కె. జనార్ధన్ రెడ్డి
కె. జనార్ధన్ రెడ్డి | |
---|---|
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యుడు | |
In office 1952–1957 | |
తరువాత వారు | పులి రామస్వామి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | షాయిన్‌పల్లి, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ | 1918 ఏప్రిల్ 25
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | సరళాదేవి |
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
తల్లిదండ్రులు | రామారెడ్డి |
కె. జనార్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[1] భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1952 నుండి 1957 వరకు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2]
జననం, విద్య
[మార్చు]జనార్థన్ రెడ్డి 1918, ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, షాయిన్‌పల్లిలో జన్మించాడు. తండ్రిపేరు రామారెడ్డి.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]జనార్థన్ రెడ్డికి 1940 జనవరి 1న సరళాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
రాజకీయ జీవితం
[మార్చు]1952లో భారత పార్లమెంట్ కు జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు.[4]
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- నాగర్ కర్నూల్ తాలూకా పిల్లల సంక్షేమ కేంద్రం సభ్యుడు
- జుబుల్‌పూర్ విభాగం 'వందేమాతరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె అధ్యక్షుడు (1938)
- చీఫ్ వాలంటీర్, మల్కా పోరే ఆంధ్ర మహాసభ (1939)
- నాగర్ కర్నూల్ తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
- మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
- రెడ్డి హాస్పిటల్ స్పోర్ట్స్ సెక్రటరీ (1937)
- స్కౌట్ మాస్టర్, రెడ్డి ట్రూప్, (1936-38)
- మహబూబ్ నగర్ జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుడు
- మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల అభివృద్ధి కమిటీ సభ్యుడు
- మహబూబ్ నగర్ జిల్లా సరఫరా కమిటీ సభ్యుడు
- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1949)
- నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లైజన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు
ఇతర వివరాలు
[మార్చు]వయోజన విద్యా కేంద్రాలు, గ్రంథాలయాలను స్థాపించాడు. 1947లో రజాకార్లకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్వహించాడు. 1953లో బెంగుళూరులో జరిగిన ఫార్ ఈస్ట్, ఆసియా దేశాలకు సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్‌కు భారతీయ ప్రతినిధి బృందం సభ్యుడిగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "First Loksaba Members (Hyderabad)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-14.
- ↑ "PARLTAMENT OF INDIA-HOUSE OF THE PEOPLE-WHO'S WHO (1952)" (PDF). www.eparlib.nic.in. p. 285. Archived (PDF) from the original on 2021-10-26. Retrieved 2021-12-14.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2020-10-26 suggested (help) - ↑ "K. JANARDHAN REDDY". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-14.
- ↑ "Shri K. Janardhan Reddy MP biodata Mahabubnagar | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2020-06-20. Retrieved 2021-12-14.