కైనన్ చెనై
| Personal information | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Full name | కైనన్ డారియస్ చెనై | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| National team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Born | 1991 జనవరి 29 హైదరాబాద్, తెలంగాణా, భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | షూటింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Event | ట్రాప్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కైనన్ డారియస్ చెనై (జననం 29 జనవరి 1991) ట్రాప్ షూటింగ్లో ప్రత్యేకత కలిగిన భారతీయ క్రీడా షూటర్. ఒలింపిక్స్, ఆసియా క్రీడలతో సహా పలు అంతర్జాతీయ పోటీలలో ఇతడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు 2016 వేసవి ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని పురుషుల ట్రాప్ ఈవెంట్లో 19వ స్థానంలో నిలిచాడు.[1] 2022 ఆసియా క్రీడలలో, చెనై పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని, వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ క్రీడలలో షూటింగ్‌లో భారతదేశం అత్యధిక పతకాలను గెలుచుకోవడానికి ఇతడు గణనీయంగా దోహదపడ్డాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]కైనన్ భారతదేశంలోని హైదరాబాదులో ఒక ప్రముఖ పార్సీ కుటుంబంలో జన్మించాడు. వృత్తి రీత్యా వ్యాపారవేత్త అయిన ఇతని తండ్రి డారియస్ చెనై ట్రాప్ విభాగంలో జాతీయ షూటింగ్ ఛాంపియన్ కూడా. తమిళనాడు ఊటీ హెబ్రాన్ స్కూల్లో జర్మన్ భాషను విదేశీ భాషగా ఎంచుకొని ఇతడు చదువుకున్నాడు. తన పాఠశాల రోజుల్లో, ఇతడు ఫీల్డ్ హాకీ, ఫుట్బాల్ క్రీడలు ఆడేవాడు. మూడు సంవత్సరాలు పాఠశాల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఛాంపియన్‌గా కూడా ఉన్నాడు. ఇతడు బ్రూనెల్‌లో 1 సంవత్సరం గడిపాడు, అక్కడ ఇతడు హాకీ ఆడటానికి ప్రయత్నించాడు.
క్రీడా జీవితం
[మార్చు]2003లో, ఇతడు షూటింగ్‌ను ప్రారంభించి, ప్రారంభంలో తండ్రిచేత శిక్షణ పొందాడు. తరువాత ఇతనికి నాలుగుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ మన్షేర్ సింగ్ శిక్షణ ఇచ్చాడు. భారతదేశంలో జరిగిన 50వ, 51వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లలో జూనియర్ పురుషుల ట్రాప్ షూటింగ్ ఈవెంట్లో ఇతడు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 2008 కామన్వెల్త్ యూత్ గేమ్స్ ట్రాప్ ఈవెంట్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.[2]
28 జనవరి 2016న ఢిల్లీలో జరిగిన ఆసియా ఒలింపిక్ షూటింగ్ క్వాలిఫైయర్స్లో నాలుగో స్థానంలో నిలిచిన తరువాత 2016 వేసవి ఒలింపిక్స్‌కు ఒలింపిక్ కోటాను సాధించాడు. అక్కడ ఇతడు పురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్ రౌండ్లో 19వ స్థానంలో నిలిచాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "2016 Summer Olympics - Athletes: Kynan Chenai". ESPN. Retrieved 11 August 2019.
- ↑ "Know your Indian Olympian: 10 things to know about Kynan Chenai". Sportskeeda. 6 July 2016.
- ↑ "Road to Rio: Shooter Kynan Chenai secures Olympics 2016 berth for India". Firstpost. 29 January 2016.
- ↑ "Rio Olympics 2016: Manavjit Singh Sandhu, Kynan Chenai fail to qualify for men's trap semi-final". First Post. 9 August 2016. Retrieved 9 August 2016.