కె. శివనగౌడ నాయక్
కె. శివనగౌడ నాయక్ | |||
కర్ణాటక రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 జూలై 28 - 2023 | |||
కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి రాజకీయ కార్యదర్శి
| |||
పదవీ కాలం 2012 ఆగస్టు 18 – 2013 మే 8 | |||
సామూహిక విద్య, ప్రజా గ్రంథాలయ, చిన్న పొదుపు & లాటరీ శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 2008 జూలై 10 – 2010 సెప్టెంబర్ 22 | |||
పదవీ కాలం 2018 – 2023 | |||
ముందు | ఎ. వెంకటేష్ నాయక్ | ||
---|---|---|---|
తరువాత | కరెమ్మ నాయక్ | ||
నియోజకవర్గం | దేవదుర్గ | ||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | అల్కోడ్ హనుమతప్ప | ||
తరువాత | ఎ. వెంకటేష్ నాయక్ | ||
నియోజకవర్గం | దేవదుర్గ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కె. శివనగౌడ నాయక్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 జూలై 10 నుండి 2010 సెప్టెంబర్ 22 వరకు సామూహిక విద్య, ప్రజా గ్రంథాలయ, చిన్న పొదుపు & లాటరీ శాఖల మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కె. శివనగౌడ నాయక్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎ. వెంకటేష్ నాయక్‌పై 4587 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 జూలై 10 నుండి 2010 సెప్టెంబర్ 22 వరకు సామూహిక విద్య, ప్రజా గ్రంథాలయ, చిన్న పొదుపు & లాటరీ శాఖల మంత్రిగా పని చేశాడు.[1] ఆయన ఆ తరువాత జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి & ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2009లో జరిగిన అప్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కె. శివనగౌడ నాయక్ 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎ. వెంకటేష్ నాయక్ చేతిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బి.వి. నాయక్ చేతిలో 1,499 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2]
కె. శివనగౌడ నాయక్ 2016లో దేవదుర్గ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎ రాజశేఖర్ నాయక్‌పై 21,045 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
కె. శివనగౌడ నాయక్ 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కరెమ్మ నాయక్ చేతిలో 34,256 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Ashoka made Karnataka Home Minister" (in ఇంగ్లీష్). The New Indian Express. 16 May 2012. Retrieved 21 April 2025.
- ↑ "Raichur Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Zee News. 25 April 2019. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
- ↑ "Devadurga by-poll: It's a cakewalk for BJP's Shivanagouda Naik | Devadurga by-poll: It's a cakewalk for BJP's Shivanagouda Naik" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 17 February 2016. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Devadurga". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.