కె. అమర్‌నాథ్ శెట్టి
స్వరూపం
కె. అమర్‌నాథ్ శెట్టి | |||
పదవీ కాలం 1994 – 1999 | |||
ముందు | కె సోమప్ప సువర్ణ | ||
---|---|---|---|
తరువాత | అభయచంద్ర జైన్ | ||
పదవీ కాలం 1983 – 1989 | |||
ముందు | దామోదర్ ముల్కీ | ||
తరువాత | కె సోమప్ప సువర్ణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1940 పాలడ్కా | ||
జాతీయత | ![]() | ||
తల్లిదండ్రులు | కాంతప్ప శెట్టి, రత్నవతి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కొడ్మాన్ అమర్‌నాథ్ శెట్టి (1939/1940 - జనవరి 27, 2020) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, కార్మిక & పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6]
రాజకీయ జీవితం
[మార్చు]కె. అమర్‌నాథ్ శెట్టి జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983, 1985 & 1994 ఎన్నికలలో మూడబిద్రి నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన రామకృష్ణ హెగ్డే, జెహెచ్ పటేల్, ఎస్. ఆర్. బొమ్మై మంత్రివర్గాలలో పర్యాటక, మతపరమైన ధార్మికత, యువజన వ్యవహారాలు, క్రీడలు, ఓడరేవులు & కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]కె. అమర్‌నాథ్ శెట్టి 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2020 జనవరి 27న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "JD(S) leader K Amarnath Shetty passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-01-27. Retrieved 2020-02-06.
- ↑ "Freedom fighter invited to presidential banquet". The Hindu. Chennai, India. 8 August 2005. Archived from the original on 14 December 2006. Retrieved 20 October 2010.
- ↑ "Mega job fair in Moodabidre from today". Deccan Herald. Retrieved 20 October 2010.
- ↑ "Statistical Report" (PDF). Election Commission of India. Retrieved 20 October 2010.
- ↑ "Statistical Report" (PDF). Election Commission of India. Retrieved 20 October 2010.
- ↑ "Statistical Report" (PDF). Election Commission of India. Retrieved 20 October 2010.
- ↑ "Former Karnataka minister and JD(S) leader K Amarnath Shetty passes away at 80". The Times of India. 27 January 2020. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "Ex-Minister Amarnath Shetty dead" (in Indian English). The Hindu. 27 January 2020. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "Former Karnataka minister K Amarnath Shetty passes away at 80" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2020. Retrieved 9 April 2025.