కేఆర్‌ ఆమోస్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేఆర్‌ ఆమోస్‌ తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమోస్ 1956 నుండే తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశాడు. ఉద్యమకాలంలో తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘాన్ని (టీఎన్జీవో) స్థాపించి ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించాడు. ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశాడు.

జననం[మార్చు]

నల్గొండ జిల్లాకు చెందిన ఆమోస్ సికింద్రాబాదులోని పద్మరావునగర్‌ లో 1940లో జన్మించాడు.[1][2]

1969 తెలంగాణ ఉద్యమం[మార్చు]

ఆమోస్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖలో ఉద్యోగిగా ఉన్నాడు. 1956 నుండే తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశాడు. దీనికోసం అప్పట్లోనే ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘాన్ని స్థాపించాడు. 1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనను అప్పటి ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఉద్యమ కారణంగా దేశంలోనే ఉద్యోగం కోల్పోయిన మొదటి వ్యక్తి ఆమోస్. ముల్కీ నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై ఆయన పోరాటం చేశాడు. ఆమోస్‌ 1965-72 వరకు టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (11 October 2019). "ఆమోస్‌ కన్నుమూత". ntnews.com. మూలం నుండి 11 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 October 2019.
  2. సాక్షి, తెలంగాణ (11 October 2019). "మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్‌.ఆమోస్‌ కన్నుమూత". Sakshi. మూలం నుండి 11 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 October 2019.