కె. శ్రీనివాస గౌడ
| కె. శ్రీనివాస గౌడ | |||
| పదవీ కాలం 2018 – 2023 | |||
| ముందు | ఆర్. వర్తూర్ ప్రకాష్ | ||
|---|---|---|---|
| తరువాత | కోతుర్.జి. మంజునాథ | ||
| నియోజకవర్గం | కోలార్ | ||
| పదవీ కాలం 1994 – 2008 | |||
| ముందు | కె.ఎ. నిసార్ అహ్మద్ | ||
| తరువాత | ఆర్. వర్తూర్ ప్రకాష్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కె. శ్రీనివాస గౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కోలార్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]కె. శ్రీనివాస గౌడ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోలార్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె.ఎ. నిసార్ అహ్మద్‌పై 12,822 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 శాసనసభ ఎన్నికలలో జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె.ఎ. నిసార్ అహ్మద్‌పై 21,013 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కె. శ్రీనివాస గౌడ ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోలార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.ఎస్. ఆనంద్‌పై 23,751 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్. వర్తూర్ ప్రకాష్ చేతిలో 21,029 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
కె. శ్రీనివాస గౌడ ఆ తరువాత జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోలార్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్. వర్తూర్ ప్రకాష్ చేతిలో 12,591 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సయ్యద్ జమీర్ పాషాపై 44,251 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "I voted for Cong 'cause I love the party: K Srinivas Gowda". The Times of India. 11 June 2022. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.
- ↑ "I voted Congress, because I love it, says JD(S) MLA on Rajya Sabha polls" (in ఇంగ్లీష్). The Indian Express. 10 June 2022. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.
- ↑ "Yet to repay Rs 17 cr loan borrowed for last polls: Kolar MLA" (in ఇంగ్లీష్). Deccan Herald. 11 January 2023. Archived from the original on 14 May 2025. Retrieved 14 May 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.