కె. ఎన్‌. వై. పతంజలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతంజలి
KNY Patanjali.jpg
జననంకాకర్లపూడి నరసింగ యోగ పతంజలి
(1952-03-29) 1952 మార్చి 29
అలమండ, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మరణం2009 మార్చి 11 (2009-03-11)(వయసు 56)
విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
వృత్తివిలేఖరి, సంపాదకుడు, రచయిత
జీవిత భాగస్వామిప్రమీల
పిల్లలుశాంతి, నీలిమ, షాలిని
తల్లిదండ్రులు
 • కె. వి. వి. గోపాల రాజు (తండ్రి)
 • సీతా దేవి (తల్లి)

కె.ఎన్‌.వై.పతంజలి (మార్చి 29, 1952 - మార్చి 11, 2009) గా ప్రసిద్ధులైన ప్రముఖ తెలుగు రచయిత పూర్తిపేరు: కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

వీరు విజయనగరం జిల్లా, అలమండ గ్రామంలో 1952, మార్చి 29 న జన్మించారు. వీరి తల్లిదండ్రులు: కె.వి.వి.గోపాలరాజు మరియు సీతాదేవి. ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలోనే తండ్రి వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నారు. చిన్న వయసులోనే తెలుగులో రచనలు చేయడం ప్రారంభించారు.

వివాహం - పిల్లలు[మార్చు]

నవంబరు 12, 1975 లో ప్రమీలతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు (శాంతి, నీలిమ, షాలిని)

జర్నలిస్టుగా[మార్చు]

అనంతరం జర్నలిస్టుగా మార్చి 1975 నుంచి 84 వరకు ఈనాడు, 1984 నుంచి 1990 వరకు ఉదయంలో పనిచేశారు. అటు తర్వాత ఆంధ్రభూమి, మహానగర్‌లలో కూడా పనిచేశారు. 'పతంజలి పత్రిక' పేరిట పత్రికను నెలకొల్పి 16 నెలల పాటు నడిపారు. 2003లో ఆంధ్రప్రభలో అవకాశం రావడంతో అందులో చేరారు. కొద్ది నెలలు టీవీ 9లో విధులు నిర్వర్తించారు. 'సాక్షి' పత్రిక ఆవిర్భావం నుంచి ఎడిటర్‌గా వ్యవహించారు.

రచనలు[మార్చు]

 • నవలికలు: ఖాకీవనం, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు, ఓ దెయ్యం ఆత్మకథ.
 • నవలలు: పెంపుడు జంతువులు, రాజుల లోగిళ్లు (అసంపూర్తి).
 • కథా సంకలనాలు: దిక్కుమాలిన కాలేజి, చూపున్న పాట.
 • ఇతరములు: గెలుపు సరే బతకడమెలా, జ్ఞాపక కథలు, శబాసో మొపాసా, వేట కథలు, పతంజలి భాష్యం, పతంజలి రచనలు (రచనల సంపుటి)
 • పతంజలి సాహిత్యాన్ని రెండు సంపుటాలుగా మనసు ఫౌండేషన్ వారు ముద్రించారు.
 • పతంజలి తలపులు : పతంజలి గారి గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాల సంకలనం.

పురస్కారాలు[మార్చు]

పతంజలికి ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. వీటిలో ప్రధానమైనవి:

 • రావిశాస్త్రి రచనా పురస్కారం
 • చాసో స్ఫూర్తి పురస్కారం
 • కృష్ణవంశీ 'సింధూరం' సినిమాకు ఆయనకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు దక్కింది.

పతంజలి నాటకోత్సవాలు[మార్చు]

పతంజలి నాటకోత్సవాలు థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగాయి. సాహిత్యానికీ, రంగస్థలానికీ మధ్య వంతెన కట్టే కృషిలో నిమగ్నమయి వున్న పెద్ది రామారావు నిర్దేశకత్వంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చంద్రశేఖర్ ఇండ్ల, నరేశ్ బూర్ల, శివ ఈ ప్రయోగానికి నాంది పలికారు.

మరణం[మార్చు]

గత కొంతకాలంగా కాలేయ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2009, మార్చి 11 న కన్నుమూశారు.

పతంజలి పుస్తకాల చిత్రమాలిక[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]