Jump to content

కె. పిచ్చండి

వికీపీడియా నుండి
కె. పిచ్చండి

తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
2021 మే 12  2026 మే 5
ముందు పొల్లాచి వి. జయరామన్
తరువాత ఎం. రవిశంకర్

గృహ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
1996 మే 13  2001 మే 13

పదవీ కాలం
2016 మే 19  2026 మే 4
ముందు ఏకే అరంగనాథన్
తరువాత ఎస్. రామచంద్రన్
నియోజకవర్గం కిల్పెన్నత్తూరు
పదవీ కాలం
1996 మే 10  2011 మే 14
ముందు వి. కన్నన్
తరువాత ఈ.వీ. వేలు
నియోజకవర్గం తిరువణ్ణామలై
పదవీ కాలం
1989 ఫిబ్రవరి 6  1991 జనవరి 30
ముందు ఎ.ఎస్. రవీంద్రన్
తరువాత వి. కన్నన్
నియోజకవర్గం తిరువణ్ణామలై

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (1989 - ప్రస్తుతం)
వృత్తి రాజకీయ నాయకుడు

కె. పిచ్చండి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు కిల్పెన్నత్తూరు, తిరువణ్ణామలై నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 నుండి 2026 వరకు తమిళనాడు శాసనసభకు 14వ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కె. పిచ్చండి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989, 1996, 2001, 2006లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరువణ్ణామలై నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి వి. కన్నన్ చేతిలో ఓడిపోయాడు.[4] ఆయన 1996 నుండి 2001 వరకు తమిళనాడు ప్రభుత్వంలో గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిగా  పనిచేశాడు.[5]

కె. పిచ్చండి 2011లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కిల్పెన్నత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏఐఏడీఎంకే అభ్యర్థి ఏకే అరంగనాథన్ చేతిలో4,081 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2016, 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మే 2016లో డిప్యూటీ విప్‌‌గా, 2016లో తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యాడు.[6]

కె. పిచ్చండి 2021లో తమిళనాడు శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా పని చేశాడు. ఆయన 2026లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కిల్పెన్నత్తూరు నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్. రామచంద్రన్ చేతిలో 30,465 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results 2016" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. "Statistical Report on General Election 1991 for the Legislative Assembly of Tamil Nadu" (PDF). Election Commission of India. p. 268. Retrieved 2017-05-17.
  5. "Pichandi gets recognition" (in Indian English). The Hindu. 25 May 2016. Archived from the original on 19 June 2026. Retrieved 19 June 2026.
  6. "Appavu, Pitchandi, elected Speaker and Dy Speaker unanimously for TN Assembly" (in ఇంగ్లీష్). The New Indian Express. 13 May 2021. Archived from the original on 19 June 2026. Retrieved 19 June 2026.
  7. "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Kilpennathur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 19 June 2026. Retrieved 19 June 2026.