కేట్ బ్లాంచెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేట్ బ్లాంచెట్
Cate Blanchett Berlinale.jpg
జన్మ నామంCatherine Élise Blanchett
జననం (1969-05-14) 1969 మే 14 (వయస్సు: 50  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1993–present
భార్య/భర్త Andrew Upton (వి. 1997)

కాతరిన్ ఎలీస్ "కేట్" బ్లాంచెట్ (పుట్టిన తేది 14 మే 1969) ఆస్ట్రేలియాకు చెందిన నటి మరియు నాటక దర్శకురాలు. ఈమె వివిధ రకాలైన పురస్కారాలు గెలుచుకుంది. అందులో రెండు SAG లు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, రెండు BAFTA లు ఒక అకాడమి అవార్డు మరియు 64వ వెనిస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో గెలుచుకున్న వోల్పి కప్పు అవార్డు ప్రధానమైనవి. 1995 నుండి 2010 వరకు బ్లాంచెట్ ఐదు అకాడెమి అవార్డులకు నామినేట్ అయింది.

శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ఎలిజబెత్ చిత్రంతో బ్లాంచెట్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. 1988లో విడుదలైన ఈ చిత్రంలో బ్లాంచెట్ ఇంగ్లాండుకు చెందిన ఎలిజబెత్ I పాత్ర పోషించింది. ఆమె చేసిన నాటకాలలో పీటర్ జాక్సన్ యొక్క ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రైలాజీలో పోషించిన ఎల్ఫ్ క్వీన్ గాలడ్రిల్ పాత్ర, ఇండియాన జోన్స్ అండ్ ది కింగ్డం ఆఫ్ ది క్రిస్టల్ స్కల్లో కర్నల్ డాక్టర్ ఇరినా జోన్స్ పాత్ర మరియు మాటిన్ స్కోర్సేస్ యొక్క ది ఏవియేటర్లో కాథరీన్ హెప్ బరన్ అను పాత్ర చాలా ప్రముఖమైనవి. ది ఏవియేటర్లో పాత్రకు ఆమెకు ఉత్తమ సహాయ నటిగా అకాడమి అవార్డు కూడా వచ్చింది.[1][2][3] ప్రస్తుతము ఆమె మరియు ఆమె భర్త ఆండ్రూ ఆప్టన్, ఇద్దరు సిడ్నీ థియేటర్ కంపనీలో డైరెక్టర్లుగా ఉన్నారు.

బాల్యము మరియు చదువు[మార్చు]

బ్లాంచెట్ మెల్బోర్న్ లోని ఇవాన్హూలో జన్మించారు. ఆమె తల్లి జూన్ ఆస్ట్రేలియా స్థిరాస్తి వ్యాపారం చేస్తూ అధ్యాపకురాలిగా పని చేసేవారు. ఆమె తండ్రి రాబర్ట్ బాబ్ బ్లాంచెట్ అస్ లోని టెక్సాస్ నగరంలో నేవీ పెట్టి ఆఫీసర్ గా పనిచేశాడు. తరువాత ఒక ప్రకటనా అధికారిగా పనిచేశారు.[4][5] వారిరువురు బ్లాంచెట్ తండ్రి యొక్క నావ USS ఆర్నేబ్ మెల్బోర్న్ చేరినప్పుడు కలుసుకున్నారు. ఆమె తన పదవ ఏట తన తండ్రిని పోగొట్టుకుంది. ఆయన గుండె పోటుతో చనిపోయారు. చిన్నపుడు తనను తానూ 'కొంత ఎక్స్ట్రోవర్ట్ గా, కొంత వాల్ఫ్లవర్ గా" అభివర్ణించుకుంది.[6] ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. అన్న అయిన బాబ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. చెల్లెలైన జేనేవీవ్ ఏప్రిల్ 2008లో ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ అఫ్ డిజైన్ పట్టా పొంది, థియేట్రికల్ డిసైనర్ గా పనిచేస్తున్నారు.[6]

బ్లాంచెట్ మేల్బౌర్న్ లోని ఇవాన్హూ ఈస్ట్ ప్రైమరీ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తిచేసారు. ఉన్నత విద్యలకై ఇవాన్హూ గాళ్స్ గ్రామర్ స్కూల్ లో చేరి, ఆ తరువాత తన నటనా ప్రతిభను కనుగొన్న మేథోడిస్ట్ లేడీస్ కాలేజీ నుండి తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు.[7] ఆస్ట్రేలియా వదిలి విదేశాలకు పయనమయ్యే ముందు, బ్లాంచెట్ మేల్బౌర్న్ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ మరియు ఎకనమిక్స్ను అభ్యసించారు.

18 ఏళ్ళ వయస్సులో, బ్లాంచెట్ విహారానికి ఈజిప్ట్ వెళ్లారు. ఒకసారి కైరో లోని ఒక హోటల్ లో బ్లాంచెట్ బసచేసినపుడు, అదే హోటల్ లో బసచేసిన వ్యక్తి ఒకరు ఆమెను సినిమాలలో నటించమని కోరాడు. బ్లాంచెట్ దీనికి వొప్పుకుని ఆ మరుసటి రోజు ఈజిప్షియన్ నటుడు అహ్మద్ జాకి నటిస్తున్న కబోరియా చిత్రంలో ఈజిప్షియన్ తో తలపడి ఓడిపోయిన అమెరికన్ బాక్సర్ను ఉత్సాహపరుస్తున్న గుంపులో ఒక అదనపు పాత్ర పోషించింది. బ్లాంచెట్ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తరువాత, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో చేరటానికి సిడ్నీకు పయనమయ్యారు. 1992లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి నాటక రంగంలో వృత్తి ప్రారంభించారు.

వృత్తి[మార్చు]

మొదటి సారి రంగస్థలం పై పెద్ద పాత్రను 1993లో డేవిడ్ మమేట్ గారి ఓలియన్న' నాటకంలో జేఫ్ఫ్రి రష్ సరసన నటించారు. ఈ నాటకం తనకు సిడ్నీ ధియేటర్ క్రిటిక్స్' బెస్ట్ న్యూకమర్ అవార్డు ను తెచ్చిపెట్టింది.[8] నీల్ ఆంఫీల్డ్ దర్సకత్వము వహించిన హాంలెట్ నాటకములో ఒఫేలియా పాత్రను పోషించింది. 1994-95లో కంపని బి ప్రొడక్షన్లో వచ్చిన ఈ నాటకంలో రష్ మరియు రిచర్డ్ రాక్స్బర్గ్ కూడా నటించారు.

బ్లాంచెట్ కొన్ని టి.వి.లఘు చిత్రాలలో నటించింది. ఎమీ డింగో సరసన హార్ట్ లాండ్ లో, హూగో వీవింగ్ తో బార్డర్ టౌన్ అనే రెండు ధారావాహికలలో నటించింది. ది లోడెడ్ బాయ్ అనే ధారావాహికలోని పోలీస్ రెస్క్యు అనే భాగంలో నటించింది. 1994లో ప్రసారమైన పోలీస్ రెస్క్యు అను టెలిచిత్రంలో ఆమె బందిపోట్లు ఆతిధ్యమిచ్చిన ఒక ఉపాధ్యాయురాలిగా చేసింది. ఆస్ట్రేలియా సినిమాలలో పరిమితంగా విడుదలైన 50 నిమిషాలు నిడివిగల పార్క్ లాడ్స్ అనే నాటకములో నటించింది.

అంతర్జాతీయ సినిమా రంగంలో బ్లాంచెట్ 1997లో విడుదలైన బ్రూస్ బారెస్ ఫోర్డ్ యొక్క పారడైస్ రోడ్ సినిమాతో తెరంగేట్రం చేసారు. గ్లెన్ క్లోస్ మరియు ఫ్రాన్సిస్ మెక్ డార్మాండ్ కూడా నటించిన ఈ చిత్రంలో బ్లాంచెట్ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనల కు చిక్కిన ఒక ఆస్త్రేలియన్ నర్సు పాత్ర పోషించింది. 1997లోనే విడుదలైన ఆస్కార్ అండ్ లుసిండా అనే చిత్రంలో ఆమె మొదటిసారిగా ప్రధాన పాత్ర అయిన లుసిండా లేప్లాస్త్రియర్ గా నటించింది. గిలియన్ ఆమ్స్త్రాంగ్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలో తను రాల్ఫ్ ఫీన్స్ సరసన నటించింది. ఆస్కార్ అండ్ లుసిండా రచయిత అయిన పీటర్ కారే మరియు బ్లాంచెట్ తండ్రి బాబ్, ఒక ప్రకటనా సంస్థలో పనిచేస్తున్నప్పుడు పరిచయస్తులే. ఈ పాత్రకి బ్లాంచెట్ మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆస్త్రేలియన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డ్ కు పోటీ పడింది కాని ఆ అవార్డు ది వెల్ అనే నాటకములో నటించిన పమేలా రాబ్ దక్కించుకున్నారు. అయితే ఇదే సంవత్సరములో విడుదలైన థాంక్ గాడ్ హి మెట్ లిజ్జి అనే హాస్య ప్రేమ కథా చిత్రంలో ఆమె పోషించిన లిజ్జి పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా AFI అవార్డు తీసుకుంది. ఈ చిత్రంలో ఈమె రిచర్డ్ రాక్స్బర్గ్ మరియు ఫ్రాన్సిస్ ఓకన్నోర్ తో కలిసి నటించింది.

1998లో విడుదలైన ఎలిజబెత్ అనే చిత్రంలో ఆమె పోషించిన ఎలిజబెత్ I పాత్ర అత్యున్నత స్థాయి అంతర్జాతీయ పాత్ర. ఈ పాత్ర ఆమెకు ఉత్తమ నటి గా అకాడెమి అవార్డు కై పోటీ పడే అవకాశం ఇచ్చింది. కానీ అకాడెమి అవార్డు షేక్స్పియర్ ఇన్ లవ్ అనే సినిమాలో నటించిన గ్వినెత్ పాల్ట్రో దక్కించుకున్నారు. మోషన్ పిక్చర్ డ్రామా అనే సినిమాకు గాను ఈమెకు బ్రిటీష్ అకాడెమి అవార్డు (BAFTA) మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాయి. ఆ తరువాతి సంవత్సరములో బ్లాంచెట్ ది టాలెంటెడ్ మి.రిప్లేయ్ అనే సినిమాలో ఉత్తమ సహాయ పాత్రకు గాను BAFTA అవార్డుకై పోటీ చేసింది.

పీటర్ జాక్సన్ యొక్క ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో చేసిన పాత్ర వల్ల బ్లాంచెట్ ప్రసిద్ధ నటిగా పేరుపొందడమే కాక చాలా మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఈ మూడు చిత్రాలలో ఆమె గాలడ్రిల్ పాత్ర పోషించింది. ఈ మూడు చిత్రాల సంకలనము అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ఖ్యాతి పొందింది.[9]

2005లో ది ఏవియేటర్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా అకాడమి అవార్డు గెలుచుకుంది. మార్టిన్ స్కోర్సేసే నిర్మించిన ఈ చిత్రంలో క్యాథరిన్ హెబ్బన్ పాత్రను పోషించింది. దీనితో ఒక ఆస్కార్ బహుమతి గ్రహిత యొక్క పాత్ర పోషించి అకాడెమి అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తిగా బ్లాంచెట్ నిలిచింది.

దస్త్రం:Cate blanchett crop.jpg
2007 బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో బ్లాంచెట్.

2006లో బ్రాడ్ పిట్ట్ సరసన బాబెల్ చిత్రంలో, జార్జ్ క్లూనీతో ది గుడ్ జర్మన్ చిత్రంలో, మరియు డేం జుడి డెంచ్ సరసన నోట్స్ ఆన్ ఎ స్కాండల్ చిత్రంలో నటించింది. యాదృచ్చికంగా డెంచ్ ఎలిజబెత్ పాత్రకుగాను ఉత్తమ సహాయ నటి గా అకాడెమి అవార్డును గెలుచుకుంది. అదే సంవత్సరములో బ్లాంచెట్ అదే రకమైన పాత్ర పోషించడం వల్ల వేరే విభాగంలో అవార్డు గెలుచోలేక పోయింది. బ్లాంచెట్ ఈ సినిమాలోని నటనకుగాను మూడవ సారి అకాడెమి అవార్డు కోసం పోటీ చేసింది. డెంచ్ కూడా ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ చేయబడింది.

2007లో, టైమ్స్ మాగజైన్ ప్రచురించినా ప్రపంచములోని అత్యధిక ప్రాభవం కలిగిన 100 మందిలో బ్లాంచెట్ స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్ పత్రిక కూడా బ్లాంచెట్ ను విజయవంతమైన నటిగా గుర్తించింది.

2007లోనే తను వేనీస్ చలన చిత్రోత్సవంలో వోల్పి కప్ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. టాడ్ హేన్స్ నిర్మించిన ఐ యాం నాట్ దేర్ చిత్రంలో బాబ్ డైలాన్ యొక్క ఆరు జన్మలలోని ఒక జన్మను పాత్రగా పోషించినందుకు ఆమె ఉత్తమ సహాయ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఎలిజబెత్:ది గోల్డెన్ ఏజ్ కొనసాగింపు సినిమాలో ఎలిజబెత్ I పాత్రను తనే మళ్లీ పోషించింది.[10] 80వ అకాడెమి అవార్డ్స్ లో బ్లాంచెట్ ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా, ఐ యాం నాట్ దేర్ సినిమాకుగాను ఉత్తమ సహాయ నటిగాను, రెండు విభాలలో బరిలో నిలబడింది. దీంతో ఈమె ఒకే సంవత్సరంలోనే రెండు విభాగాలలో పోటీ పడ్డ పదకొండవ నటిగా గుర్తించబడింది. పైగా కొనసాగింపు సినిమాలో అదే పాత్రకుగాను పోటీ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.[11]

బ్లాంచెట్ తన భర్తతో కలిసి సహాయ కళాదర్శకులుగా జార్జియో అర్మాని పోషకులుగా వ్యవహరిస్తున్న సిడ్ని థియేటర్ కంపని తో జనవరి 2008లో మూడేళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు.

తరువాత ఆమె స్టీవెన్ స్పీల్బెర్గ్ యొక్క ఇండియాన జోన్స్ అండ్ ది కింగ్డం ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ లో KGB ఏజెంట్ కల్. డా.ఇరినా స్పాల్కో అనే ఒక ప్రతి నాయిక పాత్రను పోషించింది. డేవిడ్ ఫించార్ యొక్క ది క్యురియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ లో బ్రాడ్ పిట్ తో కలిసి రెండవసారి నటించింది.

గ్రామన్స్ ఈజిప్షియన్ థియేటర్ ఎదురుగా ఉన్న 6712 హాలివుడ్ బాలివార్డ్ లో హాలివుడ్ వాక్ ఆఫ్ ఫేం లో బ్లాంచెట్ 5 డిసెంబర్ 2008న స్టార్ తో సత్కరించబడింది.[12]

2008 వరకు, ఉత్తమ చిత్రం విభాగంలో అకాడెమి అవార్డుకు పోటీ పడ్డ ఏడు చిత్రాలలో బ్లాంచెట్ నటించింది. అవి: ఎలిజబెత్ (1998), డి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రైలాజీ (2001, 2002 మరియు 2003), ది ఏవియేటర్ (2004), బాబెల్ (2006) మరియు ది క్యురియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ (2008).

ఫోన్యో అనే చిత్రానికి బ్లాంచెట్ గాత్రమును అందించింది.[13] 2010 మే 14న విడుదలైన రిడ్లె స్కాట్స్ యొక్క రాబిన్ హుడ్ చిత్రంలో ఆమె రస్సెల్ క్రో సరసన నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

2005 బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో బ్లాంచెట్.

బ్లాంచెట్ భర్త అయిన ఆండ్రూ ఆప్టన్ నాటక రచయిత మరియు స్క్రీన్ రైటర్. వీళ్ళు ద సీగల్ అనే చిత్ర నిర్మాణ సమయంలో కలుసుకున్నారు. వారిది తోలి చూపు ప్రేమ కాదు కాని బ్లాంచెట్ ఒక సందర్భములో చెప్పిన విధంగా "ఆయన బ్లాంచెట్ ఒంటరి అని, ఈమె అతను పోగరుబోతని" అనుకున్నారు. ఒక వ్యక్తిని ఎంతగా అపార్ధం చేసుకోవచ్చో దీని వల్ల తెలిసిందంటారు బ్లాంచెట్. ఒకసారి అతను బ్లాంచెట్ ను ముద్దు పెట్టుకోవడంతో ఇద్దరి మనసులు కలిశాయి. వారు 29 డిసెంబర్ 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు - దేషియాల్ జాన్ (3 డిసెంబర్ 2001), రోమన్ రాబర్ట్ (23 ఏప్రిల్ 2004) మరియు ఇజ్ఞాషియాస్ మార్టిన్ (13 ఏప్రిల్ 2008).

2000 వరకు ఇంగ్లాండ్ లోని బ్రైటన్ నివాసమున్న బ్లాంచెట్ జంట, ఆ తరువాత వారి సొంత దేశం అయిన ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. వారు తమ సొంత దేశానికి తిరిగివచ్చిన కారణాలను 2006 నవంబర్ లో ఇలా వివరించారు. వారు తమ పిల్లలకు సొంత ఇంటిని నిర్ణయించడానికి, మరియు తన కుటుంబముతో సన్నిహితంగా ఉంటూ ఆస్ట్రేలియన్ నాటక రంగానికి చేరువగా ఉండేందుకు ఈ నిర్ణయము తీసుకున్నారు.[14] బ్లాంచెట్ తన కుటుంబంతో కలిసి సిడ్నీ నగర శివారులలోని హంటర్స్ హిల్ లో 1877 నాటి సాండ్ స్టోన్ మాన్షన్ అయిన 'బుల్వర్ర'లో నివాసముంటున్నారు. ఈ భవంతిని $10.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు 2004లొ కొనుగోలు చేసి, 2007లో పర్యావరణానికి అనుకూలంగా ఉండేందుకు ఆధునీకరించారు.[15][16]

2006లో కేట్ బ్లాంచెట్ కుటుంబ చిత్రపటము మెక్లీన్ ఎడ్వార్డ్స్ వేసారు. ఈ చిత్ర పటం ఆర్చిబాల్డ్ ప్రైజ్ లో తుదవరకు పోటీలో నిలిచి, "కళ, చదువు, విజ్ఞానం లేదా రాజకీయం లో సాధన చేసిన పురుషుడు లేదా స్త్రీ యొక్క ఉత్తమ రూపచిత్రం" అవార్డును గెలుచుకుంది.[17]

సిడ్నీ చలన చిత్రోత్సవానికి బ్లాంచెట్ పోషకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రోక్టర్ & గాంబుల్ యొక్క చర్మ సౌందర్య సంరక్షక ఉత్పత్తి అయిన SK-11 కు ఈమె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 2007లో, www.whoonearthcares.com ఆన్‌లైన్ శిబిరానికి ప్రధాన ప్రచారకర్తగా బ్లాంచెట్ వ్యవహరించారు. మారుతున్న వాతావరణంపై ఆస్ట్రేలియన్ల భావాలు వ్యక్త పరిచేందుకు ఈ శిబిరాన్ని ఆస్ట్రేలియన్ కన్సర్వేషన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నది. సోలార్ ఎయిడ్ అనే అభివృద్ధి సంస్థకు కూడా తను పోషకురాలిగా వ్యవహరిస్తోంది. 2008లో సిడ్నీలో జరిగిన 9వ ప్రపంచ మెట్రోపోలిస్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో బ్లాంచెట్ ఇలా అన్నారు: "విభిన్నంగా ఉండటం ప్రపంచంలోని అన్ని గొప్ప పట్టణాలలో ఉన్న సారూప్యం".[18]

2009 ప్రారంభంలో ప్రత్యేక తపాల స్టాంపులు అయిన 'ఆస్ట్రేలియన్ లెజెండ్స్ అఫ్ ది స్క్రీన్' పై బ్లాంచెట్ దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక తపాల స్టాంపులు ఆస్ట్రేలియా సాంస్కృతిక మరియు వినోద రంగంపై తమదైన ముద్ర వేసి, ప్రత్యేకమైన సేవలందించిన ఆస్ట్రేలియన్ నటీనటుల గుర్తింపుగా విడుదలా చేశారు.[19] బ్లాంచెట్, జోఫ్ఫ్రి రష్ రస్సెల్ క్రో మరియు నికోల్ కిడ్మాన్ - ప్రతి ఒక్కరు ఈ సీరీస్ లో రెండు సార్లు రెండు పాత్రలలో దర్శనమిస్తారు. ఒకటి తమలాగాను మరొకటి తాము వేసే పాత్రగాను కనిపిస్తారు. బ్లాంచెట్ Elizabeth: The Golden Age నుంచి ఒక పాత్రలాగా చూపబడింది.[19]

చలనచిత్రపట్టిక[మార్చు]

చలనచిత్రం
సంవత్సరం శీర్షిక పాత్ర సూచనలు
1994 పోలీస్ రెస్‌క్యూ: ది మూవీ వీవియన్
1996 పార్క్లాండ్స్ రోసీ
1997 ఆస్కార్ అండ్ లుసిండా లుసిండా లేప్లాస్ట్రియర్ ప్రతిపాదన - ఒక ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా ఆస్ట్రేలియన్ ఫిలిం ఇన్స్టిట్యుట్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు
1997 థాంక్ గాడ్ హీ మెట్ లిజ్జి లిజ్జి ఉత్తమ సహాయ నటిగా ఆస్ట్రేలియన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు
1997 పారడైస్ రోడ్ సూసన్ మకార్తి
1998 ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ l ఒక ప్రదాన పాత్రలో ఉత్తమ నటిగా BAFTA అవార్డు
ఉత్తమ నటిగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటిగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసొసియేషన్ అవార్డు
ఉత్తమ నటిగా క్లోట్రూడిస్ అవార్డు
ఉత్తమ నటిగా ఎంపైర్ అవార్డు
ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
ఉత్తమ అభయదాయక నటిగా లాస్ వెగాస్ ఫిలిం క్రిటిక్స్ సొసైటి అవార్డు
ఉత్తమ నటిగా లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ఉత్తమ నటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ఉత్తమ నటిగా శాటిలైట్ అవార్డు - చలన చిత్ర నాటకం
ఉత్తమ నటిగా సౌత్‌ఈస్టర్న్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటిగా టొరంటో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన - MTV మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మన్స్- మహిళా
ప్రతిపాదన — ముఖ్య పాత్రలో ఒక నటిచే విశిష్ట నటనకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
1999 బాంజర్స్ జూలీ-అన్నే
1999 Talented Mr. Ripley, TheThe Talented Mr. Ripley మేరిడిత్ లోగ్ ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా BAFTA అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా క్లోట్రుడిస్ అవార్డు (యాన్ ఐడియల్ హస్బండ్ కోసం కూడా)
1999 పుషింగ్ టిన్ కోనీ ఫాల్జోన్
1999 Ideal Husband, AnAn Ideal Husband లేడి జెర్ట్రూడ్ చిల్టర్న్ ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా క్లోట్రూడిస్ అవార్డు (ఇంకా ది టాలేన్టెడ్ మి. రిప్లేకి కూడా)
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా సాటిలైట్ అవార్డు - చలన చిత్రం
2000 Gift, TheThe Gift అన్నాబెల్లె "ఆన్ని" విల్సన్ ప్రతిపాదన - ఉత్తమ నటిగా ఫోనిక్స్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్
ప్రతిపాదన - ఉత్తమ నటిగా సాటర్న్ అవార్డు
2000 Man Who Cried, TheThe Man Who Cried లోలా ఉత్తమ సహాయ నటిగా క్లోట్రూడిస్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా ఫ్లోరిడా ఫిలిం క్రిటిక్స్ అవార్డ్ (బందిట్స్, ది లార్డ్ అఫ్ రింగ్స్: ది ఫెల్లోషిప్ అఫ్ ది రింగ్ మరియు ది షిప్పింగ్ న్యూస్ కొరకు కూడా)
ఉత్తమ సహాయ నటిగా నేషనల్ బోర్డు అఫ్ రివ్యూ అవార్డు (ది లార్డ్ అఫ్ రింగ్స్: ది ఫెల్లోషిప్ అఫ్ ది రింగ్ మరియు ది షిప్పింగ్ న్యూస్ చిత్రాలకు కూడా)
2001 Shipping News, TheThe Shipping News పెటల్ క్యోలె ఉత్తమ సహాయ నటిగా ఫ్లోరిడా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు (బందిట్స్, ది లార్డ్ అఫ్ రింగ్స్: ది ఫెల్లోషిప్ అఫ్ ది రింగ్ మరియు ది మాన్ హూ క్రైడ్ చిత్రాలకు కూడా)
ఉత్తమ సహాయ నటిగా నేషనల్ బోర్డు అఫ్ రివ్యూ అవార్డు (ది లార్డ్ అఫ్ రింగ్స్: ది ఫెల్లోషిప్ అఫ్ ది రింగ్ మరియు ది మాన్ హూ క్రైడ్ చిత్రాలకు కూడా)
2001 చార్లోట్ గ్రే చార్లోట్ గ్రే ప్రతిపాదన - ఉత్తమ నటిగా కాన్సాస్ సిటీ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటిగా శాటిలైట్ అవార్డు - చలన చిత్ర నాటకం
2001 Lord of the Rings: 1The Lord of the Rings: The Fellowship of the Ring గాలడ్రిల్ 0}ఉత్తమ సహాయ నటిగా ఫ్లోరిడా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు (బందిట్స్, ది షిప్పింగ్ న్యూస్ మరియు ది మాన్ హూ క్రైడ్ చిత్రాలకు కూడా)
ఉత్తమ సహాయ నటిగా నేషనల్ బోర్డు అఫ్ రివ్యూ అవార్డు (ది షిప్పింగ్ న్యూస్ మరియు ది మాన్ హూ క్రైడ్ కూడా)'
ఉత్తమ తారాగణానికి ఫోనిక్స్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ప్రతిపాదన - చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారం
2001 బండిట్స్ కేట్ వీలర్ ఉత్తమ సహాయ నటిగా ఫ్లోరిడా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు (ది లార్డ్ అఫ్ ది రింగ్స్: ది ఫెల్లోషిప్ అఫ్ ది రింగ్, ది షిప్పింగ్ న్యూస్ మరియు ది మాన్ హూ క్రైడ్ చిత్రాలకు కూడా)
ప్రతిపాదన - ఉత్తమ నటిగా అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
ప్రతిపాదన - సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన నటికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2001 Lord of the Rings: 2The Lord of the Rings: The Two Towers గాలడ్రిల్ ఉత్తమ తారగణానికి ఆన్‌లైన్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ పురస్కారం
ఉత్తమ తారాగణానికి ఫోనిక్స్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ప్రతిపాదన - చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2001 హెవన్ ఫిలిప్ప
2003 Lord of the Rings: 3The Lord of the Rings: The Return of the King గాలడ్రిల్ ఉత్తమ తారాగణానికి బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటీనటులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డు
చలన చిత్రంలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్
ప్రతిపాదన – ఉత్తమ తారగణానికి ఫోనిక్స్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటి అవార్డు
2003 Missing, TheThe Missing మాగ్డలెన 'మ్యాగి' గైక్సన్ ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటిగా సాటర్న్ అవార్డు
2003 కాఫీ అండ్ సిగరెట్స్ హర్సేల్ఫ్ & షెల్లీ ఆ సంవత్సరపు నటిగా సెంట్రల్ ఒహియో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (ది లైఫ్ అక్వాటిక్ విత్ స్టీవ్ జిస్సౌ మరియు ది ఏవియేటర్కు కూడా)
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా క్లోట్రుదిస్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు
2003 వెరోనికా గ్యురిన్ వెరోనికా గ్యురిన్ ప్రతిపాదన — ఉత్తమ నటిగా ఎంపైర్ పురస్కారం
ప్రతిపాదన — ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
ప్రతిపాదన - ఉత్తమ నటిగా వాషింగ్టన్ D.C. ఏరియా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
2004 Life Aquatic with Steve Zissou, TheThe Life Aquatic with Steve Zissou జేన్ విన్స్లెట్ - రిచర్డ్సన్ ఆ సంవత్సరపు నటిగా సెంట్రల్ ఒహియో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (కాఫీ అండ్ సిగరెట్స్ మరియు ది ఏవియేటర్ సినిమాలకు కూడా)
ఉత్తమ సహాయ నటిగా లాస్ వెగాస్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డు (ది ఏవియేటర్ సినిమాకు కూడా)
ప్రతిపాదన - ఉత్తమ తారగణానికి బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
2004 Aviator, TheThe Aviator కాథరీన్ హెప్‌బర్న్ ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా BAFTA అవార్డు
ఆ సంవత్సరపు నటిగా సెంట్రల్ ఒహియో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (కాఫీ అండ్ సిగరెట్స్ మరియు ది లైఫ్ అక్వాటిక్ విత్ స్టీవ్ జిస్సూ సినిమాలకు కూడా)
ఉత్తమ సహాయ నటిగా కాన్సాస్ సిటీ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా లాస్ వెగాస్ ఫిలిం క్రిటిక్స్ సొసైటి అవార్డు (ది లైఫ్ అక్వాటిక్ విత్ స్టీవ్ జిస్సూకు కూడా)
ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన నటిగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు.
ఉత్తమ సహాయ నటిగా వాషింగ్టన్ D.C. ఏరియా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు.
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా ఎంపైర్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయనటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలనచిత్రం
ప్రతిపాదన - చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా శాటిలైట్ అవార్డు - చలన చిత్రం
2005 లిట్టిల్ ఫిష్ ట్రేసీ హార్ట్ రోల్ ఉత్తమ నటిగా ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ అవార్డు
ఉత్తమ నటిగా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు
2006 బాబెల్ సూసన్ జోన్స్ ఉత్తమ తారాగణానికి పాం స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు
ప్రతిపాదన - చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2006 Good German, TheThe Good German లేనా బ్రాండ్
2006 నోట్స్ ఆన్ ఎ స్కాండల్ షీబా హార్ట్ ఉత్తమ సహాయ నటిగా డల్లాస్-ఫోర్ట్ వర్త్ ఫిలిం క్రిటిక్స్ ఆసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా ఫ్లోరిడా ఫిల్మ్ క్రిటిక్స్ సిర్కిల్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా ఫోనిక్స్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా టోరంటో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా వాంకోవర్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా అకాడెమి అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిలిం అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటిగా బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయనటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలనచిత్రం
ప్రతిపాదన - ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా శాటిలైట్ అవార్డు - చలన చిత్రం
ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటిగా సాటర్న్ అవార్డు
ప్రతిపాదన - సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన నటిగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2007 హాట్ ఫజ్ జనిన్ అంక్రేడిటెడ్ కెమియో
2007 Elizabeth: The Golden Age క్వీన్ ఎలిజబెత్ l ఉత్తమ నటిగా ఆస్ట్రేలియన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా BAFTA అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటిగా ఎంపైర్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటుగా ోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
ప్రతిపాదన — ముఖ్య పాత్రలో ఒక నటిచే విశిష్ట నటనకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2007 ఐ యాం నాట్ దేర్ జూడ్ క్విన్ బాబ్ డైలాన్ ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా సెంట్రల్ ఒహియో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా క్లోట్రూడిస్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయనటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలనచిత్రం
ఉత్తమ సహాయ నటిగా ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు రాబర్ట్ ఆల్ట్‌మాన్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా కాన్సాస్ సిటీ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా జాతీయ చిత్ర విమర్శకుల సంస్థ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా టొరంటో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటిగా వోల్పి కప్
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా అకాడెమి అవార్డు
ప్రతిపాదన - సహాయ పాత్రలో ఉత్తమ నటిగా BAFTA అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటిగా బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన - ఐరిష్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్ - ఆడియన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇంటర్నేషనల్ అక్ట్రెస్
ప్రతిపాదన - ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
ప్రతిపాదన - సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన నటికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2008 ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ కర్నల్-డాక్టర్ ఐరిన స్పాల్కో
2008 Curious Case of Benjamin Button, TheThe Curious Case of Benjamin Button డైసి ఫుల్లెర్ ప్రతిపాదన - ఉత్తమ నటిగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ సహాయ నటిగా సాటర్న్ అవార్డు
ప్రతిపాదన - చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
2009 ఫోన్యో గ్రాన్మమారే గాత్రము - ఆంగ్ల వెర్షన్
2010 రాబిన్ హుడ్ లేడి మారియన్
2011 హన్నా (ఫిలిం) మారిస్సా వీగ్లర్ నిర్మాణాంతర పనులు

థియేటర్ క్రెడిట్స్[మార్చు]

నాటక రంగం
సంవత్సరం నిర్మాణం ప్రదేశము పాత్ర సూచనలు
1992కు ముందు Odyssey of Runyon Jones, TheThe Odyssey of Runyon Jones మేతోదిస్ట్ లేడీస్ కాలేజీ, మేల్బౌర్న్ తెలియదు నార్మన్ కార్విన్ చే అడాప్ట్ చేయబడిన నాటకము
1992కు ముందు దే షూట్ హార్సెస్, డోంట్ దే? మేతోదిస్ట్ లేడీస్' కాలేజీ, మేల్బౌర్న్ డైరెక్టర్ హోరేస్ మెక్ కాయ్ రచించిన నవల ఆధారంగా నాటకాన్ని నిర్మించి తోటి విద్యార్ధులపై దర్శకత్వం వహించింది.
1992 ఎలెక్ట్రా నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రమటిక్ ఆర్ట్, మేల్బౌర్న్ ఎలెక్ట్రా ప్రధాన పాత్ర
1992/1993 టాప్ గాళ్స్ సిడ్నీ ధియేటర్ కంపెనీ తెలియదు క్యారిల్ చర్చిల్ యొక్క ఈ నాటకంలో మొదటి సారి ప్రధాన పాత్ర పోషించింది.
1993 ఒలియన్న సిడ్నీ ధియేటర్ కంపెనీ కేరోల్ డేవిడ్ మమేట్ చెందిన ఈ నాటకంలో జోఫ్ఫ్రి రష్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో విద్యార్థి చేత లైంగిక వేధింపుల ఆరోపించబడ్డ ప్రొఫెసర్ గా జేఫ్ఫ్రి రష్ నటించారు. ఈ నాటకానికి గాను, ఆమె రోసేమొంట్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
1994 హామ్లెట్ బెల్వోయిర్ స్ట్రీట్ ధియేటర్ కంపెనీ ఒఫిలియా జోఫ్ఫ్రి రష్ సరసన నటించింది. ఈ నాటకాన్ని కంపెనీ బి నిర్మాణ సారథ్యంలో నీల్ అమ్ఫీల్ద్ దర్శకత్వంలో నిర్మించారు.
1995 స్వీట్ ఫోబ్ క్రోయ్దోన్ సిడ్నీ ధియేటర్ కంపెనీ మరియు వేర్హౌస్ ధియేటర్, క్ర్యోడాన్ హెలెన్ బెల్వోర్ స్ట్రీట్ ధియేటర్/ ప్లే బాక్స్ ధియేటర్ కో-ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో మైఖేల్ గో దర్శకత్వంలో తను ప్రాధాన్ పాత్ర పోషించింది. సిడ్నీ ప్రొడక్షన్ మొట్టమొదటి నిర్మాణ సారథ్య కంపెనీ, తరువాత వెస్ట్ ఎండ్ కి బదిలిచేయబడింది
1995 Tempest, TheThe Tempest బెల్వోర్ స్ట్రీట్ ధియేటర్ కంపెనీ మిరాండా కంపెనీ బి నిర్మాణ సారథ్యంలో నీల్ అమ్ఫీల్ద్ ఈ నాటకానికి దర్శకత్వం వహించారు. డక్స్టన్ శేవాలియర్ సరసన నటించిన
1995 Blind Giant is Dancing, TheThe Blind Giant is Dancing బెల్వోర్ స్ట్రీట్ ధియేటర్ కంపెనీ రోజ్ డ్రేపర్ హూగో వీవింగ్ సరసన నటించింది స్టీఫెన్ సీవెల్ యొక్క నాటకం ఇది 15 ఆగష్టు 1995లో ప్రారంభమై 10 సెప్టెంబర్ 1995న ముగిసింది. పాల్ చార్లియర్ సంగీతం సమకూర్చిన ఈ నాటకానికి నీల్ ఆమ్ఫీల్ద్ దర్శకుడు. దీనిని కంపెనీ బి నిర్మించింది.
1997 ది సీగల్స్ ఇన్ హ్యారి హిల్స్ అని కూడా అంటారు బెల్వోర్ స్ట్రీట్ ధియేటర్ కంపెనీ నైన అంటన్ చెకోవ్ నాటకంలో ప్రధాన పాత్రధారి. ఇది 4 మార్చి 1997న ప్రారంభమై 13 ఏప్రిల్ న ముగిసింది. పాల్ చార్లియర్ సంగీతం సమకూర్చిన ఈ నాటకానికి నీల్ ఆమ్ఫీల్ద్ దర్శకుడు. దీనిని కంపెనీ బి నిర్మించింది.
1999 ప్లేంటి ది అల్బెరి ధియేటర్, లండన్ లోని ది అలేమిద సీసన్ సూసన్ త్రాహ్ర్నే డేవిడ్ హేర్ యొక్క నాటకంలో ప్రధానపాత్రధారి. దీనికి జోనాథన్ కెంట్ దర్శకుడు. ఇది 27 ఆప్రిల్ 1999న ప్రారంభమై 1999 జూలై 27న ముగిసింది.
1999 Vagina Monologues, TheThe Vagina Monologues ఓల్డ్ విక్ ధియేటర్, లండన్ తెలియదు సంగీత విభావరి:1999 ఫిబ్రవరిలో ఈ ప్రదర్శనలో పాల్గోనింది. ఇందులో మేలాని గ్రిఫిత్ తదితర నటీనటులు కూడా పాల్గొన్నారు.
2004 హేడ్డా గ్యాబ్లర్ సిడ్నీ ధియేటర్ కంపెనీ హేడ్డా గ్యాబ్లర్ ఇది 22 జూలై 2004న ప్రారంభమై 26 సెప్టెంబర్ 2004న ముగిసింది. బ్రూక్లిన్ అకాడెమి ఆఫ్ మ్యుసిక్స్ హార్వి థియేటర్, న్యూ యార్క్ లో మార్చి 2006లో ఆమె హేడ్డా పాత్రను మరో సారి పోషించింది
2009 War of the Roses, The. CycleThe War of the Roses Cycle సిడ్నీ ధియేటర్ కంపెనీ రిచర్డ్-ll, లేడీ ఆనీ 5 జనవరి 2009 నుంచి ప్రివ్యు చేయబడింది. సిడ్ని ఫిలిం ఫెస్టివల్ 2009లో భాగంగా ఈ నాటకాన్ని రెండు భాగాల్లో 10-31 జనవరి నుంచి ఫిబ్రవరి 2009 వరకు ప్రదర్శించారు.
2009 Streetcar Named Desire, AA Streetcar Named Desire సిడ్నీ ధియేటర్ కంపెనీ బ్లాంక్ డ్యుబోయిస్ ఈ నాటకానికి లివ్ ఉల్ల్మాన్ అనే నటి దర్శకత్వం వహించారు. జోల్ ఎడ్గార్టన్ కూడా ఇందులో నటించారు.
2010 అంకుల్ వన్య సిడ్నీ ధియేటర్ కంపెనీ

మూలాలు[మార్చు]

 1. "Audrey Hepburn 'most beautiful woman of all time' – Entertainment – www.smh.com.au". Smh.com.au. 1 June 2004. Retrieved 21 October 2008. Cite news requires |newspaper= (help)
 2. "Cate Blanchett : People.com". People.com. Retrieved 21 October 2008. Cite web requires |website= (help)
 3. CampbellJohnston, Rachel (1 June 2005). "The most beautiful women? – Times Online". London: Timesonline.co.uk. Retrieved 21 October 2008. Cite news requires |newspaper= (help)
 4. "Cate Blanchett's biography — Elle December 2003". Elle. మూలం నుండి 28 అక్టోబర్ 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 17 October 2007.
 5. "Cate Blanchett Biography (1969-)". FilmReference.com. Retrieved 2010-08-15.
 6. 6.0 6.1 "Cate Blanchett's biography". The biography channel. మూలం నుండి 2 జూన్ 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 17 October 2007.
 7. Crikey.com.au: Famous alumni on Latham's hit list Archived 2007-09-26 at the Wayback Machine. (చూసిన తేది:15-01-2010)
 8. "Cate Blanchett". biogs.com. మూలం నుండి 2 ఫిబ్రవరి 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 23 February 2008.
 9. "Top Trilogies worldwide". Box Office Mojo. 21 September 2004. మూలం నుండి 12 జూన్ 2004 న ఆర్కైవు చేసారు. Retrieved 17 October 2007.
 10. Goodwin, Christopher (14 October 2007). "Cate Blanchett as Elizabeth I is no surprise". The Times. London. Retrieved 14 October 2007.
 11. Hellard, Peta (23 January 2008). "Cate's double Oscar nod". The Daily Telegraph. మూలం నుండి 11 September 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 23 January 2008.
 12. "Blanchett gets star on Walk of Fame". Melbourne: The Age. 6 December 2008. Retrieved 21 December 2008. Cite news requires |newspaper= (help)
 13. Child, Ben (27 November 2008). "English-language cast announced for Miyazaki's Ponyo on the Cliff". London: guardian.co.uk. Retrieved 30 November 2008. Cite news requires |newspaper= (help)
 14. Michael Specter (2006). "Head First". Vogue. Retrieved 17 October 2007. Unknown parameter |month= ignored (help)
 15. Hannah Edwards (12 December 2004). "Cate buys mansion for $10m". The Sydney Morning Herald. Retrieved 17 October 2007.
 16. Hannah Edwards (8 July 2007). "Welcome to Cate Blanchett's dream eco-home". The Sydney Morning Herald. Retrieved 17 October 2007.
 17. "Archibald Prize 06". Art Gallery NSW. Retrieved 26 February 2008. Cite web requires |website= (help)
 18. AAP (23 October 2008). "Cities under spotlight at conference". The Age. Retrieved 23 October 2008.
 19. 19.0 19.1 "Academy winners are stamped as 2009 Legends". Australia Post. మూలం నుండి 4 ఫిబ్రవరి 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2009.

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.