కేసరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కేసరి (Kesari) రామాయణంలో ఒక వానర వీరుడు. ఇతనికి అంజని వలన హనుమంతుడు జన్మించాడు.

ప్రభాస తీర్థమున శంఖము మరియు శబలము అను ఏనుగులు మునులను బాధించుచుండగా, ఇతడు వానిని సంహరించెను. భరద్వాజుడు అందుకు మెచ్చుకొని ఏనుగులను చంపెను గనుక కేసరి అని పేరుపెట్టెను. చేసిన మేలుకు వరము ఇచ్చెద కోరుకొమ్మనెను. అంతట కామరూపి, బలాఢ్యుడు అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరెను. కేసరి కి అంజనకు వివాహమయ్యెను. వారికి ఆంజనేయుడు జన్మించెను.

మూలాలు[మార్చు]

  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ: 111.
"https://te.wikipedia.org/w/index.php?title=కేసరి&oldid=814369" నుండి వెలికితీశారు