Jump to content

కె.హెచ్. రంగనాథ్

వికీపీడియా నుండి

కె.హెచ్. రంగనాథ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు హిరియూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1981లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా, వీరేంద్ర పాటిల్, దేవరాజ్ ఉర్స్, ఎస్ఎం కృష్ణల మంత్రివర్గాలలో పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కె.హెచ్. రంగనాథ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972 మైసూర్ శాసనసభ ఎన్నికలలో హిరియూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1978, 1983 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కె.హెచ్. రంగనాథ్  డి దేవరాజ్ ఉర్స్, ఎస్. బంగారప్ప, ఎస్ఎం కృష్ణల మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశాడు.

కె.హెచ్. రంగనాథ్ 1984 భారత సార్వత్రిక ఎన్నికలలో చిత్రదుర్గ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

కె.హెచ్. రంగనాథ్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 86 ఏళ్ళ వయసులో 2011 అక్టోబర్ 18న మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Veteran Congress leader K H Ranganath passes away" (in Indian English). The Hindu. 18 October 2011. the original నుండి 11 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2025.
  2. "Senior Congress leader K H Ranganath passes away" (in ఇంగ్లీష్). The New Indian Express. 16 May 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2025.
  3. "Congress leader Ranganath dead". The Times of India. 19 October 2011. the original నుండి 11 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2025.
  4. "Congress leader K H Ranganath passes away". The Telegraph. 18 October 2011. the original నుండి 11 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2025.