కేథరీన్ థెరీసా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కేథరీన్ థెరీసా
Catherine Tresa.jpg
జననం కేథరీన్ థెరీసా అలెగ్జాండర్
(1992-09-10) సెప్టెంబరు 10, 1992 (వయస్సు: 25  సంవత్సరాలు)
దుబాయి
ఇతర పేర్లు కేథరీన్
వృత్తి నటి,
మోడల్
క్రియాశీలక సంవత్సరాలు 2011 నుండి ఇప్పటివరకు

కేథరీన్ థెరీసా (జననం : సెప్టెంబరు 10 1992) దక్షిణ భారత నటి. ఈమె మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది.

సినీ జీవితం[మార్చు]

కన్నడంలో ప్రముఖ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ IPS సినిమాతో తెరంగేట్రం చేసిన కేథరీన్ అదే సంవత్సరంలో పృథ్వీరాజ్ సరసన మలయాళంలో ది ధ్రిల్లర్ సినిమాలో నటించింది. అదే సంవత్సరంలో కన్నడ భాషలో ఉప్పుకుండం బ్రదర్స్, విష్ణు సినిమాలలో నటించింది. 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013 లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా విఫలమైనా కేథరీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకులు కూడా ఆమె నటన, అందచందాలే ఆ సినిమాకున్న ఏకైక మంచి అంశంగా అభివర్ణించారు. ప్రస్తుతం కేథరీన్ నానీ సరసన పైసా, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కేథరీన్ దుబాయికి చెందిన మలయాళం కేథలిక్ కుటుంబంలో జన్మించింది.[1] ఆమె చెప్పిన ప్రకారం "నేను అనర్గళంగా మలయాళం మాట్లాడలేను. మేము ఇంటిలో ఆంగ్లంలో మాట్లాడుకుంటాము. నేను హిందీ లో కూడా చక్కగా మాట్లాడాగలను. ప్రస్తుతం తెలుగు భాషను నేర్చుకుంటున్నాను"[2]. ఈమె దుబాయిలో 12 గ్రేడు వరకు చదివింది. అచటనుండి బెంగళూరుకు ఉన్నత విద్య అభ్యసించటానికి వచ్చింది. ఈమె సెయింట్ జోసెఫ్ కాలేజీ, బెంగళూరులో రెండు సంవత్సరములు విద్యాభ్యాసం చేసింది[3] . ఈమె విద్యాభ్యాసం చేసే కాలంలో సంగీత వాద్యాలను ఉపయోగించుట, పాడుట మరియు నృత్యం నేర్చుకుంది. ఈమె ఐస్ స్కేటింగ్ కూడా చేయగలదు[2] . ఈమె "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్", "జోస్కో జ్యుయలర్స్" మరియు "దక్కన్ క్రానికల్" లకు మోడల్ గా వ్యవహరిస్తున్నది. ఈమె "శ్రీకంఠదత్త వొడియార్ కాలెండర్"లో ఒక షాట్ లో గలదు. ఈమె అనేక నగరాఅలలో గల వివిధ రాంప్ షోలలో పాల్గొంది[4].

నటించిన చిత్రాలు[మార్చు]

Year Film Role Language Notes
2010 Shankar IPS Shilpa Kannada
2010 The Thriller Meera Malayalam
2011 Vishnu Kannada
2012 Godfather Sujatha Kannada
2013 చమ్మక్ చల్లో సునయన తెలుగు
2013 ఇద్దరమ్మాయిలతో ఆకాంక్ష తెలుగు
2014 పైస నూర్ తెలుగు
2014 మద్రస్ కలైఅరసి tamil
2014 యెర్రబుస్ రజి తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Katherine, the new girl on the block". nowrunning.com. Retrieved 7 November 2012. 
  2. 2.0 2.1 "Riding high". The Hindu. Retrieved 7 November 2012. 
  3. "Katherine Exclusive Interview". Retrieved 7 November 2012. 
  4. "Katherine Heroine In S Narayan Movie". Retrieved 7 November 2012.