కె. మాధవన్
కె. మాధవన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | బొంబాయి, భారతదేశం | 1915 ఆగస్టు 26
మరణం | 2016 సెప్టెంబరు 25 | (వయసు 101)
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు |
కె. మాధవన్ ( 1915 ఆగస్టు 26 - 2016 సెప్టెంబరు 25) కేరళ రాష్ట్రానికి చెందిన చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]మాధవన్ 1915, ఆగస్టు 25న ఎసి రామన్ నాయర్ - కొంజుంగల్ ఉన్నంగా అమ్మ దంపతులకు కేరళలో జన్మించాడు.[1] పాఠశాలలో చదువుతున్నప్పుడు కె. కెలప్పన్ నాయకత్వంలో వాలంటీర్లలో అతి పిన్న వయస్కుడిగా ఉప్పు సత్యాగ్రహంలో చేరాడు. 1930, ఆగస్టు 20న అరెస్ట్ చేయబడి ఆరు నెలలపాటు కఠిన కారాగారం శిక్షను అనుభవించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]1921లో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడానికి ట్రావెన్‌కూర్, కొచ్చి, కాంగ్రెస్ మలబార్ ప్రాంతం కలిసినప్పుడు మాధవన్ కార్యదర్శిగా ఉన్నాడు. తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది రాడికల్ సోషలిస్ట్ గ్రూపు సభ్యులతో పాటు, మాధవన్ కూడా తన మాతృ సంస్థను విడిచిపెట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు.
మరణం
[మార్చు]మాధవన్ తన 101 సంవత్సరాల వయస్సులో 2016, ఆగస్టు 25న మరణించాడు.
ఇతర వివరాలు
[మార్చు]మాధవన్ జీవిత చరిత్రను 'పాయస్వినియు తీరంగళ్' (పాయస్విని నది ఒడ్డున) డాక్యుమెంటరీ తీయబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Noted freedom fighter K Madhavan passes away". Mathrubhumi (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-14.
- ↑ "A satyagrahi remembers". The Hindu (in Indian English). 29 January 2006. ISSN 0971-751X. Retrieved 2021-10-14.