కె. ఎల్. నరసింహారావు (కళాకారులు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎల్. నరసింహారావు
K.L. NArshimharao.JPG
జననంకె.ఎల్. నరసింహారావు
అక్టోబర్ 23, 1924
రేపాల గ్రామం, నల్గొండ జిల్లా
మరణం2003
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధితెలుగు నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు
రాష్ట్రస్థాయి నాటక పోటీల విజేతగా
మతంహిందువు

కె.ఎల్. నరసింహారావు (అక్టోబర్ 23, 1924 - 2003) తెలుగు నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు. ఆయన రాసిన పలు నాటకాలు ప్రదర్శనలు పొంది ప్రజాదరణతో పాటుగా పోటీలలో బహుమతులు కూడా సాధించాయి.

జననం[మార్చు]

నరసింహారావు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకా, రేపాల గ్రామంలో 1924 అక్టోబర్ 23 న జన్మించాడు.

తెలుగు నాటకరంగ కృషి[మార్చు]

రేపాల గ్రామంలో ‘గ్రామ వెలుగు నాట్యమండలి’ అనే సంస్థను నెలకొల్పి, కొంతమంది నాటక మిత్రులను సమీకరించి, 1946 లో నాటక ప్రదర్శరనలను ప్రారంభించాడు. అంతేకాకుండా చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చేవాడు. వీరి రచనలు చాలా వరకు గ్రామీణ నేపథ్యంలో సాగినవే.

ఈయన సుమారు 25 నాటికలు, నాటకాలు రాశాడు. వాటిల్లో ఆదర్శ లోకాలు (1948), గెలుపునీదే (1952), గుడిగంటలు, అడుగు జాడలు (1956), కొత్తగుడి (1957), క్రీనీడలు (1957) మొదలైన నాటకాలు జనాదరణ పొందాయి.

ఉద్యోగం[మార్చు]

ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చి, పత్రిక ఉపసంపాదకుడిగా పనిచేశాడు. తర్వాత ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగంలో పనిచేశాడు.

రచన రంగం[మార్చు]

ఆయన నాటకరచనకు పూనుకుని రాసిన తొలి రచన గెలుపు నీదే. ఆ నాటకం ఎలావుందోనన్న ఆలోచనతో వేరెవరికీ చూపించకుండా కొంతకాలం తనవద్దే దాచిపెట్టుకున్నారు. అనుకోకుండా తెలంగాణా విముక్తి పోరాటయోధులు, గ్రంథాలయోద్యమ ప్రముఖులు అయిన కోదాటి నారాయణరావు ఈ నాటకం గురించి తెలుసుకోవడంతో, వినిపించుకుని చదివి ప్రదర్శించమని ప్రోత్సహించారు. ఆ తర్వాతికాలంలో పలు నాటకాలు రచించారు. వాటిలోని అడుగుజాడలు నాటకం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది.[1]

పురస్కారాలు[మార్చు]

  • రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన దేశాభివృద్ధికి సహకరించే నాటకాల పోటీలో అడుగుజాడలు ప్రథమ బహుమతి పొందింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నరసింహారావు, కె.ఎల్. (9 నవంబరు 1956). అడుగుజాడలు (నమస్కారం వ్యాసం). Retrieved 5 March 2015. Check date values in: |date= (help)
  • కె. ఎల్. నరసింహారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 359.