కె. వి. కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోటికాలపూడి వెంకట కృష్ణారావు
జననంజూలై 16, 1923
విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ భారత దేశం
మరణం2016 జనవరి 30(2016-01-30) (వయసు 92)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజభక్తి British India
 India
సేవలు/శాఖ British Indian Army
 Indian Army
సేవా కాలం1942–1983
ర్యాంకు జనరల్
పనిచేసే దళాలుజనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC-in-C), వెస్టర్న్ కమాండ్, ఇండియా
పోరాటాలు / యుద్ధాలు
 • 1971 - ఇండియా పాకిస్తాన్ యుద్ధం
పురస్కారాలు
 • పరమ విశిష్ట సేవా మెడల్
  డాక్టర్ ఆఫ్ లెటర్స్
ఇతర సేవలు
 • జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ , త్రిపుర గరర్నర్.

కోటికాలపూడి వెంకట కృష్ణారావు, (కె.వి.కృష్ణారావుగా సుపరిచితులు) (జూలై 16, 1923 - జనవరి 30, 2016), భారత సైనిక దళాల మాజీ ఛీప్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు. ఆయన జమ్మూ కాశ్మీరు గవర్నరుగా మొదటిసారి 1989 జూలై 11 నుండి 1990 జనవరి 19, రెండవసారి 1993 మార్చి 13 నుండి 1998 మే 2 వరకు పనిచేసారు.

నాలుగు దశాబ్దాలపాటు సేవలు.. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కేవీ స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్‌లలో పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ఆర్మీ ఛీఫ్ గా 1983 లో పదవీవిరమణ చేసారు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

జనరల్‌ కె.వి. కృష్ణారావుగా ఖ్యాతినందిన ఆయన పూర్తి పేరు కొటికలపూడి వెంకట కృష్ణారావు జూలై 16 1923న విజయవాడలో కె.ఎస్‌. నారాయణరావు, కె. లక్ష్మీరావు దంపతులకు జన్మించారు. ఆయన కె.రాధారావును వివాహమాడారు. ఆయనకు ఒక కుమారుడు నారాయణ్, ఒక కుమార్తె లలిత ఉన్నారు. ఆయన ఆగష్టు 9 1042 న ఇండియన్ ఆర్మీలో చేరారు. యువ అధికారిగా ఉన్నపుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నార్త్‌ వెస్ట్‌ ఫ్రాంటియర్‌, బెలూచిస్తాన్‌లలో ఆయన పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు.[3]

1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకులలో కృష్ణారావు ఒకరు. 1949-51 మధ్య ఆయన డిఫెన్స్ అకాడమీలో పనిచేశారు. 1965-66లో లడఖ్‌లో ఒక దళానికి, 1969-70లో జమ్మూ ప్రాంతంలో ఇన్‌ఫాంట్రీ విభాగానికి కమాండర్‌గా వ్యవహరించారు. 1970-72 మధ్య నాగాలాండ్, మణిపూర్‌లలో తిరుగుబాట్ల అణచివేత దళాలకు నేతృత్వం వహించారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, ఈశాన్య బంగ్లాదేశ్ ప్రాంతాలకు విముక్తి కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ యుద్ధంలో కృష్ణారావు చూపిన ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, నాయకత్వ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించింది.

గవర్నర్ గా

[మార్చు]

కృష్ణారావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పనిచేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 1989-90 మధ్య, 1993-1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు. ఉగ్రవాదం, తిరుగుబాట్లతో అట్టుడికిన కశ్మీర్‌లో తిరిగి శాంతి నెలకొనేందుకు కృషి చేశారు.

బలగాల ఆధునీకరణలో

[మార్చు]

భారత సైన్య ఆధునీకరణలో కేవీధి ప్రధాన పాత్ర. 1975లో ప్రభుత్వం కేవీ అధ్యక్షతనే సైన్యం పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. దీని సిఫార్సులను కేంద్రం అమలు చేసింది కూడా. 1978-79 మధ్య ఆర్మీ ప్రధాన కార్యాలయం సిబ్బందికి డిప్యూటీ చీఫ్‌గా, 1979-81 మధ్య పశ్చిమ కమాండ్‌కు అధిపతిగా పనిచేశారు. 1981 జూన్ 1న 14వ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 1983 జూలై దాకా ఆ పదవిలో ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయన జనవరి 30 2016 న న్యూఢిల్లీలో మరణించారు.[4]

ప్రచురణలు

[మార్చు]

పదవీ విరమణ అనంతరం నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. తన అనుభవాలను క్రోడీకరించి ఆయన మూడు గ్రంథాలను వెలువరించారు.[5]

 • 1991 – ప్రిపేర్ ఆర్ పెరిష్ - జాతీయ భద్రత గూర్చి అధ్యయనం - (లాన్‌సర్ పబ్లిషర్స్, న్యూఢిల్లీ)
 • 2001 – ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్
 • 2011- ఇన్విజిబిలిటీ, ఛాలంజెస్ అండ్ లీడర్ షిప్

మూలాలు

[మార్చు]
 1. http://indianarmy.nic.in/Site/FormTemplete/frmTemp1PTC2C.aspx?MnId=Az+07MRdz8k=&ParentID=oYjJbpqKulY=
 2. "His Excellency". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-31.
 3. మాజీ దళపతి కేవీ కన్నుమూత
 4. "Former Indian Army chief Gen KV Krishna Rao dies". bdnews24.com. IANS. January 30, 2016. Retrieved January 30, 2016.
 5. మాజీ గవర్నర్‌, మాజీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ జనరల్‌ కె.వి. కృష్ణారావు కన్నుమూత...

ఇతర లింకులు

[మార్చు]