కేవీఆర్ మహేంద్ర
కేవీఆర్ మహేంద్ర | |
---|---|
జననం | కేవీఆర్ మహేంద్ర మార్చి 11 |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత |
కేవీఆర్ మహేంద్ర (జ. మార్చి 11) తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. 2019లో వచ్చిన దొరసాని సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోని అడుగుపెట్టాడు.[1]
జననం
[మార్చు]మహేంద్ర, మార్చి 11న వరంగల్ పట్టణ జిల్లా, హసన్‌పర్తి మండలం లోని జైగిరి గ్రామంలో జన్మించాడు.[2]
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]2002లో పీపుల్స్ భారతక్క సినిమా ద్వారా సినిమారంగం ప్రవేశ చేసిన మహేంద్ర, ఆ తరువాత కొన్ని సినిమాలకు కో-డైరెక్టర్ గా పనిచేశాడు. మహేంద్ర తెలంగాణ ఉద్యమం నేపథ్యంపై 'నిశీధి' పేరుతో లఘుచిత్రాన్ని తీశాడు.[3] ఆ లఘుచిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికల్లో ప్రదర్శించబడటమేకాకుండా 18 దేశాలనుంచి 39 జాతీయ, అంతర్జాతీయ అవార్డులును అందుకుంది.[4] ఇండోర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు అవార్డు, పూణే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును గెలుచుకుంది. 21వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 60 దేశాల నుండి వచ్చిన 2500 చిత్రాలలో నిశీధి 25వ స్థానంలో నిలిచింది.[5]
సినిమారంగంలో మహేంద్ర, తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా 2019లో దొరసాని సినిమాను రూపొందించాడు. మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్నకుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటించారు.[6]
దర్శకత్వం చేసినవి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (11 July 2019). "శివాత్మికలో నిజంగానే 'దొరసాని' ఉంది". Archived from the original on 11 March 2020. Retrieved 11 March 2020.
- ↑ ప్రజాశక్తి, మూవీ (11 July 2019). "నాపై శ్యామ్ బెనగల్ నమ్మకాన్ని పెంచారు : కేవీఆర్". Archived from the original on 12 July 2019. Retrieved 11 March 2020.
- ↑ telugu, NT News (2023-06-22). "Telangana | తెలంగాణ తల్లి నుదుట సాంస్కృతిక తిలకం". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-06-22.
- ↑ ఆంధ్రభూమి, చిత్రభూమి (11 July 2019). "దొరసాని.. అలా వచ్చింది". Archived from the original on 12 July 2019. Retrieved 11 March 2020.
- ↑ The Hindu, Metroplus (9 December 2015). "Men behind the movement". Neeraja Murthy. Archived from the original on 11 March 2020. Retrieved 11 March 2020.
- ↑ సాక్షి, సినిమా (12 July 2019). "నాపై నాకు నమ్మకం పెరిగింది". Archived from the original on 12 July 2019. Retrieved 11 March 2020.
- ↑ Namasthe Telangana (21 September 2023). "'భరతనాట్యం' టైటిల్‌తో దొరసాని దర్శకుడు కొత్త సినిమా.. హీరో ఎవరంటే". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.