Jump to content

కేరళలో బౌద్ధమతం

వికీపీడియా నుండి
మావేలిక్కరలోని బుద్ధుని విగ్రహం

కేరళలో బౌద్ధమతం దాదాపుగా కనుమరుగైనప్పటికీ, ఆధునిక పూర్వ కాలంలో దీని ప్రభావం ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు, కేరళ సంస్కృతిలో బౌద్ధమత సాంస్కృతిక ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది.[1]

ఇనుప యుగం లేదా తొలి చారిత్రక కాలంలో ప్రాచీన కేరళలో బౌద్ధమత ఉనికికి సంబంధించి ప్రత్యక్ష ఆధారాలు లేవు; అయితే సా.పూ. 3వ శతాబ్దం నాటికే వాణిజ్య మార్గాల ద్వారా అనుసంధానించబడిన కేరళలోని కొన్ని ప్రాంతాలకు బౌద్ధ భావాలు చేరే అవకాశం ఉంది.[2] ముఖ్యంగా, సా.శ. 2వ శతాబ్దానికి చెందిన 'శ్రమణ' అనే బ్రాహ్మీ లిపి ఉన్న ఒక కుండ పెంకు మధ్య కేరళలోని పురాతన ఓడరేవు పట్టణం పత్తనం (నార్త్ పరవూర్) వద్ద లభించింది.[2] మలబార్ తీరంతో సంబంధం ఉన్న మధ్యయుగ తమిళ ఇతిహాస పద్యం మణిమేకలై బౌద్ధ తత్వశాస్త్రం, ఆచారాలకు సంబంధించిన వివరణాత్మక సూచనలను కలిగి ఉంది.[2] బౌద్ధమతంలోకి మారినట్లుగా భావించే పల్లిబాణ పెరుమాళ్ కథ లాంటి స్థానిక సంప్రదాయాలు, అవశేషాలు బౌద్ధ ఉనికిని మరింతగా సూచిస్తున్నాయి, ఇవి కొట్టాయం, అలప్పుళ ప్రాంతాలలోని దేవాలయాలతో సంబంధం కలిగి ఉన్నాయి.[2]

ప్రస్తుత కేరళలోని అనేక ప్రముఖ హిందూ దేవాలయాలు వాస్తవానికి బౌద్ధ పుణ్యక్షేత్రాలని భావిస్తున్నారు.[3] అదనంగా, గణనీయమైన సంఖ్యలో బుద్ధుని విగ్రహాలు — ప్రధానంగా అలప్పుళ, కొల్లాం ప్రాంతాల నుండి — రాష్ట్రవ్యాప్తంగా కనుగొనబడ్డాయి.[3] శ్రీ మూలవాసం అని పిలువబడే ఒక ప్రసిద్ధ బౌద్ధ విహారం అలప్పుళ తీరంలో ఎక్కడో ఉన్నట్లు నమ్ముతారు.[3] ఎపిగ్రాఫిక్, సాహిత్య ఆధారాలు ఈ దేవాలయం తొలి మధ్యయుగ కాలంలో ఆయ్ కుటుంబం, ఏళిమల పాలకుల లాంటి స్థానిక కేరళ పాలకులచే పోషించబడిందని సూచిస్తున్నాయి.[4] కేరళలో, బౌద్ధమతం ఎక్కువగా హిందూమతంలో కలిసిపోయింది, కుత్తిరకెట్టు, కెట్టుకాళ్చ లాంటి అనేక సాంస్కృతిక ఆచారాలు బౌద్ధ సంప్రదాయాలచే ప్రభావితమయ్యాయని భావిస్తున్నారు.[3] విహారాలు అభ్యాస కేంద్రాలుగా పనిచేయడంతో, కేరళలో విద్య, అక్షరాస్యతను ప్రోత్సహించడంలో బౌద్ధమతం బహుశా ప్రధాన పాత్ర పోషించింది. కేరళలో సాంప్రదాయ ఆయుర్వేదానికి ఉన్న విస్తృత ప్రజాదరణను తరచుగా బౌద్ధమత వారసత్వంగా పరిగణిస్తారు.[3] ప్రముఖ కేరళ కవి కుమారన్ ఆశాన్ (1871 – 1924) బౌద్ధ తత్వశాస్త్రం ద్వారా బలంగా రూపుదిద్దుకున్నాడు, ఇది అతని రచనలైన కరుణ, చండాల భిక్షుకి, శ్రీ బుద్ధ చరితంలలో స్పష్టంగా కనిపిస్తుంది.[3]

చరిత్ర

[మార్చు]
మూడవ బౌద్ధ మండలిలో అశోకుడు, సన్యాసి మొగ్గలిపుత్త-తిస్స. నవ జేతవన, శ్రావస్తి.

అశోకుడి శాసనాలలో చేర పాలకులను 'కేరళపుత్రులు' అని పేర్కొన్నారు. ఇది బహుశా చేర కుమారులు లేదా సాధువుగా పరిగణించబడి బుద్ధునిగా వర్ణించబడిన చేర రాజును సూచించి ఉండవచ్చు.[మూలాలు అవసరం] ఏదేమైనా, కేరళ తొలి రాజులు బౌద్ధ, జైన మతాలను స్వీకరించారు.[5][full citation needed]

కేరళను బౌద్ధమతంతో ముడిపెట్టే పురాతనమైన, అత్యంత నమ్మదగిన పత్రం గుజరాత్‌లోని గిర్నార్ శిలపై చక్రవర్తి అశోకుడు చెక్కించిన ధర్మ శాసనాలు. అందులో ఇలా ఉంది:

సా.పూ. అశోకుడి శాసనాలు సా.శ. 2వ శతాబ్దం నాటికే కేరళ, దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో బౌద్ధమతం ఉనికిలో ఉందని చూపుతున్నాయి.[7] థేరవాద బౌద్ధమతం 3వ శతాబ్దంలో కేరళకు చేరుకుంది. కోజికోడ్, మావేలిక్కర, కరుమాడి, కరునాగపల్లి, మరుతుర్కులంగర, భరణిక్కావు, పల్లిక్కల్, కొట్టప్పురం వద్ద బుద్ధుని విగ్రహాలు కనుగొనడం ఇందుకు ఉదాహరణ.

విదేశాలలో బోధించడానికి ముందే భారతదేశం అంతటా బౌద్ధమత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అశోక చక్రవర్తి ప్రయత్నించాడు. ఈ విషయం మస్కి శాసనాలలో పేర్కొనబడింది. కేరళ పేరు ప్రస్తావించబడలేదు కానీ భారతదేశం అంతటా విస్తరించినందున కేరళ అందులో చేర్చబడి ఉంటుంది.[సందిగ్ధంగా ఉంది] ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, బావులు తవ్వడం, ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లు నాటడం లాంటివి జరిగినట్లు రికార్డులు ఉన్నాయి.[మూలాలు అవసరం] బౌద్ధ గ్రంథమైన మహావంశం, బుద్ధుడు స్వయంగా దక్షిణ భారతదేశం, సిలోన్‌లను ఒకట్రెండు సార్లు సందర్శించినట్లు నమోదు చేసింది.[8][better source needed] బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి కేరళకు వచ్చిన సన్యాసులు శ్రీలంక నుండి మాత్రమే రాలేదు, గుజరాత్, మహారాష్ట్రలలో బౌద్ధమతాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు పంపిన ప్రముఖ బౌద్ధ ఉపాధ్యాయుడు మహాసంఘరక్షితుని శిష్యుల ద్వారా కూడా బౌద్ధులు కేరళకు వచ్చారు.[9]


హీనయాన అనుచరులే కాకుండా మహాయాన, వజ్రయాన సిద్ధాంతకర్తలు కూడా కేరళలో పెరిగారు. శ్రీలంకను సా.శ. 240 నుండి 253 వరకు పాలించిన మేఘవర్ణుడు, 253 నుండి 275 వరకు పాలించిన మకల మహాయాన సన్యాసులకు అవకాశం ఇచ్చారు. అయితే, 305 నుండి 316 వరకు గోడకాదయ్యన్ రాజు పాలనలో, మతవిరుద్ధమైన ఆరోపణలపై 60 మంది మహాయాన బౌద్ధ సన్యాసులు బహిష్కరించబడ్డారు. వారంతా వచ్చి కేరళలో స్థిరపడ్డారు. ఈ 60 మంది సాధువులు కేరళలో మహాయాన బౌద్ధమత ఎదుగుదలకు అవిశ్రాంతంగా కృషి చేశారు.[మూలాలు అవసరం]

సంగం కాలపు రచనలు బౌద్ధ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి సన్యాసులు చేసిన కృషిని సూచిస్తాయి. మణిమేకలై ఒక బౌద్ధ రచన. రావు బహదూర్ కృష్ణస్వామి అయ్యంగార్ 1927 థీసిస్ ప్రకారం, మణిమేకలైలో "మహాయాన బౌద్ధమతానికి, ముఖ్యంగా నాగార్జునుడు రూపొందించిన శూన్యవాదానికి సంబంధించిన సూచనగా పరిగణించదగినది ఏమీ లేదు".[10] దీనికి విరుద్ధంగా, 1978లో సి.ఎన్. కందస్వామి "మణిమేకలై మహాయాన బౌద్ధమతాన్ని వివరిస్తుందని, దానికి ఛాంపియన్‌గా నిలుస్తుందని" చెప్పడానికి అంతర్గత ఆధారాలు చాలా ఉన్నాయని పేర్కొన్నాడు.[11] దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం వంచిలో ఉండేది. ఈ వంచి తిరువంచికుళంలో ఉందా లేదా కొడుంగల్లూర్‌లో ఉందా అనే దానిపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి.[6] కేరళకు చెందిన పల్లిబాణపెరుమాళ్ అనే రాజు బౌద్ధ సన్యాసిగా దేశాన్ని విడిచిపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పురాణానికి సంబంధించినవే కొట్టాయం తాలూకాలోని కిలిరూర్ ఆలయం, అలప్పుళ తాలూకాలోని నీలంపేరూర్ ఆలయం. ఈ రెండు ఆలయాల్లో పల్లిబాణపెరుమాళ్ స్మారక చిహ్నాలు ఉన్నాయి.[12]

కిలిరూర్, కుట్టంపేరూర్, కొడుంగల్లూర్, అర్థుంకల్ లాంటి అనేక దేవాలయాలు ఒకప్పుడు బౌద్ధ దేవాలయాలుగా ఉండేవని నమ్ముతారు. త్రిస్సూర్‌లోని పరువస్సేరి దుర్గా దేవి ఆలయం వద్ద బుద్ధుని ధ్యాన విగ్రహం కనుగొనబడింది. అదేవిధంగా, కున్నత్తూర్, కరునాగపల్లి తాలూకాలు, మావేలిక్కర, అంబలపుళ తాలూకాలలో కనుగొనబడిన అనేక బౌద్ధ విగ్రహాలు కేరళలో బౌద్ధమత వ్యాప్తిని చూపుతున్నాయి.

బౌద్ధమత పతనం 8వ శతాబ్దం ప్రారంభంలో మొదలైంది. ఏడవ శతాబ్దం నాటికి ఇది బలహీనపడటం ప్రారంభించిందని చైనా యాత్రికుల వర్ణనల ద్వారా తెలుస్తుంది.[13] అయితే, 12వ శతాబ్దంలో రాయబడిన తిరునిళల్ మాలలోని పద్యాలు, కేరళ ఇంకా చాతుర్వర్ణ్య వ్యవస్థ కింద విభజించబడలేదని చూపుతున్నాయి. బ్రాహ్మణవాదం ప్రవేశపెట్టడంతో, రాజులు బౌద్ధమతానికి వ్యతిరేకంగా మారారు. తత్ఫలితంగా, బౌద్ధమత ప్రభావం క్రమంగా క్షీణించింది. వైష్ణవ కులశేఖర పాలనలో, 11వ శతాబ్దంలో బౌద్ధమతం దాదాపు పూర్తిగా కనుమరుగైంది.

శ్రీ మూలవాసం (త్రిక్కున్నపుజ సమీపంలో) కేరళలోని ప్రసిద్ధ బౌద్ధ కేంద్రం.[14] ఆయ్ రాజు విక్రమాదిత్య వరగుణుడు ప్రసిద్ధ శ్రీమూలవాసం బౌద్ధ పుణ్యక్షేత్రాన్ని రక్షించాడని చెబుతారు. అతను ఆలయానికి పెద్ద భూభాగాన్ని దానం చేశాడు. శాసనంలో బుద్ధుడు, ధర్మాన్ని కీర్తించే మంగళాచరణం విశేషమైనది. అయితే, 10వ శతాబ్దం నాటికి, ఈ కేంద్రం పేరును కోల్పోయింది.

కేరళలో బుద్ధుని విగ్రహాలు

[మార్చు]
అలప్పుళకు చెందిన కరుమడికుట్టన్ విగ్రహం

తరువాతి కాలపు హిందూ పాలకుల హయాంలో బౌద్ధ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయని లేదా హిందూమతంగా మార్చబడ్డాయని నమ్ముతారు. కానీ అరుదైన బుద్ధ విగ్రహాలు చెక్కుచెదరకుండా కనుగొనబడ్డాయి. ఇవి ప్రధానంగా కొల్లాం జిల్లాలోని మావేలిక్కర, మరుతుర్, కులంగర, కరుమడి, భరణిక్కావు, కున్నత్తూర్, పల్లిక్కల్ వద్ద కనుగొనబడ్డాయి. [15] పల్లిక్కల్ ఆలయంలోని విగ్రహం తల లేకుండా ఉండేది. నేడు దీనిని తిరువనంతపురంలోని మ్యూజియంలో భద్రపరిచారు. విగ్రహం తల భాగం లాంటి రాయితో తయారు చేయబడి జోడించబడింది.[16] మావేలిక్కర విగ్రహం కండియూర్ శివాలయం సమీపంలోని పొలంలో కనుగొనబడింది. చరిత్రకారుడు ఎస్. ఎన్. సదాశివన్ ప్రకారం,[17] సా.శ. 450 వరకు కండియూర్ శివాలయంలో ఇదే ప్రధాన దైవం. విగ్రహాలన్నీ రాతితో చెక్కబడినవి. అవన్నీ యోగాసన రూపంలో ఉంటాయి, పాదాల నుండి తలపాగా వరకు 2-3 అడుగుల పొడవు ఉంటాయి. చాలా విగ్రహాలు పద్మాసనంలో ధ్యానంలో కూర్చున్నట్లు చెబుతారు. ఆంత్రోపాలజీ రికార్డుల ప్రకారం మరుతుర్ కులంగరలోని విగ్రహం అన్నింటికంటే పురాతనమైనది.[18][19] ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది ఆలయానికి సమీపంలోని చెరువులో కనుగొనబడింది. అంబలపుళలో తోట్టప్పిల్లి సమీపంలో కనుగొనబడిన నల్లని ధ్యాన విగ్రహాన్ని కరుమడికుట్టన్ అని పిలుస్తారు. మావేలిక్కర వద్ద అతిథి గృహం సమీపంలో లభించిన బుద్ధ విగ్రహాన్ని శ్రీ కృష్ణస్వామి ఆలయం సమీపంలోని పబ్లిక్ రోడ్డుపై ఉంచారు.[20] భరణిక్కావు నుండి లభించిన బుద్ధుని విగ్రహం సా.శ. 9వ శతాబ్దానికి చెందినది.[21] పి. సి. అలెగ్జాండర్, ఎస్. ఎన్. సదాశివన్ అనే ఇద్దరు చరిత్రకారులు కేరళలో బౌద్ధమతం గురించి విస్తృతంగా రాశారు. వారి ప్రకారం, ఈ బుద్ధుని విగ్రహాలు అనురాధపుర శైలిలో తయారు చేయబడ్డాయి. [22][23]

సాంస్కృతిక ప్రాముఖ్యత

[మార్చు]

కేరళ సంస్కృతిలో బౌద్ధమత ప్రభావం గణనీయమైనది. ఎళుత్తు కలరి, పల్లికూడం పాఠశాలలు చారిత్రాత్మకంగా బౌద్ధమత ప్రభావంలో ఉండేవి.[24] 18వ శతాబ్దం చివరి వరకు, బుద్ధుని కీర్తిస్తూ కేరళలో విద్యా శిక్షణ ప్రారంభంలో 'నమోస్తు జినతాం' (నమోతు చినతాం) అనే పదాన్ని ఉపయోగించేవారు. దీని అర్థం జినన్ లేదా బుద్ధునికి ప్రార్థన. ఆ సమయంలో, కేరళలో మొత్తం పాఠ్యాన్ని నానం మానం అని పిలిచేవారు. ఇది నానం, మోనం, ఎట్టనం, తువనం, జీనం, ఎన్ననం, తానం, ఉమ్మనం అనే పాలి పద్యం సంక్షిప్త రూపం. ఇవి ఎనిమిది ఉన్నత మార్గాలు: సరైన దృక్పథం, సరైన లక్ష్యం, సరైన వాక్కు, సరైన చర్య, సరైన జీవన విధానం, సరైన ఏకాగ్రత, సరైన ప్రయత్నం.[25]

ఆయుర్వేదం

[మార్చు]
చోవల్లూర్ ఆలయ నిర్మాణం

బౌద్ధ ఉద్యమ మూలస్తంభాలలో ఒకటి ఆ ప్రాంతంలో వైద్య పద్ధతులను ప్రోత్సహించడం. వారు ఆసుపత్రులు, బౌద్ధ ఆరామాలు, చైత్యాల ద్వారా సమాజంలోని అనేక వర్గాలకు చేరువయ్యారు.[మూలాలు అవసరం] అశోకుడు స్వయంగా అనేక ప్రదేశాలలో ఔషధ మొక్కలను స్థాపించాడు.[మూలాలు అవసరం] ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, వైద్యుడు అయిన భదంత నాగార్జున కేంద్రంలో 18 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చేర్తాలలోని తిరువిళకు వచ్చాడు, అక్కడ అతను వైద్యం నేర్పించాడని, రోగులకు చికిత్స చేశాడని చెబుతారు.[మూలాలు అవసరం] రస వైశేషిక సూత్ర అనే తన రచన ద్వారా ఆయుర్వేద రంగానికి భదంత నాగార్జున చేసిన కృషి అత్యంత విలువైనది.[26]

మాళవిక బిన్నీ 'ప్లాంట్స్, పవర్ అండ్ నాలెడ్జ్: యాన్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ది ఇంపీరియల్ నెట్‌వర్క్స్ అండ్ ది సర్క్యూట్స్ ఆఫ్ బొటానికల్ నాలెడ్జ్ అండ్ మెడికల్ సిస్టమ్స్ ఆన్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా అగైన్స్ట్ ది బ్యాక్‌డ్రాప్ ఆఫ్ యూరోపియన్ ఎక్స్‌పాన్షనిజం' అనే పేరుతో గ్లోబల్ హిస్టరీస్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనా పత్రంలో, కేరళను ఆయుర్వేద సంప్రదాయంగా పిలవడానికి ముందే వైద్య సంప్రదాయాలు ఉన్నాయని పేర్కొంది. రచయిత్రి ప్రకారం, కేరళలో ఉన్న ఇతర వైద్య సంప్రదాయాలలో ప్రాముఖ్యత సంతరించుకున్న 'వైద్యం' (హీలింగ్ ప్రాక్టీసెస్) సంప్రదాయంలో బౌద్ధమత సహకారం గణనీయంగా ఉంది, ఇది ఆరవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు ప్రధాన శక్తిగా ఉండేది. వ్యాధులకు బౌద్ధులు అందించిన ఔషధ నివారణలు, స్థానికులు సంరక్షించిన దేశీయ మొక్కల జ్ఞానాన్ని యూరోపియన్లు తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు, మలబార్ వృక్షజాలంపై ఎత్నో-బొటానికల్ గ్రంథమైన హార్టస్ మలబారికస్ సంకలనంలో ఇట్టి అచ్యుతన్‌ను చేర్చడం ద్వారా ఇది సూచించబడుతుంది.[27]

వాస్తుకళ

[మార్చు]

ఒకప్పుడు జైన, బౌద్ధ సన్యాసులు ధ్యానం చేయడానికి ఉపయోగించిన కేరళలోని గుహ దేవాలయాలు (ఉదాహరణకు త్రిక్కూర్ మహాదేవ ఆలయం), రాతిని తొలిచి చేసిన వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం క్షీణించడంతో, అవి హిందూ దేవాలయాలుగా మార్చబడ్డాయి. ప్రాచీన కాలంలో కేరళలో కొన్ని బౌద్ధ స్థూపాలు ఉన్నప్పటికీ, కేరళ సాంప్రదాయ వాస్తుశిల్పం, ముఖ్యంగా హిందూ దేవాలయాల సందర్భంలో, బౌద్ధ రూపకల్పన ముఖ్యమైన ప్రభావాలను చూపదు.

ఆలయ ఆచారాలు

[మార్చు]
చెట్టికులంగర ఆలయంలో కెట్టుకాళ్చ

వేడికెట్టు, కటిన, పారయెడుప్పు, పడయని, పూరం, కెట్టుకాళ్చ, రథోత్సవం లాంటి ఆలయ ఆచారాలు బౌద్ధుల కానుకలు. బౌద్ధ ఆరామాలతో పాటు, వారు పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను నడిపారు.[28]

హిందూ సంప్రదాయాలు, ఆచారాలపై శ్రమణ ప్రభావాలు

[మార్చు]
  • తెయ్యం, ఇది కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో (ప్రధానంగా కోలతునాడు ప్రాంతంలో), దక్షిణ కర్ణాటకలో ఒక ప్రసిద్ధ ఆచార ఆరాధన రూపం. ఈ పదం మలయాళం, తమిళంలో దేవుడు అని అర్థం వచ్చే 'దైవం' లేదా 'తైవం' పదానికి రూపాంతరం కావచ్చు.[29]
  • పల్లిపాన, అంబలపుళ శ్రీ కృష్ణస్వామి ఆలయంలో ఆరట్టు పండుగ సమయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వేలన్‌లు (మాంత్రికులు) నిర్వహించే ఒక ఆచారం.[మూలాలు అవసరం]
నీలంపేరూర్ పడయని
  • పూరం పడయని, వనదుర్గ దేవిని కీర్తిస్తూ నీలంపేరూర్ పల్లి భగవతి ఆలయంలో జరిగే పండుగ, ఇది బీహార్‌లోని పాట్నాలో ఫాహియాన్ చూసిన బౌద్ధ పండుగను పోలి ఉంటుందని భావిస్తారు.[మూలాలు అవసరం] అద్భుతంగా అలంకరించబడిన 'కెట్టుకాళ్చ' అనే దిష్టిబొమ్మల ప్రదర్శన దీని ప్రధాన ఆకర్షణ. పడయని అనేది దారికను వధించిన తర్వాత కాళికా దేవి సాధించిన ప్రతీకాత్మక విజయయాత్ర.[మూలాలు అవసరం]
  • చెట్టికులంగర దేవి ఆలయంలో 'కెట్టుకాళ్చ', ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళి దేవి.[మూలాలు అవసరం]
  • తమిళ పౌరాణిక ఇతిహాసాలలో ప్రసిద్ధి చెందిన కన్నగిగా, శ్రీలంక సింహళ బౌద్ధులచే పత్తిని దేవిగా పూజలందుకునే కొడుంగల్లూర్ భగవతి (భద్రకాళి) గౌరవార్థం కొడుంగల్లూర్ భరణి పండుగ.[మూలాలు అవసరం]
  • వలియకులంగర దేవి ఆలయంలో వలియకులంగర కెట్టుకాళ్చ[మూలాలు అవసరం]
  • కొడుంగల్లూర్ భగవతి ఆలయంలో తలప్పోలి పండుగ[మూలాలు అవసరం]

కేరళకు చెందిన ప్రసిద్ధ బౌద్ధులు

[మార్చు]

అమరసింహుడు

[మార్చు]

అమరకోశం రచయిత. ఇతను మావేలిక్కర సమీపంలోని తకళి గ్రామ పంచాయతీలో నివసించాడు. తకళిలో 20 ఏళ్లు నివసించిన తర్వాత అతను అమరకోశం రాశాడు. ఆ తర్వాత అతను శ్రీలంక వెళ్లాడు, అక్కడ అతను సింహన్ అనే బిరుదును అందుకున్నాడు, తరువాత విక్రమాదిత్యుని దేశానికి వెళ్ళాడు. విక్రమాదిత్య రాజు పాలనలో నివసించిన 'నవరత్నాలలో' అమరసింహుడు ఒకడు.[30]

చితలై చత్తనార్

[మార్చు]

చత్తనార్ లేదా చితలై చత్తనార్ మణిమేకలై అనే ఇతిహాసాన్ని రచించిన తమిళ కవి. సంగం సాహిత్యానికి చెందిన మొత్తం 11 పద్యాలు సత్తనార్‌కు ఆపాదించబడ్డాయి, ఇందులో తిరువళ్లువ మాలై 10వ పద్యం కూడా ఉంది. సంగం కాలం నాటి ప్రసిద్ధ రాజులు బౌద్ధులు.[మూలాలు అవసరం] అప్పటి బౌద్ధ ప్రభావాన్ని వెల్లడించే ప్రసిద్ధ రచనలలో ఒకటైన శిలప్పదికారం (చిలపతికారం). శిలప్పదికారంకు కొనసాగింపు అయిన మణిమేకలై రాసిన బౌద్ధ సన్యాసి చితలై చత్తనార్. జైనమతం నుండి బౌద్ధమతంలోకి మారడం మణిమేకలై ఇతివృత్తం. అతను చేరన్ సెంగుట్టువన్‌కు సమకాలికుడు, బౌద్ధమతాన్ని ఆచరించాడని నమ్ముతారు. పురనానూరు అనే సంగం రచనలో పాండ్య రాజు చిత్తిర మాదత్తు తుంజియ నన్మారన్‌ను కీర్తిస్తూ అతను పాడాడు.

ఆర్యదేవన్

[మార్చు]

ఆర్యదేవన్ 5-6వ శతాబ్దాలలో జీవించిన బౌద్ధ పండితుడు. అతను నాగార్జునుని అనుచరుడు, చతుసిక రాశాడు. అతను కొడుంగల్లూర్‌లోని సెంబపురంలో (ప్రస్తుత శృంగపురం) నివసించాడు. చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, ఆర్యన్‌ను వర్ణించాడు.[మూలాలు అవసరం]

పల్లివాణ పెరుమాళ్

[మార్చు]

పల్లి వాణప్పెరుమాళ్ లేదా పల్లిబాణ పెరుమాళ్ మహోదయపురం (ప్రస్తుత కొడుంగల్లూర్) కేంద్రంగా పాలించిన చేరవంశానికి చెందిన ప్రసిద్ధ రాజు. అతను 15-16వ శతాబ్దాలలో జీవించినట్లు పరిశోధకులు నిర్ధారించారు. కేరళలో బౌద్ధమతానికి సంబంధించిన చివరి ప్రచారకుడు ఇతనే.[31]{{SAFESUBST:#invoke:Unsubst||date=__DATE__ |$B= -->[మూలాన్ని నిర్థారించాలి] అతని మొదటి ఆలయం కొడుంగల్లూర్ సమీపంలోని పల్లి భగవతి ఆలయం. అయితే, అతను కొడుంగల్లూర్‌ను విడిచిపెట్టి కుట్టనాడ్‌కు వెళ్లి అక్కడ అనేక బౌద్ధ దేవాలయాలు, చైత్యాలను నిర్మించాడు.[మూలాలు అవసరం] చారిత్రక రికార్డుల ప్రకారం, పల్లి బాణప్పెరుమాళ్ స్థానికులకు ఇష్టమైనవాడు. నీలంపేరూర్, కిలిరూర్ పడయనిలలో అతని ప్రభావం చూడవచ్చు.[32]{{SAFESUBST:#invoke:Unsubst||date=__DATE__ |$B= -->[మూలాన్ని నిర్థారించాలి]

బాలచంద్రన్ చుల్లిక్కాడు

[మార్చు]

బాలచంద్రన్ చుల్లిక్కాడు (జననం 1957) మలయాళ కవి, వక్త, నటుడు, అతను 2000లో బౌద్ధమతాన్ని స్వీకరించాడు, హిందూమతంపై తీవ్ర విమర్శకుడిగా మారాడు.[33]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • కేరళలోని బౌద్ధ ప్రదేశాలు, సంప్రదాయాల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. ↑ Menon, A. Sreedhara (2022) [1967]. A Survey of Kerala History. Kottayam: DC Books. pp. 87–88.
  2. 1 2 3 4 Gurukkal, Rajan; Varier, Raghava (2020) [2018]. History of Kerala: Prehistoric to the Present. Hyderabad: Orient Blackswan. pp. 58 and 6-7.
  3. 1 2 3 4 5 6 Veluthat, Kesavan (2009). The Early Medieval in South India. Oxford India Paperbacks. Delhi: Oxford University Press. p. 180. ISBN 9780198069140.
  4. ↑ Narayanan, M. G. S. (1972). "Vikramaditya Varaguna and Srimulavasa Vihara". Cultural Symbiosis in Kerala. Trivandrum: Kerala Historical Society. pp. 9-16 and 44-45.
  5. ↑ Mavelikarayude Samaskarika Charithram,, unpublished work, Mavelikkara Muncipility, 2007 P, 76
  6. 1 2 എ., ശ്രീധരമേനോൻ (1997). കേരള ചരിത്രം. ചെന്നൈ: എസ്. വിശ്വനാഥൻ പ്രിൻറേർസ് ആൻഡ് പബ്ലീഷേർസ്.
  7. ↑ Raghava variyar 1979: pages 35,37
  8. ↑ വാരിയർ, രാഘവ; രാജൻ ഗുരുക്കൾ (1992). കേരള ചരിത്രം. ശുകപുരം: വള്ളത്തോൾ വിദ്യാപീഠം.
  9. ↑ S. N., Sadasivan (2000). A Social History of India. APH. ISBN 9788176481700.
  10. ↑ Rao Bahadur Krishnaswāmi Aiyangar (1927), Maṇimekhalai in its Historical Setting, p. xxvii, p. 85, 104, 188
  11. ↑ Cō. Na Kantacāmi (1978). Buddhism as Expounded in Manimekalai. Annamalai University. p. 394.
  12. ↑ പി.ഒ., പുരുഷോത്തമൻ (2006). ബുദ്ധന്റെ കാല്പാടുകൾ-പഠനം. കേരളം: പ്രൊഫ. വി. ലൈല. ISBN 81-240-1640-2.
  13. ↑ Alexander 1949: page:173
  14. ↑ രാമചന്ദ്രൻ, സി.കെ. (2008-07-27). "വാഗ്‌ഭടനെത്തേടി ശ്രീലങ്കയിൽ". മാതൃഭൂമി വാരാന്തപ്പതിപ്പ്. Archived from the original on 2008-07-29. Retrieved 2008-07-28.
  15. ↑ രാമനാഥ ഐയ്യർ, എ.എസ്. (1908). Travancore archeological series, Volume V Part I, II & III. തിരിവനന്തപുരം: കേരള സാംസ്കാരിക പ്രസിദ്ധീകരണ വകുപ്പ്.
  16. ↑ Sekher, Dr Ajay S (January 3, 2010). "Buddhism in Kerala".[permanent dead link]
  17. ↑ A Social History of India, A.P.H. Publishing: New Delhi (2000)
  18. ↑ ഗോപിനാഥ റാവു, ടി.എ. (1908). Travancore archeological series, Volume I. തിരിവനന്തപുരം: കേരള സാംസ്കാരിക പ്രസിദ്ധീകരണ വകുപ്പ്.
  19. ↑ Sekher, Ajay. "The Broken Buddha of Pattanam, Boddhisatvas in Disguise and the Silent Siddha of Kayikara: Iconology, Histories and Textuality of Buddha Idols in Kerala" – via www.academia.edu. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  20. ↑ അജയ്, ശേഖർ (11 January 2016). "Humanist spirit of Mahabali/Maveli".
  21. ↑ K. R. C. Menon, Buddhamatham Keralithil, Aasriya Mathirnadu: 2011April, p5
  22. ↑ P. C. Alexander, Buddhism in Kerala, Annamalai University, 1984;
  23. ↑ S.N. Sadasivan, A Social History of India, APH, 2007).
  24. ↑ Gopalakrishnan, P.K. (1991). Keralathinte Samskarika Charithram. Tvm.: Kerala Basha Institute. p. 256.
  25. ↑ Panikassery, Velayudhan. Kerala Charitratinte Ullarakalileku. Thrissur, Current, 2012.
  26. ↑ "Rasavaisheshik Sutra with Narasimha Bhashya". 1976.
  27. ↑ Power and Knowledge:/[permanent dead link] Plants, Power and Knowledge: An Exploration of the Imperial Networks and the Circuits of Botanical Knowledge and Medical Systems on the Western Coast of India Against the Backdrop of European Expansionism (2015) - Malavika Binny, Global Histories, Vol. 1, No. 1 (Dec. 2015), pp. 3–20 at Retrieved on 9 June 2021.
  28. ↑ Sanku Iyer, S. Keralavum Buddhamathavum. Kottayam: N.B.S. p. 218.
  29. ↑ Diplomat, Sugato Mukherjee, The (14 August 2015). "The Oracles of Malabar". The Diplomat. Archived from the original on 20 December 2017. Retrieved 20 December 2017.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  30. ↑ Prasanth, R. I. (6 June 2016). "Lost Word is Lost World - A Study of Malayalam" (PDF). Language in India. 16 (6). ISSN 1930-2940. Archived from the original (PDF) on 2017-03-31. Retrieved 2001-03-03.
  31. ↑ Ajay, Author (2013-03-11). "Pally Vana Perumal and Pally Temples in Kerala". Ajaysekher.net (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-17. Retrieved 2021-07-17. {{cite web}}: |first= has generic name (help)
  32. ↑ Dinamani, Pindiyath (22 June 2010). "What is PADAYANI??". നീലംപേരൂര്‍ പടയണി. Archived from the original on 8 September 2011. Retrieved 23 August 2021.
  33. ↑ "Rediff on the NeT: Malayalam poet embraces Buddhism".