కేశాపురం(చిన్నమండెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కేశాపురం(చిన్నమండెం)" కడప జిల్లా చిన్నమండెం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ 516 214., ఎస్.టి.డి. కోడ్ = 08561. [1]

కేశాపురం(చిన్నమండెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చిన్నమండెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516214
ఎస్.టి.డి కోడ్ 08561
  • కేశాపురం గ్రామం దేవళంపేటలో వెలసిన శ్రీ పాలేటమ్మ తిరునాళ్ళు, 2014,మార్చి-18,19 తేదీలలో నిర్వహించారు. ఈ గ్రామములో నెలకొనియున్న శ్రీ పాలేటమ్మ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి తరువాత వచ్చు విదియ, తదియలలో నిర్వహించెదరు. కోరిన వరాలిచ్చే తల్లిగా పేరెన్నికగన్న పాలేటమ్మకు చిన్నమండెం, కలిబండ, పడమటికోన, బోనమల, కేశాపురం, జిల్లా సరిహద్దు గ్రామాలలో పౌర్ణమి నుండియే, బోనాలు సమర్పించెదరు. విదియరోజున ఉదయం నుండి, దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. సాయంత్రం సిద్దల బోనాలు సమర్పించడంతో, తిరునాళ్ళు ప్రారంభమగును. మొక్కులు ఉన్నవారు కట్టే చాందినీ బండ్లు రాత్రికి తిరుగుతవి. తదియరోజు తిరునాళ్ళు ఉండును. ఈ కార్యక్రమం కొరకు, ఆలయానికి రంగులద్ది, విద్యుద్దీపాలతో అలంకరించెదరు. కడప - బెంగుళూరు జాతీయ రహదారిలో అమ్మవారిని దీపాలతో ఏర్పాటుచేస్తారు. ఈ తిరునాళ్ళకు జిల్లా నలుమూలల నుండియేగాక, చిత్తూరు, అనంతపురం సరిహద్దు మండలాల నుండి గూడా భక్తులు వేలసంఖ్యలో తరలి వస్తారు. [1]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-04. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014,మార్చి-20; 15వ పేజీ.