కె. ఎం. బినమోల్
2010లో కేరళ ముఖ్యమంత్రికి క్వీన్ బ్యాటన్ అందజేస్తున్న బీనమోల్ | |
| Personal information | |
|---|---|
| Full name | కలయతుంకుఝి మాథ్యూస్ బీనమోల్ |
| National team | భారత్ |
| Born | 1975 ఆగస్టు 15 కొంబిడింజల్, ఇడుక్కి జిల్లా, కేరళ, భారత్ |
| Years active | 1990–2004 |
| Employer | భారతీయ రైల్వేలు |
| Height | 163 cm (5 ft 4 in)[1] |
| Weight | 50 kg (110 lb)[1] |
| Spouse | డా. వివేక్ జార్జ్ |
| Sport | |
| Country | భారత్ |
| Sport | ట్రాక్ అండ్ ఫీల్డ్ |
| Event(s) | స్ప్రింట్ (400 మీ), మధ్యదూర పరుగులు (800 మీ), రిలే (4 × 400 మీ) |
| Coached by | రాజు పాల్ |
| Achievements and titles | |
| Personal best(s) | 400 మీ: 51.21 (Kyiv, 2000)[2] 800 మీ: 2:02.01 (New Delhi, 2002)[2] |
కలయతుంకుఝి మాథ్యూస్ బీనమోల్, సాధారణంగా K. M. బీనమోల్గా ప్రసిద్ధి చెందింది (15 ఆగస్టు 1975 జననం), కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లా, కొంబిడింజల్‌కు చెందిన భారతీయ అంతర్జాతీయ అథ్లెట్. జి.వి. రాజా స్పోర్ట్స్ స్కూల్ లో చదివారు.
వృత్తిపరమైన అథ్లెటిక్స్ జీవితం
[మార్చు]బీనమోల్ ఆమె సోదరుడు K. M. బిను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ సహోదర జంటగా గుర్తింపు పొందారు. పురుషుల 800 మీటర్ల పరుగులో బిను వెండి పతకం సాధించారు.
ఒలింపిక్స్
[మార్చు]2000 ఒలింపిక్స్ సమయంలో బీనమోల్ పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే ఆమె ఒలింపిక్ సెమీఫైనల్ చేరిన మూడవ భారతీయ మహిళగా నిలిచింది. ఈ ఘనతను గతంలో పీ.టి. ఉష షైనీ విల్సన్ 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో సాధించారు.
ఆసియా క్రీడలు
[మార్చు]2002 ఆసియా క్రీడలు బుసాన్‌లో నిర్వహించబడినవి. ఈ పోటీల్లో బీనమోల్ మహిళల 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, అలాగే 4 × 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం గెలుచుకుంది.[3]
అవార్డులు
[మార్చు]బీనమోల్‌కు 2000 సంవత్సరంలో అర్జున అవార్డు ప్రదానం చేశారు.[4] 2002–03 సంవత్సరానికి గాను ఖేల్ రత్న అవార్డును అంజలి భగవత్తో కలిసి సంయుక్తంగా పొందింది.[5] 2004లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]K. M. బీనమోల్ డా. వివేక్ జార్జ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అశ్విన్, హైలే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- కేరళ ఒలింపియన్‌ల జాబితా
మూలాలు
[మార్చు]- 1 2 "K. M. Beenamol". sports-reference.com. the original నుండి 18 మార్చి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 నవంబరు 2016.
- 1 2 "K. Mathews Beenamol IAAF Profile". IAAF. the original నుండి 20 నవంబరు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 నవంబరు 2016.
- ↑ "Kombodinjal basks in Beenamol, Binu's glory". Rediff. 16 అక్టోబరు 2002. the original నుండి 24 నవంబరు 2002 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 నవంబరు 2016.
- ↑ "Arjun Award - Sports". Indian Olympic Association. the original నుండి 22 సెప్టెంబరు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 జనవరి 2026.
- ↑ "Arjuna Awards, Rajiv Gandhi Khel Ratna, Dhyan Chand and Dronacharya awards given away". Press Information Bureau.
- ↑ "Padma Awards directory (1954-2014)" (PDF). p. 136.
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- July 2020 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- 1975 births
- Living people
- Malayali people
- Sportswomen from Kerala
- Indian women middle-distance runners
- Olympic athletes for India
- Recipients of the Arjuna Award
- Recipients of the Padma Shri in sports
- Recipients of the Khel Ratna Award
- People from Idukki district
- 21st-century Indian sportswomen