Jump to content

కె.వి. రాఘవరావు

వికీపీడియా నుండి
కె.వి. రాఘవరావు
జననండిసెంబర్ 15, 1920
మరణం2000
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

కె.వి. రాఘవరావు (డిసెంబర్ 15, 1920 - 2000) ప్రముఖ రంగస్థల నటుడు. ఖమ్మం జిల్లాలో తొలిదశ నాటకకళా వికాసానికి కృషిచేశాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

రాఘవరావు 1920, డిసెంబర్ 15ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో జన్మించాడు. దుమ్ముగూడెం లో ప్రాథమిక విద్య, భద్రాచలం హైస్కూల్ విద్య, రాజమండ్రి లో ఇంటర్మీడియట్ విద్య, బందరు లో డిగ్రీ విద్యను పూర్తిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

సంపన్న కుటంబంలో జన్మించిన రాఘవరావుకు చిన్నతనంనుండే నాటకాలపై ఆసక్తి కలిగింది. 1914లోనే దుమ్మగూడెంలో నాటక ప్రదర్శనలు ప్రారంభమైనప్పటికీ 1942లో రాఘవరావు ప్రోద్బలంతో పూర్తిస్తాయి ప్రదర్శనలు జరిగాయి. సుజన వినోదిని సమాజాన్ని విడిచి 1944లో సోదర కళాసమితిని స్థాపించాడు. దేవన రామమూర్తి, లంకా గురుమూర్తి, హార్మోనిస్టు పార్థసారథి, నృత్య దర్శకుడు మల్లికార్జునరావు వంటివారు సహకరించేవారు. మరళీ మనోహర నాట్యమండలి ఆహ్వానంపై ఆ సమాజం ప్రదర్శించిన నాటకాలను దర్శకత్వం వహించాడు. 1958వరకు నాటకాలు ప్రదర్శించాడు.

నటించిన నాటకాలు:

  • ఖిల్ఝీ రాజ్య పతనం (రాఘవరావు)
  • పెట్టమారి మగడు
  • ఆంధ్రజ్యోతి
  • గుడ్డిలోకం
  • పల్లెపడచు

మరణం

[మార్చు]

చివరి దశలో అనేక కష్టాలుపడ్డ రాఘవరావు 2000వ సంవత్సరంలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.496.