కె క్షిపణి కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె క్షిపణి కుటుంబం
రకంSLBM
అభివృద్ధి చేసిన దేశంభారత దేశము
సర్వీసు చరిత్ర
సర్వీసులోఉత్పత్తిలో ఉంది (కె-15)[1]
2017 (k-4)[2]
వాడేవారుIndian Navy
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుDefence Research and Development Organisation (DRDO) &
Bharat Dynamics Limited (BDL)
తయారీ తేదీకె-15 ఉత్పత్తిలో ఉంది
విశిష్టతలు
బరువు6[3]-7[4] టన్నులు (K-15)
17 టన్నులు (K-4)[5]
2 టన్నులు (Air-launched)
పొడవు10 మీ (K-15, K-4 ప్రస్తుత)
12 మీ (K-4 భవిష్యత్తులో)
వెడల్పు0.74 మీ (K-15)
1.3 మీ (K-4)

Maximum range5,000 కిమీ (K-5 SLBM)[2]
వార్‌హెడ్K-15:1 టన్ను,
K-4:1-2.5 టన్నులు,[5]
K-5:2.5 టన్ను
500 కెజి(Air-Launched Version)
Blast yieldK-4: 200-250 కిలోటన్నులు[5]

ఆపరేషను
పరిధి
3,500 కిమీ
గరిష్ఠ లోతు50 మీ పైబడి (పరీక్షించబడింది)
వేగంమ్యాక్ 7.5 (శౌర్య క్షిపణి, భూమిపై నుండి ప్రయోగించే కూర్పు[6] of sagarika K-15 missile)[1]
లాంచి
ప్లాట్‌ఫారం
అరిహంత్ తరగతి జలాంతర్గామి

కె క్షిపణి కుటుంబం జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల (SLBM) శ్రేణి. భారత్‌ యొక్క అణు ఎదురు దాడి (second strike) సామర్థ్యాన్ని, తద్వారా అణుదాడిని నిరోధించగల సామర్థ్యాన్నీ ఇనుమడింపజేసేదే ఈ శ్రేణి. ఈ క్షిపణుల గురించిన  సమాచారం రహస్యంగా ఉంచబడింది. కె-క్షిపణి కుటుంబాన్ని బ్లాక్ ప్రాజెక్ట్గా కూడా వర్ణిస్తారు. భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన  ఈ క్షిపణులు మరింత వేగంగా, మరింత తేలికగా, మరింత మరుగుగా (stealth) ఉంటాయని భోగట్టా.[2][3]

ఈ శ్రేణి లోని క్షిపణులు[మార్చు]

రకం పరిధి బరువు వార్‌హెడ్ పొడవు Status
కె-15 SLBM[2] 750  కిమీ-1,500  కిమీ 6[3]-7  టన్నులు[4] 1 టన్ను 10 మీ కె-15/B-05 ఉత్పత్తిలో ఉన్నాయి. భూస్థిత మోహరింపు అనుమతి కోసం చూస్తోంది. పరీక్షలు పూర్తయ్యాయి.[3][7]
కె-4 మార్క్ I (అగ్ని-3 మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి) [2].[5] 3,500  కిమీ 20  టన్నులు[5] 2.5  టన్నులు[5] 10 మీ 2014 మార్చి 24 న 30 మీటర్ల లోతున పరీక్షించారు. మోహరించే ముందు మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉంది.[8][9][10]
కె-4 మార్క్ II (అగ్ని-5 ఖండాంతర క్షిపణి) 5,000-8,000  కిమీ[2] 17 టన్నులు 1 టన్ను[2] 12 మీ అభివృద్ధిలో ఉంది
ఎయిర్ లాంచ్‌డ్[2] 200  కిమీ 2  టన్నులు 500 కిలో 4మీ హైపర్‌సోనిక్ క్షిపణి ప్రాజెక్టు, ‘ఎయిర్ లాంచ్‌డ్ వెహికిల్’ అని పిలుస్తారు. సుఖోయ్ Su-30-MKI లలో అమర్చేందుకు తయారు చేస్తున్నారు.
కె-5 SLBM (అగ్ని-6 ఖండాంతర క్షిపణి) 6,000-10,000  కిమీ[11] వివరాలు లేవు 1 టన్ను వివరాలు లేవు DRDO అభివృద్ధి చేస్తోంది[12][13]

కె-15 లేదా సాగరిక కె-15 క్షిపణీ[మార్చు]

సాగరిక/కె-15 క్షిపణి, భూస్థిత శౌర్య క్షిపణి యొక్క జలాంతర్గామి రూపం.[1][6] ఇది కె-4 క్షిపణుల కంటే తక్కువ పరిధి కలిగి ఉంటాయి. అరిహంత్ శ్రేణి జలాంతర్గాములలో వీటిని అమరుస్తారు.

సాగరికను హైదరాబాదు DRDO లోని క్షిపణి ప్రాంగణంలో అభివృద్ధి చేసారు. ఈ ప్రాంగణంలో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ (DRDL), అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీస్ (ASL), రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) వంటి సంస్థలున్నాయి. క్షిపణి రూపకల్పన, అభివృద్ధి DRDL చేయగా, దీనికి అవసరమైన మోటార్లు, ప్రొపల్షన్ వ్యవస్థలను ASL అందించింది. ఏవియానిక్స్, కంట్రోల్ అండ్ గైడెన్స్ వ్యవస్థలను, ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థలనూ RCI తయారు చేసింది.[4]

కె-15 బాలిస్టిక్ క్షిపణి పరిధి, వివిధ పేలోడ్లతో 700  కిమీ[14] నుండి 1,500 కిమీ[15][16] వరకు ఉంది. కచ్చితమైన మార్గనిర్దేశనం కోసం ఈ క్షిపణి నావిక్ ను వినియోగిస్తుంది.[17]  సరిగ్గా అనుకున్న స్థలంలో దాడి చేసేందుకు అవసరమైన కచ్చితత్వం ఈ విధంగా లభిస్తుంది. 2013 జనవరి 28 న విశాఖపట్నం తీరం వద్ద సముద్రంలోపల దీని చిట్టచివరి పరీక్ష జరిగింది.[18][19]

కె-4 క్షిపణి[మార్చు]

మాజీ రాష్ట్రపతి, అబ్దుల్ కలాం పేరు పెట్టిన కె-4, కె శ్రేణి ప్రాజెక్టులో తరువాతి ప్రముఖ క్షిపణి. 2010 జనవరిలో విశాఖపట్నం తీరం లోపల ఈ క్షిపణిని రహస్యంగా పరీక్షించారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించిన విషయాలు పూర్తి రహస్యం. దీన్ని బ్లాక్ ప్రాజెక్టుగా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు ఉనికి గురించి DRDO ఏనాడూ ధ్రువీకరించలేదు, తిరస్కరించనూ లేదు. కె-4, అగ్ని-5 యొక్క జలాంతర్గామి రూపమని కొన్ని వార్తలుండగా, అది అగ్ని-3 యొక్క జలాంతర్గామి రూపమని మరికొన్ని వార్తలున్నాయి. ఈ ప్రాజెక్టు లక్ష్యం భారత్ యొక్క అణు ఎదురు దాడి అవకాశాలను పెంచడమేనని DRDO శాస్త్రవేత్తలు చెప్పారు. మొత్తం 258 ప్రైవేటు సంస్థలు, 20 DRDO లాబరేటరీలు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నాయి.[20] ఈ క్షిపణిలో రెండు రకాలున్నాయని వార్తలు - 10 మీటర్ల పొడవుతో, 3,500 కిమీ పరిధి కలిగినది, 12 మీటర్ల పొడవుతో 5,000 కిమీ పరిధి కలిగినదీను. వీటిని అరిహంత్ శ్రేణి అణు జలాంతర్గాములలో మోహరిస్తారు.[2] కె-4 తో భారత్, చైనా పాకిస్తాన్ రెండింటికీ ఏక కాలంలో గురి పెట్టగలదు. అరిహంత్ జలాంతర్గామి నాలుగు (10 మీ పొడవైన) కె-4లను లేదా 12 కె-15 లనూ మోహరించగలదు. కె-4 క్షిపణి అంతిమ రూపాన్ని 2014 మార్చి 24 న 30 మీటర్ల లోతున పరీక్షించారు. దీన్ని త్వరలో అరిహంత్‌లో మోహరిస్తారు.[21]

కె-5 క్షిపణి[మార్చు]

కె-5 క్షిపణిని అరిహంత్ శ్రేణి జలాంతర్గాముల కోసం తయారు చేస్తున్నారు.[13][22] ఇది ఘన ఇంధనంతో, 6000 కిమీ పరిధితో [11] ఒక టన్ను పేలోడు సామర్థ్యంతో ఉంటుందని భావిస్తున్నారు.[12] అయితే ఈ ప్రాజెక్టు వివరాలు అత్యంత రహస్యం.

విశిష్టత[మార్చు]

కె శ్రేణి క్షిపణులు భారత అణు దాడి నిరోధక శక్తికి (న్యూక్లియర్ డిటరెన్స్) ఎంతో ప్రధానమైనవి. అవి అత్యంత ముఖ్యమైన అణు ఎదురు దాడి సామర్థ్యాన్ని పెంపొందించి, ఆసియాలో బలాల సంతులనాన్ని  భారత్ వైపు  మొగ్గేలా చేస్తాయి.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "India To Begin Production of Nuke Missile". Defencenews. 2011-09-27.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 "The Secret 'K' missile family". Indiatoday. 2010-11-20.
 3. 3.0 3.1 3.2 3.3 News / National : India successfully test-fires underwater missile. The Hindu. URL accessed on 2013-01-28.
 4. 4.0 4.1 4.2 "Sagarika missile test-fired successfully". The Hindu. 2008-02-27.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "India to test a submarine-launched ballistic missile". RUSNAVY. 29 December 2010. Retrieved 8 March 2012.
 6. 6.0 6.1 T.S. Subramanian (November 2008). "Shourya test-fired successfully". Cite journal requires |journal= (help)
 7. India test fires missile from under sea, completes nuclear triad. NDTV.com. URL accessed on 2013-01-28.
 8. "Success on debut for undersea launch of missile". The Hindu. 8 May 2014. Retrieved 8 May 2014.
 9. "India tests new underwater nuclear missile". The Times of India. 26 March 2014. Retrieved 26 March 2014.
 10. "India tests 3,000 km range n-missile in secret". The Sunday Guardian. 10 May 2014. Retrieved 11 May 2014.
 11. 11.0 11.1 India's nuclear policy 2008, p. 81-82.
 12. 12.0 12.1 "DRDO Lab Develops Detonator for Nuclear Capable Agni-V Missile As It Gets Ready For Launch". Defence-News. January 17, 2012. Archived from the original on 2012-01-22. Retrieved 2016-07-22.
 13. 13.0 13.1 Firstpost (2013-01-28). India test fires first ever ballistic missile from underwater. Firstpost. URL accessed on 2013-05-02.
 14. Front Page : Sagarika missile test-fired successfully. The Hindu: (2008-02-27). URL accessed on 2013-01-30.
 15. FP Staff (2011-02-23). 5 things you need to know about K-15, India’s underwater ballistic missile. Firstpost. URL accessed on 2013-01-30.
 16. PTI Jan 27, 2013, 06.20PM IST. India test-fires ballistic missile from underwater platform - Times Of India. Articles.timesofindia.indiatimes.com. URL accessed on 2013-01-30.
 17. Shourya Missile.
 18. Business Standard. India test fires ballistic missile from underwater platform. Business Standard. URL accessed on 2013-01-28.
 19. Last Updated: 28 Jan 06:16 AM IST (2010-01-15). India test fires ballistic missile from underwater platform. Thestatesman.net. URL accessed on 2013-01-28.
 20. "DRDO working on 5,500 Km Agni". (FINN) Frontier India News Network. Archived from the original on 2011-07-25. Retrieved 2016-07-22.
 21. "India to achieve N-arm triad in February". India-Today. Jan 2, 2012.
 22. "Agni-VI with 10000 km range to be ready by 2014". IBNLive. Retrieved 17 July 2012.

ఇవి కూడా చదవవచ్చు[మార్చు]

 • కోహెన్, భరత్ కర్నాడ్ ; స్టీఫెన్ పి ముందుమాటతో (2008). భారత అణు విధానం. Westport, Conn.: Praeger Security International. ISBN 0275999467.