడు. ఆయన పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం గవర్నర్ల బోర్డు సభ్యుడు కూడా.[4]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కామత్ 1947 డిసెంబరు 2న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించాడు. [5] ఆయన కుటుంబం కర్ణాటకలోని కుందాపూర్ పట్టణానికి చెందినది. ఆయన తండ్రి పేరు విశ్వనాథ్ కామత్. ఆయన మాతృభాష కొంకణి. తుళు, కన్నడ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. బాల్యంలో ఎక్కువ భాగం మంగళూరులో గడిపాడు. కన్నడ -మాధ్యమ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు.[6]

మెట్రిక్యులేషన్ తర్వాత, అతను సెయింట్ అలోసియస్ కళాశాలలో పియుసి (ప్రీ-యూనివర్శిటీ) పూర్తి చేశాడు. ఆ సమయంలో అది ఒక సంవత్సరం మాత్రమే. పియుసి పూర్తి చేసిన తర్వాత, మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోసం కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆ సమయంలో కర్ణాటక రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పిలుస్తారు)లో చేరాడు. 1969లో ఎన్ఐటి సూరత్కల్ నుండి పట్టభద్రుడయ్యాక, మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ ( ఐఐఎం-ఎ)లో చేరాడు.[7]

కెరీర్

[మార్చు]

1971లో IIM అహ్మదాబాద్ నుండి పట్టభద్రుడయ్యాక, కామత్ తన కెరీర్‌ను ICICI (ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తో ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగంలో ప్రారంభించాడు. లీజింగ్, వెంచర్ క్యాపిటల్, క్రెడిట్ రేటింగ్‌లు వంటి కొత్త వ్యాపార మార్గాలను స్థాపించడంతో పాటు సాధారణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం వంటి అనుభవం గడించడానికి వివిధ విభాగాలకు వెళ్లాడు. తన సాధారణ నిర్వహణ బాధ్యతలలో భాగంగా, అతను ICICI యొక్క కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి అమలు చేశాడు. ఆ ప్రారంభ సంవత్సరాల నుండి సాంకేతికతలో గణనీయమైన పెట్టుబడులు నేడు ICICIకి పోటీ ప్రయోజనంగా ఉన్న వ్యవస్థలకు దారితీశాయి. కార్పొరేట్, రిటైల్ కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి సాంకేతికత-ఆధారిత ఆర్థిక సంస్థగా ICICI వ్యాపారాలను విస్తరించడంలో కామత్ ప్రసిద్ది పొందాడు.[8]

1988లో, కామత్ మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రైవేట్ రంగ విభాగంలో చేరాడు.[9] ADBలో ఉండగా, అతను చైనా, భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, వియత్నాంలలో వివిధ ప్రాజెక్టులలో అనుభవం సంపాదించాడు. అతను అనేక కంపెనీల బోర్డులలో ADB ప్రతినిధిగా ఉన్నాడు. [10]

1996 మేలో, కామత్ ICICIకి మేనేజింగ్ డైరెక్టరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వచ్చాడు. రిటైల్ కస్టమర్లకు గ్రూప్ సేవలను విస్తరించడంలో కామత్ కీలక పాత్ర పోషించాడు. 1996-98లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వరుస కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించాడు. ICICI బ్యాంక్ ఏర్పాటు చేసాడు.


2011 మే 2 న, దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు ఇన్ఫోసిస్ లిమిటెడ్ (గతంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్) కు కామత్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[11]

ఐసిఐసిఐ చైర్మన్, బ్రిక్స్ బ్యాంక్ నియోజిత అధ్యక్షుడు కెవి కామత్ 2015 మే 18 న న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార & ప్రసార మంత్రి అరుణ్ జైట్లీని కలిశాడు.

NR నారాయణ మూర్తికి చోటు కల్పించడానికి ఇన్ఫోసిస్‌ చైర్మన్ పదవి నుండి వైదొలిగిన తర్వాత ఆయన ఇన్ఫోసిస్‌లో లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్నాడు.[12] ఆయన ఇన్ఫోసిస్ బోర్డుకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 2014 అక్టోబరు 11 న నియమితుడయ్యాడు.[13] బ్రిక్స్ ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకుకు మొదటి చీఫ్‌గా నియమితులైన తర్వాత, ఆయన 2015 జూన్ 5 నుండి చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ పదవి నుండి వైదొలిగాడు.[14]

ఆయన కొత్తగా ఏర్పడిన అభివృద్ధి ఆర్థిక సంస్థ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NaBFID) ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[15]

ఆయన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కు ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టరు కూడా.[16]

బోర్డు సభ్యత్వం

[మార్చు]

కామత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, పండిట్ దీన్దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ, గాంధీనగర్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి అనేక విద్యా సంస్థల పాలక మండలిలో సభ్యుడు. బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కు నియామకం అయ్యే వరకు ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ లో పాలక మండలి ఛైర్మన్ గా ఉన్నాడు. ఆయన స్థానంలో దీపక్ సత్వలేకర్ నియమితుడయ్యాడు.[17]

కామత్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) లో కూడా సభ్యుడు.

అతను హూస్టన్‌కు చెందిన చమురు సేవల సంస్థ ష్లంబెర్గర్, భారతీయ ఔషధ తయారీదారు లుపిన్ బోర్డులలో కూడా పనిచేసాడు.

అవార్డులు

[మార్చు]
  • భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ అవార్డు - 2008 [18]
  • ఆసియా బ్యాంకులలో అత్యంత ఇ-సావీ CEO - ది ఏషియన్ బ్యాంకర్ జర్నల్ ఆఫ్ సింగపూర్ [19]
  • ఫైనాన్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - ముంబై మేనేజ్‌మెంట్ అసోసియేషన్ [19]
  • ఇన్నోవేటివ్ హెచ్ ఆర్ ప్రాక్టీసెస్ కు ఉత్తమ CEO - ప్రపంచ హెచ్ ఆర్ డి కాంగ్రెస్ [20]
  • ఆసియన్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ – ఆసియన్ బిజినెస్ లీడర్ అవార్డు 2001
  • అత్యుత్తమ వ్యాపార నాయకుడు ఆఫ్ ది ఇయర్ – CNBC-TV18, 2006 [21]
  • బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ - బిజినెస్ ఇండియా, 2005 [22]
  • బిజినెస్ లీడర్ అవార్డు ఆఫ్ ది ఇయర్ – ది ఎకనామిక్ టైమ్స్, 2007
  • బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ - ఫోర్బ్స్ ఆసియా [23]

మూలాలు

[మార్చు]
  1. "KV Kamath demits office as NDB President, Brazil's Marcos Troyjo to replace". businesstoday.in. New Delhi: Business Today. May 30, 2020. Retrieved June 4, 2020. Kamath, 72, was the non-executive Chairman of the ICICI bank beside Chairman of the IT bellwether Infosys before joining the NDB.
  2. "Sitemap". Archived from the original on 26 July 2013. Retrieved 9 November 2016.
  3. "Sitemap". Archived from the original on 26 July 2013. Retrieved 9 November 2016.
  4. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  5. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  6. "Sitemap". Archived from the original on 26 July 2013. Retrieved 9 November 2016.
  7. G Pinto, Stanley (2011-05-03). "For people of Kundapur, everything's in the name". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-09-14.
  8. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  9. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  10. "Sitemap". Archived from the original on 26 July 2013. Retrieved 9 November 2016.
  11. "K.V. Kamath is Infosys chairman; Shibulal, the new CEO and MD". The Hindu. Retrieved 11 September 2012.
  12. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  13. "Sitemap". Archived from the original on 26 July 2013. Retrieved 9 November 2016.
  14. CNBC Asia Business Leaders Awards 2001
  15. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  16. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  17. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  18. "Press Information Bureau". Retrieved 9 November 2016.
  19. 1 2 "Kamath made banking cool". The Times of India. 20 December 2008.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  20. "Sitemap". Archived from the original on 26 July 2013. Retrieved 9 November 2016.
  21. "Indian Business Leader Awards: Who are the winners?". Retrieved 9 November 2016.
  22. "K V Kamath is Business India's businessman of the year". 1 December 2005.
  23. "K V Kamath is Forbes Asia businessman of the year". Retrieved 9 November 2016.